Y.S.R. Cuddapah

News March 16, 2024

వైఎస్ జగన్ రాజకీయ చరిత్ర ఇదే

image

వైఎస్ జగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్‌లో ప్రారంభించి, 2009 మే నెలలో తొలిసారిగా కడప ఎంపీగా గెలిచారు. అనంతరం 2011 ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారు. 2014 పులివెందుల ఎమ్మెల్యేగా 75,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో, 2019లో 90,110 భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థిగా జగన్ చరిత్ర సృష్టించారు.

News March 16, 2024

కడప జిల్లాలో ఎన్నికల కోడ్.. కలెక్టర్, ఎస్పీ సమావేశం

image

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో కడప జిల్లాలో ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి వచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కలెక్టర్ కార్యాలయంలో మరికాసేపట్లో కీలక మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగే ఎన్నికల నిర్వహణ సంబంధించి పలు విషయాలను కలెక్టరు, ఎస్పీ వెల్లడిస్తారు.

News March 16, 2024

ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయ చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాది వద్ద నివాళులు అర్పించేందుకు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో సీనియర్ నాయకులు అభ్యర్థులను ప్రకటించనున్నారు.