Y.S.R. Cuddapah

News March 25, 2024

నెల్లూరు జిల్లాలో కడప వాసి మృతి

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని చుంచులూరు సచివాలయ సమీపం వద్ద జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున రోడ్డు పై నడిచి వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ఈ రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా ఖాజీపేటకు చెందిన వలస కూలీ సురేశ్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.

News March 25, 2024

కమలాపురం: తేనెటీగల దాడిలో ఉపాధి కూలి మృతి 

image

తేనెటీగల దాడిలో ఉపాధి కూలి మృతి చెందినట్లు ఏపీవో సారధి తెలిపారు. ఏపీవో వివరాల మేరకు.. కమలాపురం మండలం గొల్లపల్లెకు చెందిన గురివిరెడ్డిగారి గంగిరెడ్డి కాల్వ పనులు చేస్తుండగా అక్కడే ఉన్న తేనెటీగలు ముక్కుమ్మడిగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయినట్లు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు 108 ద్వారా హాస్పిటల్ కు తరలించారు. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని ఆయన తెలిపారు.

News March 25, 2024

కడప: బీజేపీలో చేరిన టీడీపీ నేత బొజ్జా రోషన్న

image

కడప జిల్లా బద్వేలు టీడీపీ నేత బొజ్జ రోషన్న భారతీయ జనతా పార్టీలో చేరారు. టీడీపీ తరఫున బద్వేలు ఎమ్మెల్యే సీటును ఆశించడంతో ఆ సీటును కూటమి కుదుపులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో రోషన్న తన అనుచరులతో చర్చించి ఈరోజు కాషాయ కండువా కప్పుకున్నారు. కడప బీజేపీ కార్యాలయంలో ఆయనకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

News March 25, 2024

బద్వేలు బీజేపీ అభ్యర్థిగా రోషన్న.?

image

బద్వేలు నియోజకవర్గ కూటమి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొజ్జ రోషన్న ఎంపిక కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఈయన ఎమ్మెల్యే టికెట్ ఆశించగా, కూటమి సర్దుబాటులో భాగంగా బద్వేలు స్థానం బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో రోషన్న నేడు బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఈయన పేరు వెలువడనుందని సమాచారం.

News March 25, 2024

ఒంటిమిట్ట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొట్టగా నడింపల్లి గ్రామానికి చెందిన లగమ వెంకటసుబ్బారెడ్డి అలియాస్ గోపాల్ రెడ్డి, ఆదెన రామచంద్రారెడ్డి మృతి చెందారు. ఒంటిమిట్ట నుంచి నడింపల్లికి బైక్‌పై వెళ్తుండగా, కడప నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటసుబ్బారెడ్డి ఘటనా స్థలంలో మృతి చెందగా, రామచంద్రారెడ్డి మార్గమధ్యలో చనిపోయారు.

News March 25, 2024

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

image

1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.  2004లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత సొంత పార్టీ పరాజయాల అనంతరం బీజేపీలో చేరారు.

News March 25, 2024

ప్రొద్దుటూరు నుంచి సీఎం జగన్ రూట్ మ్యాప్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఎన్నికల ప్రచారానికి ప్రొద్దుటూరు నుంచి శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 27న ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి, అనంతరం వేంపల్లె, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు. బైపాస్ లోని వాసవి సర్కిల్ నుంచి, సినీహబ్, శివాలయం సర్కిల్, రాజీవ్ సర్కిల్, కొరప్రాడు రోడ్డు మీదుగా సభా స్థలి వద్దకు చేరుకుంటారు.

News March 25, 2024

అన్నమయ్య: అన్న ఎంపీగా.. తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ

image

రాజకీయాల్లో నల్లారి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములైన కిరణ్, కిషోర్‌లు తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో వారికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. AP అసెంబ్లీ స్పీకర్, CMగా కిరణ్ బాధ్యతలు నిర్వర్తించారు. TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిషోర్ కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో పీలేరు అసెంబ్లీ స్థానానికి కిషోర్, రాజంపేట MP స్థానానికి కిరణ్ పోటీ పడుతున్నారు.

News March 25, 2024

లింగాల: వేట కొడవలితో వ్యక్తిపై దాడి

image

లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లెలో ఆకుల లక్ష్మీ నారాయణపై వెన్నపూస నారాయణరెడ్డి అనే వ్యక్తి ఆదివారం రాత్రి వేట కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల లక్ష్మీనారాయణ కుటుంబంలోని మహిళ పట్ల నారాయణరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడని అతనిపై కేసు నమోదు చేయించారు. దీనిని మనసులో పెట్టుకున్న నారాయణరెడ్డి లక్ష్మీనారాయణపై దాడి చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు.

News March 24, 2024

రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా డాక్టర్ భాస్కరరావు

image

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రైల్వే కోడూరు కూటమి అభ్యర్థిగా డాక్టర్ యనమల భాస్కరరావును జనసేన పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. తాజాగా జనసేన పార్టీ తన పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తూ జాబితాని విడుదల చేసింది. ఇందులో ఎస్సీ రిజర్వుడు అయిన రైల్వే కోడూరు నియోజకవర్గానికి డాక్టర్ భాస్కర్ రావును ఎంపిక చేస్తూ, ఆయన విజయం కోసం జనసేన టీడీపీ శ్రేణులు పనిచేయాలని కోరారు.