India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో కడప పార్లమెంట్ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఆంధ్రకాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం వైఎస్సార్ ఘాటుకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నారు. వైఎస్సార్ ఘాట్ నుంచి నేరుగా కడప కౌంటింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లారు.
అసెంబ్లీ ఎన్నికల చివరి అంకం నేడే. అయితే ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన 149 మందికి అనుక్షణం తాము గెలుస్తామా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అటు వైసీపీ గతంలో 10కి 10 స్థానాల్లో గెలిచింది. మరి ఈ సారి ఏ పార్టీ ఎన్ని గెలిచేనో..?
గెలిస్తే: ఐదేళ్లు MLA.
అవకాశం వస్తే మంత్రి.
ఓడితే: రాజకీయ భవిష్యత్తు ఎటువైపన్నది కొందరికి ప్రశ్నార్థకం.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠకు నేడు తెరవీడనుంది. మరి కొద్ది గంటల్లో నేత భవిష్యత్ తేలిపోనుంది. కడప మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీలో ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యే ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జిల్లా కలెక్టర్ విజయరామ రాజు, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ నేతృత్వంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు.
నేడు కడపలో జరగబోయే ఎన్నికల కౌంటింగ్‌కు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు. కడప ఎన్నికల కౌంటింగ్ కేంద్ర వద్ద అధికారులకు దిశానిర్దేశం చేశారు. గొడవలకు ఎవరు ప్రయత్నించినా కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. కౌంటింగ్ పాసులు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించేది లేదన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన పెద్దముడియం పోలీస్ సిబ్బందిపై కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు. హౌస్ అరెస్టులో ఉన్న వ్యక్తిని ఇంటి బయటకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చిన పెద్ద ముడియం హెడ్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా సీఐ, ఎస్ఐలకు ఛార్జ్‌మెమో జారీ చేశారు. జమ్మలమడుగు డీఎస్పీకి షోకాజ్ నోటీసు ఇచ్చారు.
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఈనెల 4వ తేదీ నిర్వహించనున్న నేపథ్యంలో కౌంటింగ్ హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లకు పార్కింగ్ ప్లేసులను జిల్లా అధికారులు ఖరారు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లకు ఇందిరానగర్ ఎదురుగా, తెలుగుదేశం పార్టీ అలయన్స్ అభ్యర్థులు, ఏజెంట్లకు శిల్పారామం పక్కన ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులు, కౌంటింగ్ స్టాఫ్ కు మాంట్ ఫోర్ట్ స్కూల్లో పార్కింగ్ కేటాయించినట్లు తెలిపారు.
పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటకు చెందిన అన్నమయ్య(32) బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మరణించారు. పుల్లంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మంగళవారం కడప జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లను మూసివేస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ సిబ్బంది గ్రామాలపై నిరంతరం నిఘా ఉంచారని తెలిపారు.
రాయచోటి పట్టణం మాసాపేటలో మూడవ అంతస్తులో ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఇంటి గోడ కూలి మార్జాల లక్ష్మీప్రసన్న(40) అనే వాలంటీర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు మృతదేహాన్ని సందర్శించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Sorry, no posts matched your criteria.