Y.S.R. Cuddapah

News March 21, 2024

కడపకు సీఎం జగన్.. బస్సుయాత్ర రూట్ మ్యాప్ ఇదే

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 27న కడప జిల్లాలో జరగనున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర రూట్ మ్యాప్‌లో రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. 27న ఉదయం ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి, అనంతరం వేంపల్లి, వీరపునాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారని పేర్కొన్నారు.

News March 21, 2024

కడప: ప్రశాంత ఎన్నికల కోసం అందరి సహకారం

image

ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అందరి సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లో ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం జేసీ గణేశ్ కుమార్, కడప కమిషనర్ ప్రవీణ్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటా ప్రచారం చేయాలన్నా కూడా అనుమతులు తప్పనిసరన్నారు. సభలు సమావేశాల నిర్వహణకు 48 గంటల ముందే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.

News March 20, 2024

రాజంపేట: వృద్ధుడు కనిపించడం లేదని ఫిర్యాదు

image

చిట్వేల్ మండలం దొగ్గలపాడుకు చెందిన కొండ్రెడ్డి నర్సింహా రెడ్డి (56) కనిపించడం లేదని తమకు ఫిర్యాదు అందిందని రాజంపేట పట్టణ ఎస్సై తెలిపారు. ఈ నెల 13 నుంచి వృద్ధుడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. తెల్ల రంగు పంచ, చొక్కా ధరించి ఉన్నాడని తెలిపారు. ఆచూకీ తెలిస్తే 91211 00570కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు.

News March 20, 2024

మైలవరం: 11 మంది వాలంటీర్ల తొలగింపు

image

దొమ్మరనంద్యాల గ్రామంలోని 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు బుధవారం మైలవరం ఎంపీడీఓ శంషాద్ భాను ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న జమ్మలమడుగు ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్యక్రమంలో పాల్గొని ఫోటోలు తీసుకోవడం, ర్యాలీలో వెళ్లడంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిచారని పేర్కొన్నారు. దీంతో వారిని తొలగించామన్నారు.

News March 20, 2024

మైదుకూరులో భారీగా గంజాయి స్వాధీనం

image

మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు పట్టణంలోని వీణ విజయ వీధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో వెళ్లి దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 12.100 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News March 20, 2024

ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగాలి: కలెక్టర్

image

జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం లక్కిరెడ్డిపల్లె జడ్పీ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద బయట వ్యక్తులు గుంపుగా ఉండడంపై విద్యాశాఖ, పోలీస్ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

News March 20, 2024

రైల్వే కోడూరు అసెంబ్లీ బరిలో జనసేన అభ్యర్థి..?

image

రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి గురించి ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా మంగళవారం నుంచి నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. పొత్తులో భాగంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించే అవకాశం వుండడంతో పవన్ కల్యాణ్ వాయిస్‌‌తో ‘రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా మద్దెల సుబ్బరాయుడుకు ఓటు వేస్తారా లేక నోటాకు వేస్తారా’ అంటూ సర్వే జరుగుతోంది. ఈయన ఇది వరకు జర్నలిస్ట్‌గా పని చేశారు.

News March 20, 2024

కడప: కోడ్ వచ్చినా.. కడపలో వీడని ఉత్కంఠ

image

ఎన్నికల కోడ్ వచ్చినా జిల్లాలో కొన్ని స్థానాలపై ఉత్కంఠ వీడలేదు. YCP అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమి 6 స్థానాలను ప్రకటించింది. ఇందులో ఇద్దరు కొత్తవారికి అవకాశం ఇచ్చింది. జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట, కోడూరు స్థానాలను ప్రకటించలేదు. జమ్మలమడుగు, బద్వేలు స్థానాలు పొత్తులో భాగంగా BJPకి.. రాజంపేట, కోడూరులో ఒకటి జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక కడప MPకి ముగ్గురు పోటీలో ఉన్నారు.

News March 20, 2024

నేడు కడప జిల్లాలో పర్యటించనున్న భువనేశ్వరి

image

TDP చీఫ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి మూడు రోజుల పాటు కడప, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించనున్నారు. 20, 21, 22వ తేదీల్లో ఆమె పర్యటన ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు అరెస్టుకు గురై జైలులో ఉండటాన్ని తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ‘నిజం గెలవాలి’ అనే పేరుతో పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం నుంచి జిల్లాలోని బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేస్తారు.

News March 20, 2024

జగన్ బస్సు యాత్ర సభకు ఏర్పాట్లను పరిశీలించిన రాచమల్లు

image

ప్రొద్దుటూరులో 27న సీఎం జగన్ నిర్వహించే బస్సు యాత్ర బహిరంగ సభకు మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. రైల్వే స్టేషన్ రోడ్డులో సభకు స్థలం అనువుగా ఉంటుందని వైసీపీ నాయకులతో ఆయన చర్చించారు. వైసీపీ ప్రోగ్రాం మెంబర్ చంద్రహాసరెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, JCS జిల్లా కోఆర్డినేటర్ కల్లూరు నాగేంద్ర రెడ్డి పాల్గొన్నారు.