India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింహాద్రిపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న దావూద్ హుస్సేన్ ఏపీ ఈసెట్‌లో 105 ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపల్ తాతాజీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి దావూద్ హుస్సేన్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుల బోధన, సహకారం వలన 105వ ర్యాంకు సాధించినట్లు తెలిపాడు. హుస్సేన్‌ను ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందించారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్న సందర్భంగా ఎలాంటి ఘర్షణలకు, అల్లర్లకు తావు లేని విధంగా ప్రశాంత కౌంటింగ్ కు పటిష్ఠ చర్యలను తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఈ మేరకు తాజాగా జిల్లా నుంచి 21 మంది రౌడీ షీటర్లను వారం రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అలాగే మరో 32 మంది రౌడీ షీటర్లను గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల లెక్కింపు సందర్భంగా జూన్ నెల 3, 4, 5వ తేదీలలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోటళ్లు, లాడ్జీలలో తనిఖీలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
కడప శంకరాపురంలోని ప్రభుత్వ అంధుల ఉన్నత పాఠశాలలో 2024 – 25 విద్యా సంవత్సరానికి 1 నుండి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల హెడ్మాస్టర్ శంకరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఈ ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులు చేరవచ్చని తెలిపారు. జూన్ 1 నుండి జూలై 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు.
వర్షం కోసం రైతు ఎదురు చూస్తుంటాడు. పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తుంటారు. అయితే ఏ రంగానికి సంబంధం లేకుండా అందరూ ఎదురు చూసే ఫలితాలు ఎన్నికల ఫలితాలు. దీంతో జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాల్లో తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని పలువురు బెట్టింగ్లు కాస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరలేవాలంటే 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చాపాడు పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఒక కేసుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా ఈనెల 6వ తేదీ వరకు పలు షరతులతో మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అరెస్టుతో సహా ఆయన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చాపాడు పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
ప్రొద్దుటూరులో రెండు కుటుంబాల మధ్య ఆస్తి విషయంలో ఇటీవల గొడవ జరిగింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో ఓ వ్యక్తికి రిమాండ్‌కు పంపే క్రమంలో నిందితుడిని కానిస్టేబుల్ రూ.5 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.2 వేలు ఇస్తామన్నా వినలేదు. దీనికి సంబంధించిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో కానిస్టేబుల్‌పై ACBకి ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే కానిస్టేబుల్ పై పలు ఆరోపణలు వచ్చాయన్నారు.
జూన్ 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాలు, కేంద్రాలకు వెళ్లే దారుల వెంబడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరి కదలికలను కెమెరాలు రికార్డు చేస్తాయనే విషయాన్ని గమనించాలన్నారు.
కడపలో నీటి సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావలని కడప నగరపాలక సంస్థ పేర్కొంది. ‘నీరు చాలా విలువైనది, కాబట్టి దానిని తెలివిగా వినియోగిద్దాం! ఇవాళ మనం పొదుపు చేసే ప్రతి చుక్క రేపటిని నిర్ధారిస్తుంది. నీటి సరఫరా సమస్యల గురించి విచారించడానికి 9949093772 నంబర్‌ను సంప్రదించాలి’ అంటూ X (ట్విటర్)లో పోస్ట్ చేసింది. చాలా ఆలస్యం కాకముందే నీటిని ఆదా చేద్దాం అనే నినాదంతో ముందుకువెళ్దామని పేర్కొంది.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కడప జిల్లాలో జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైన్యంలో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. 8.30కు EVMలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఉదయం 10-11గంటల మధ్య ఫలితాలపై కొంత స్పష్టత వస్తుందన్నారు.
Sorry, no posts matched your criteria.