Y.S.R. Cuddapah

News June 10, 2024

వైసీపీ చేసిన తప్పు మనం చేయొద్దు: వరద

image

వైసీపీ నేతలు గతంలో చేసిన తప్పులను తిరిగి మనం చేయకూడదని ఎమ్మెల్యేగా ఎన్నికైన వరదరాజులరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరూ కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని అందరం కలిసి కట్టుగా అభివృద్ధిపై దృష్టి పెడదామన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు తనకు తెలిపి హుందాతనాన్ని చాటారన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసి వెళ్లిపోయారని ఆరోపించారు.

News June 10, 2024

రాయచోటి: టీడీపీ నేతలపై దాడి.. వైసీపీ నేతలు అరెస్ట్

image

రాయచోటి మండలం బోయపల్లి గ్రామంలో టీడీపీ వర్గీయులపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. బోయపల్లె గ్రామంలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉన్నప్పుడు, వైసీపీకి చెందిన వారు దాడి చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు దాడికి దిగిన 16 మంది వైసీపీ వర్గీయులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News June 10, 2024

రాయచోటి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

సంబేపల్లె మండల పరిధిలోని మోటకట్ల విద్యుత్తు ఉప కేంద్రం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రాయచోటి పట్టణానికి చెందిన షేక్ బాజ్జీ (39) కలకడ వైపు నుంచి రాయచోటికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా, పాఠశాల బస్సు అతని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాజ్జీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 10, 2024

కడప: మూడు పార్టీలు.. ముగ్గురు ఎంపీలు

image

కడప జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు పార్టీల తరఫున ముగ్గురు ఎంపీలు పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. ఏలూరు పార్లమెంటు(టీడీపీ) నుంచి పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, అనకాపల్లి పార్లమెంట్(బీజేపీ) నుంచి సీఎం రమేశ్, కడప ఎంపీగా (వైసీపీ) వైఎస్ అవినాశ్‌రెడ్డి గెలిచారు. దీంతో మూడు పార్టీల ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇక కడప జిల్లాకు చెందిన సత్యకుమార్ ధర్మవరం ఎమ్మెల్యే అయిన విషయం తెలిసిందే.

News June 10, 2024

కక్ష సాధింపులు మా అభిమతం కాదు : ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

image

కక్ష సాధింపులు మా అభిమానం కాదని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు ఎవరు పాల్పడకూడదని ఆదేశించారన్నారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కేవలం 11 సీట్లు సాధించారంటే ఎంత దుర్మార్గమైన పాలన ప్రజలకు అందించారో తేలిందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేస్తామన్నారు.

News June 9, 2024

రేపే కల్కి 2898 AD ట్రైలర్.. కడపజిల్లాలోని ఈ థియేటర్లో స్క్రీనింగ్!

image

ప్రభాస్‌ అభిమానులు‌ ఎంతో‌ ఆత్రుతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్‌ రేపు విడుదలకానుంది. కడప జిల్లా అభిమానుల కోసం జిల్లాలోని పలు థియేటర్లలో‌ రేపు 6PMకు ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు. కడప- అప్సర, ప్రొద్దుటూరు- అరవేటి థియేటర్‌లలో‌ ట్రైలర్‌ స్క్రీనింగ్ చేస్తారు. SHARE IT

News June 9, 2024

వీరబల్లి: ప్రమాదవశాత్తు నీటిలో పడి విద్యార్థి మృతి

image

ప్రమాదవశాత్తు నీటిలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన వీరబల్లిలో జరిగింది. రాయపాటి పట్టణంలోని నయాసాబ్ వీధికి చెందిన టైలర్ షకిల్ కుమారుడు అద్నాన్(14) పదో తరగతి చదువుతున్నాడు. సెలవు రోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. పుల్లగూర గండిలో ప్రమాదవశాత్తు నీటిలో పడి అద్నాన్ మృతి చెందాడు. ఇంట్లోని పెద్ద కొడుకుని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

News June 9, 2024

అన్నమయ్య: ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమికుల మృతి

image

బత్తలపల్లి అడవిలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు మృతిచెందినట్లు ములకలచెరువు SI తిప్పేస్వామి వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. దేవలచెరువుకు చెందిన నరేంద్ర(25), ఎద్దులవారిపల్లెకు చెందిన రాణి(17) ప్రేమించుకున్నారు. కులాలు వేరని పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారు శుక్రవారం పురుగు మందు తాగగా, ఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం రుయాకు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు.

News June 9, 2024

కడప జిల్లా నేతల్లో మంత్రి పదవి ఎవరికి.?

image

ఉమ్మడి కడప జిల్లా నుంచి పది స్థానాల్లో ఏడింటిని కూటమి సొంతం చేసుకుంది. ఇక అనకాపల్లి, ఏలూరు ఎంపీలుగా సీఎం రమేశ్, పుట్టా మహేశ్ యాదవ్ గెలిచారు. ధర్మవరం ఎమ్మెల్యేగా జిల్లా వాసి సత్య కుమార్ గెలిచారు. అయితే కేంద్ర రాష్ట్ర మంత్రి వర్గంలో మన వారి పేర్లే వినపడుతున్నాయి. దీంతో జిల్లా నుంచి ఎవరికి కేంద్ర, రాష్ట్ర పదవులు వస్తాయో అని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొందరు నేతలు అధిష్ఠానాలతో మంతనాలు సాగిస్తున్నారు.

News June 9, 2024

కడప: రూ.34.56 కోట్ల మద్యం అమ్మకాలు

image

ఎన్నికల సమయంలో కడప ఎక్సైజ్ డివిజన్ పరిధిలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. మే నెలలో రూ.34.56 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కడప డివిజన్ పరిధిలో 40 ప్రభుత్వ దుకాణాలు, 14 బార్లు ఉన్నాయి. వాటి నిర్వాహకులు మేలో ఎక్సైజ్ డిపో నుంచి రూ.34.56 కోట్ల విలువ చేసే మద్యాన్ని దిగుమతి చేసుకుని విక్రయించారని ఎక్సైజ్ డిపో మేనేజర్ ధనుంజయకుమార్ తెలిపారు.