Y.S.R. Cuddapah

News June 3, 2024

ఉమ్మడి కడప జిల్లాలో YCP-6, TDP-2

image

ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-2, YCP-6, BJP, జనసేన ఒక స్థానాల్లో గెలుస్తుందని తెలిపారు. బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, రాయచోటిలో YCP పాగా వేస్తుందని, రాజంపేట, మైదుకూరులో TDP గెలిచే అవకాశం ఉందన్నారు. కాగా జమ్మలమడుగు BJP, కోడూరులో జనసేన అభ్యర్థులు గెలుస్తారన్నారు. దీంతో YCP శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News June 3, 2024

రాయచోటి: వేదవతికి ఏ కష్టం వచ్చిందో..?

image

నిన్న రాయచోటిలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పుంగనూరు(M) భీమగానిపల్లెకు చెందిన వేదవతి మదనపల్లెకు చెందిన దస్తగిరిని ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటికే దస్తగిరికి పెళ్లి అయ్యి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమెకు ఏ కష్టం వచ్చిందో తెలియదు. డ్యూటీలో ఉండగా నిన్న సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత డ్యూటీ గదిలోనే గన్‌తో కాల్చుకుని చనిపోయారు.

News June 3, 2024

మైదుకూరుకు ఛాన్స్: ఆరా

image

కడప జిల్లాలో టీడీపీకి మైదుకూరు స్థానం ఒక్కటి గెలిచే ఛాన్స్ ఉందని ఓ ఇంటర్వ్యూలో ఆరా సర్వే సంస్థ ప్రతినిధి మస్తాన్ చెప్పుకొచ్చారు. అలాగే అంజాద్ బాషా స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల 12% ఓట్లు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరికొన్ని గంటల్లో ఇవి వాస్తవమా.. అవాస్తవమా అనేది తేలనుంది. దీనిపై మీ కామెంట్.

News June 3, 2024

కలసపాడు: కరెంట్ షాక్‌తో బాలుడు మృతి

image

కలసపాడులో ఆదివారం టైలర్స్ కాలనీలో మిద్దెపైన కరెంటు వైర్ తగిలి మస్తాన్ (9) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. బద్వేలు మండలం తొట్టిగారిపల్లెకు చెందిన సిద్దయ్య పెద్ద కుమారుడు మస్తాన్. వేసవి సెలవులకు తన తాత దగ్గరికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఇంటిపైన ఉన్న కరెంట్ తీగలను తగిలాయి. కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే చనిపోయాడు. మరణ వార్త విని తల్లిదండ్రులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News June 3, 2024

కడప: ASI కుమారుడి ఆత్మహత్య

image

పెండ్లిమర్రి మండలంలో ASIగా పనిచేస్తున్న పుల్లయ్య కుమారుడు సాయి కృష్ణ ఆదివారం కడప ప్రకాష్ నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు చిన్నచౌక్ ఎస్ఐ రఫీ తెలిపారు. సాయి కృష్ణ ప్రైవేట్‌గా చదువుకుంటూ ఇంటి వద్ద ఉంటున్నాడు. పుల్లయ్య అనారోగ్యం వల్ల రెండు రోజుల క్రితం కేరళ వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇంట్లో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 3, 2024

కడప: ఇద్దరి మద్య గొడవ.. పక్కనున్న మహిళకు గాయాలు

image

నందలూరు మండల పరిధిలోని చింతలకుంటలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. వారిని విడిపించడానికి ప్రయత్నించిన ఓ మహిళకు ప్రమాదవశాత్తు రాయి తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలింది. హుటాహుటిన ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 3, 2024

కౌంటింగ్‌కు నాలుగు అంచెల భద్రత: కడప ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఆదివారం కడప నగరం మౌంట్ ఫోర్ట్ స్కూల్లో పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, కేంద్ర సాయుధ బలగాలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కౌంటింగ్ సమయంలో పోలీసుల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ, డీఎస్పీలు పాల్గొన్నారు.

News June 2, 2024

కడప: కౌంటింగ్ సిబ్బందికి రెండవ విడత ర్యాండమైజేషన్

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం కౌంటింగ్ సిబ్బందికి రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా నియోజకవర్గాలకు విధులను కేటాయించడం జరిగిందని కడప జిల్లా ఎన్నికల అధికారి వి.విజయరామరాజు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కౌంటింగ్ సిబ్బందికి నియోజకవర్గాల వారీగా విధులను కేటాయించే రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. 4న ఉదయం 5.30కి 3వ ర్యాండమైజేషన్ నిర్వహిస్తామన్నారు.

News June 2, 2024

కడప జిల్లాలో టీబీ మందుల కొరత లేదు: జేడీ

image

వైఎస్సార్ కడప జిల్లాలో ఎక్కడా టీబీ మందులకు కొరత లేదని టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి.రమేష్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఆసుపత్రిలో అవసరమైన టీబీ మందులు లేవని జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఆయన పేర్కొన్నారు. కడప జిల్లాలో అవసరమైన స్థాయిలో టీబీ నివారణ మాత్రలు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 4 రోజులకు సరిపడా టీబీ మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.

News June 2, 2024

కడప జిల్లాలో 2500 మందితో భారీ బందోబస్తు: ఎస్పీ

image

ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు కడప ఎస్పీ తెలిపారు. జిల్లాలో కేంద్ర బలగాలతో సహా 2500 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా డే అండ్ నైట్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తారని, 55 పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. గొడవలు సృష్టించిన, పాల్పడినవారు జిల్లా బహిష్కరణకు గురవుతారని హెచ్చరించారు.