Y.S.R. Cuddapah

News June 11, 2024

చంద్రబాబును కలిసిన రాంప్రసాద్ రెడ్డి

image

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఆయన కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కలిసి టీడీపీ రాష్ట్రంలో ఘనవిజయం సాధించిన సందర్భంగా చంద్రబాబుకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసారు.

News June 11, 2024

కడప: డి ఫార్మసీ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

పాలిటెక్నిక్ విద్యలో భాగంగా ఉన్న డిప్లమో ఇన్ ఫార్మసీ (డి ఫార్మసీ) కోర్సు ప్రవేశానికి ఈ నెల 15వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ రెగ్యులర్ తో పాటు దూరవిద్య ద్వారా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయించి ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలను కల్పిస్తామని తెలిపారు.

News June 11, 2024

కడప: టీటీడీ బోర్డు పదవికి మా సీమ బాబు రాజీనామా

image

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు ఆర్ వెంకట సుబ్బారెడ్డి (మాసీమ బాబు) ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. టీటీడీ బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇదివరకే రాజీనామా చేసిన నేపథ్యంలో పాలకమండలి సభ్యులైన మాసీమ బాబు కూడా రాజీనామా చేశారు.

News June 11, 2024

రాయచోటి: ‘బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం’

image

అన్నమయ్య జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను
ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు బాలకార్మికుల నిర్మూలనపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News June 10, 2024

పెండ్లిమర్రి: గుండెపోటుతో వ్యక్తి హఠాన్మరణం

image

గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనపెండ్లిమర్రి మండలం యాదవాపురంలో చోటు చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఆదిమూలం వెంకట కృష్ణయ్యకు (54) గుండె నొప్పిగా ఉందని కుటుంబీకులు అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే మరణించాడని తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయామని ఇంక మాకు దిక్కెవరని కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.

News June 10, 2024

కడప: రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి

image

సుండుపల్లె మండలంలోని పించా దగ్గర ఉన్న చర్చి ఎదుట సోమవారం రెండు బైకులు అతి వేగంతో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సుండుపల్లె ఎస్సై హుస్సేన్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 10, 2024

కడప: మేల్ నర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఏపీ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలు, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాలలో హెల్త్ సూపర్వైజర్, మేల్ నర్స్, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ కడప జిల్లా కోఆర్డినేటర్ ఎల్. మాధవిలత తెలిపారు. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ కోర్స్ సర్టిఫికెట్ ఉన్నవారు ఈనెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News June 10, 2024

కడప జిల్లాలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

కడప జిల్లాలో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సోమవారం సాయంత్రం వెల్లడించారు. జిల్లా వాసులంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు కురుస్తున్న వర్షాలకనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో వర్ష ప్రభావానికి లోతట్టు ప్రాంతాల వారు బిక్కుబిక్కుమంటున్నారు.

News June 10, 2024

కడప: పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సామాజిక, సేవా రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి అందించే ‘పద్మ’ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టెప్ సీఈఓ సి.సాయిగ్రేస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించే అత్యున్నత పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం అర్హులైన వారు జూలై 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి గలవారు https://awards.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News June 10, 2024

కడప: మాజీ MLAలు సపోర్టు చేసినా గెలవని వైసీపీ

image

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీపై టీడీపీ కూటమి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కమలాపురంలో మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి, రాయచోటిలో రమేశ్ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. దీంతో అక్కడ వైసీపీ అభ్యర్థులు గెలుపుపై ధీమాగా ఉండేవారు. కాగా రెండు చోట్ల వైసీపీకి పరాభవం తప్పలేదు. రాయచోటిలో 2,495, కమలాపురంలో 25,357 ఓట్లతో టీడీపీ అభ్యర్థులు గెలిచారు.