Y.S.R. Cuddapah

News June 16, 2024

కడప: ప్రతిభ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

భారతదేశ ప్రభుత్వం, హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2025 రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా క్రీడలతో పాటు ఇతర రంగాల్లో ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా అవార్డులు అందజేయనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె. జగన్నాథరెడ్డి తెలిపారు. కళలు, విద్య, స్పోర్ట్స్, మెడిసిన్, సోషల్ వర్క్, సివిల్ సర్వీసెస్ తదితర రంగాల్లో రాణించిన వారు జూలై 15వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News June 15, 2024

కడప దివ్యాంగుడికి ఆర్థిక సహాయం చేసిన సీఎం చంద్రబాబు

image

కడప నగరంలోని రాజారెడ్డికి వీధికి చెందిన దివ్యాంగుడు కనపర్తి మనోజ్‌ కుమార్‌కు సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయం ప్రకటించారు. శనివారం మంగళగిరిలో సీఎం చంద్రబాబును మనోజ్ కలిశారు. తన సమస్యను వివరించి వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరగా.. సీఎం అతడికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మనోజ్ కుమార్ చాలా రోజుల నుంచి అనారోగ్యంతో వీల్ చైర్‌కే పరిమితమయ్యాడు.

News June 15, 2024

చింతకొమ్మదిన్నెలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

image

చింతకొమ్మదిన్నె మండలం పరిధిలోని మామిళ్ళపల్లి గ్రామం సోమయాజులపల్లి కంపచెట్ల వద్ద గుర్తుతెలియని మృతదేహం శనివారం కలకలం రేపింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం ఆనవాళ్ళతో కూడిన సమాచారాన్ని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించి గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

News June 15, 2024

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి: తులసిరెడ్డి

image

రాయలసీమలో హైకోర్టు కానీ, హైకోర్టు బెంచి కానీ ఏర్పాటు చేయాలని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ డా.తులసి రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని, హైకోర్టు రెండింటిలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఒప్పందాన్ని అనుసరించి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని రాయలసీమ, హైకోర్టు కోస్తాలో ఏర్పాటు చేశారన్నారు.

News June 15, 2024

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా శారద బాధ్యతలు స్వీకరణ

image

కడప జడ్పీ ఛైర్మన్‌గా శారద శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఉన్న జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. దీంతో వైస్ ఛైర్మన్‌గా ఉన్న శారద పూర్తి స్థాయిలో జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో జిల్లా ప్రగతికి చేయూతనిస్తానని ఆమె అన్నారు.

News June 15, 2024

కడపలో సందడి చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్

image

కడప నగరంలోని ఒక జ్యువెలరీ షోరూమ్‌ను సినీ హీరోయిన్ నిధి అగర్వాల్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కలిసి శనివారం ప్రారంభించారు. జువెలరీ ప్రధాన రహదారికి ఇరువైపులా నిధి అగర్వాల్‌ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అభిమానులకు, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

News June 15, 2024

పుట్టా గెలుపుతో తిరుమలకు పాదయాత్ర

image

మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా
పుట్టా సుధాకర యాదవ్ గెలుపొందటంతో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకొనేందుకు శనివారం జీవి సత్రం నుంచి టీడీపీ మండల అధ్యక్షుడు భీమయ్య ,యువ నేత కిశోర్ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రామచంద్రనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

News June 15, 2024

కడప: నిరుద్యోగ యువతకు ట్యాలీలో ఉచిత శిక్షణ

image

ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఫౌండేషన్ అడ్మిషన్ కోఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ పాస్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాస్ లేదా ఫెయిల్ అయిన 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు గలవారు అర్హులని తెలిపారు. 35 రోజుల శిక్షణా కాలంలో కంప్యూటర్ స్కిల్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతామన్నారు.

News June 15, 2024

రాజంపేట: గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

రాజంపేట మండలం హస్తవరం- రాజంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని శుక్రవారం రేణిగుంట పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రియా సిమెంటు అని బనియన్ దానిపై గ్రీన్ కలర్ షర్ట్ ధరించి ఉన్నారని తెలిపారు. ఎవరనేది సమాచారం తమకు తెలపాలని కోరారు. కేసు నమోదు చేశామని తెలిపారు.

News June 15, 2024

పుస్తకాలు తక్కువ వస్తే ప్రతిపాదనలు పంపాలి: డీఈఓ

image

విద్యార్థులకు పుస్తకాలు తక్కువ వస్తే ఎంఈఓలు ప్రతిపాదనలు పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.అనురాధ సూచించారు. శుక్రవారం ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లోని స్టూడెంట్ కిట్ మండల స్థాయి స్టాక్ పాయింట్‌ను డీఈఓ, కడప డిప్యూటీ డీఈఓ రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ.. 8, 9 తరగతులకు కొరత ఉన్న పుస్తకాల మంగళవారం వస్తాయన్నారు. త్వరగా విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయాలన్నారు.