India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దువ్వూరు మండలం గుడిపాడుకు చెందిన గురివిరెడ్డి కుమారుడు గురు మాధవరెడ్డి బుధవారం సాయంత్రం వారి ఇంట్లో వారికి చెప్పకుండా బయటకు వెళ్లి రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అబ్బాయి ఆర్లగడ్డలో ఉన్నాడని తెలుసుకొని పోలీసులు శుక్రవారం ఎస్సై శ్రీనివాసులు సమక్షంలో తల్లిదండ్రులకు అబ్బాయిని అప్పగించారు.
చాపాడు మండలం పల్లవోలు వద్ద ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పల్లవోలు దళిత వాడకు చెందిన జయపాల్(55) రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. కారు నిలపకుండా వెళ్లిపోయాడు. చాపాడు ఎస్సై కొండారెడ్డి ఘటనాస్థలానికి వచ్చి గాయపడిన వ్యక్తిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించినట్లు స్థానికులు తెలిపారు.
వల్లూరు మండలంలోని నల్లపురెడ్డిపల్లెకు చెందిన ఉపాధి కూలీలు శుక్రవారం ఉపాధి పనులు చేయడానికి ఆటోలో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ఆటో తోల్ల గంగన్న పల్లె సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముంతా రాములమ్మ, స్వాతి, కృపావతి అనే మహిళా కూలీలు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎంపీడీవో విజయ భాస్కర్, ఏపీఓ సుధారాణి, ఉపాధి సిబ్బంది వారిని పరామర్శించారు.
ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటి వరకు 21 మంది మంత్రులుగా పనిచేశారు. కోటిరెడ్డి, మునిరెడ్డి, రామచంద్రయ్య, ఖలీల్ బాషా, అహ్మదుల్లా, అంజాద్ బాషా, సరస్వతమ్మ, రత్నసభాపతి, బ్రహ్మయ్య, B. వీరారెడ్డి, డీఎల్, శివారెడ్డి, రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి, వివేకానందరెడ్డి, బసిరెడ్డి, మైసూరారెడ్డి, YSR, రాజగోపాల్ రెడ్డి, జగన్ మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం మండిపల్లి మంత్రి అయ్యారు.
కడప నగరం దేవునికడపలో గురువారం రాత్రి 8 గంటలకు మోహన్ కృష్ణ (25) అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి కత్తితో పొడిచాడు. ఈ క్రమంలో ఆయన పొట్ట, వెనుక భాగంలో తీవ్రమైన గాయం అవ్వడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లక్కిరెడ్డిపల్లిలో 20 రోజుల కిందట అదృశ్యమైన చిన్నకొండు సుదర్శన్ (34) గురువారం పాలెం గొల్లపల్లి అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు. స్థానికుల వివరాల మేరకు.. పాలెం గొల్లపల్లి గ్రామం బురుజు పల్లికి చెందిన చిన్నకొండ సుదర్శన్ 20 రోజుల కిందట కనిపించకుండా పొయ్యి గురువారం పాలెం గొల్లపల్లి అటవీ ప్రాంతంలో చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎంగా మంత్రులకు శాఖలు కేటాయించారు. రాయచోటి MLA మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, క్రీడా, సమాచార శాఖను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి సారే రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి వరించింది. రాయచోటి నియోజకవర్గం నుంచి మొదటి మంత్రి కావడం విశేషం. దీంతో రాయచోటి కూటమి కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఒంటిమిట్ట బస్టాండ్ సమీపంలోని శ్రీరామ నగర్ మలుపు వద్ద ఉన్న కడప-చెన్నై ప్రధాన రహదారి బ్రిడ్జికి పెచ్చులు ఊడి కడ్డీలు కనిపిస్తున్నాయి. అధికారులు స్పందించి బ్రిడ్జికి మరమ్మతులు చేయకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వేళ ఈ బ్రిడ్జికి ప్రమాదం ఏర్పడితే కడప నుంచి రాజంపేట, కోడూరు, తిరుపతి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోతాయి.
కడప-విశాఖపట్నం మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్లలలో మార్పు చేసినట్లు కడప రైల్వే చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ ఉమర్ బాషా తెలిపారు. కడప- విశాఖపట్నం, విశాఖపట్నం-కడప మధ్య నడిచే ఈ రైలు ప్రస్తుతం 17487/17488 నంబర్లతో నడుస్తోంది. జులై ఒకటో తేదీ నుంచి ఈ రైలు 18521/18522 నంబర్లతో నడుస్తుందని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గుర్తించాలని సూచించారు.
బద్వేలులో సాయికుమార్ రెడ్డి గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనపై సీఐ యుగంధర్ రెడ్డి స్పందించారు. కలసపాడుకు చెందిన సాయి కుమార్ సిద్దమూర్తిపల్లెకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆమె సాయిని దూరం పెట్టింది. తన ప్రేమను నిరాకరించిదని ప్రియురాలిని హత్య చేయబోయిన సాయి.. అది బెడిసికొట్టడంతో తన అక్క ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.
Sorry, no posts matched your criteria.