India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రొద్దుటూరు MLA నంద్యాల వరదరాజులరెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి లభించలేదు. ఈయన 1985లో TDP తరఫున గెలిచిన ఆయన తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1989లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు MLAగా విజయం సాధించారు. తిరిగి ఈ ఎన్నికల్లో 22,744 మెజార్టీ ఓట్లతో గెలిచారు. ఈయనకు మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయులు ఆశించారు. కానీ ఆయనకు మంత్రి పదవి లభించకపోవడంతో నిరాశ చెందారు.
రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.
మంత్రివర్గ జాబితాలో చోటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఉమ్మడి కడప జిల్లా నేతలకు నిరేశే ఎదురైంది. వైసీపీ హయాంలో సీఎంగా జగన్, డిప్యూటీ సీఎంగా అంజాద్ బాషా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. కాగా తాజా మంత్రివర్గ జాబితాలో ఉమ్మడి కడప జిల్లా నుంచి కేవలం రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మాత్రమే మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, బీసీ రాష్ట్ర నేత సిద్దవటం యానాదయ్య మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు పంపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాయచోటి నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రివర్గ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈయన 2021లో టీడీపీలో చేరారు. ఈయన తండ్రి నాగిరెడ్డి, సోదరుడు నారాయణరెడ్డి చెరో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో టికెట్ దక్కించుకున్న రాంప్రసాద్ రెడ్డి.. వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిపై గెలుపొంది.. జిల్లాలో మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక నేతగా నిలిచారు.
పోరుమామిళ్ల మండలంలోని నర్సింగపల్లి గ్రామానికి చెందిన ఎం.ఓబులేసు సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. ఇతను ప్రస్తుతం ఒడిశాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం స్వగ్రామానికి కారులో వస్తుండగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని బీఆర్ జంక్షన్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఆయన కారును ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. జవాను మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏపీలో కొత్తగా కొలువుదీరే మంత్రుల జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ప్రకటించారు. 24 మందితో కూడిన జాబితాను జాబితాను తాజాగా ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిని మాత్రమే మంత్రి పదవి వరించింది. ఈయన రాయచోటి నియోజకవర్గం నుంచి వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డిపై విజయం సాధించారు. ఈయనకు అభినందలు వెల్లువెత్తుతున్నాయి.
కడపలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానం వేదికగా జూన్ 30 నుంచి జులై 3వ తేదీ వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ -3 క్రికెట్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ వేడుకలు జూన్ 30వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రతిరోజు 2 మ్యాచ్‌లు చొప్పున డే అండ్ నైట్ మ్యాచులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్ అభిమానులు ఉచితంగా మ్యాచులను వీక్షించవచ్చు అని తెలిపారు.
ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ సాయి నగర్‌కు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి విజయవాడలోని కృష్ణా బ్యారేజీలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను గత ఎన్నికల్లో భారీగా పందేలు పెట్టి పెద్దమొత్తంలో డబ్బు నష్టపోయినట్లు తెలుస్తోంది. తన ఆత్మహత్యకు గల కారణాలు సూసైడ్ నోట్‌లో రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. అందులో కొందరి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతన్ని బుల్లెట్ సుబ్బారావు అని కూడా అంటారు.
కడప జిల్లాలో 20 ఏళ్లుగా ఒక కలలా ఉన్న కడప ఉక్కు పరిశ్రమ ఈ సారి పూర్తి అవుతుందా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ నుంచి గెలిచిన నర్సాపురం ఎంపీకి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా అవకాశం వచ్చింది. అందులోనూ అతను బీజేపీ ఎంపీ కావడం, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఉండటంతో కడప ఉక్కు పరిశ్రమ సాకారమవుతుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.