India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

<<13545953>>ఎస్సైపై మండిపడ్డ<<>> ఘటన చర్చనీయాంశం కావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత స్పందించారు. ‘బందోబస్తుకు ఒక్క కానిస్టేబుల్ లేకుండా వారం రోజులుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. పింఛను పంపిణీ ప్రభుత్వ కార్యక్రమం కావడంతో పోలీసులే భద్రత గురించి చెప్పారు. వారి కోసం గంటకుపైగా రోడ్డుపై వేచి ఉన్నా. అధికారి క్యాజువల్ డ్రెస్‌లో వచ్చారు. దీంతోనే ప్రశ్నించా. ఇదే పెద్ద నేరంగా మారింది’. అని అన్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని రాజంపేట MP మిథున్ రెడ్డి అన్నారు. పవన్ దీక్షలో కూడా అలవోకగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ‘ఆయన చేతిలో అధికారం, పోలీసులు, వ్యవస్థలు ఉన్నాయి. ఐదేళ్ల సమయం ఉంది. సత్యశోధనకు నేను సిద్ధంగా ఉన్నానని, తనపై ఆరోపణలు నిరూపించకపోతే పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమా?’ అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కడప నగరం (పాత కలెక్టరేట్)లోని బీసీ స్టడీ సర్కిల్లో డీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఉమ్మడి కడప జిల్లా సంచాలకులు డాక్టర్ వల్లూరు బ్రహ్మయ్య తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు టీటీసీ అర్హత కలిగి ఉండి, టెట్ అర్హత సాధించిన వారు 10వ తేదీ లోపు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

బ్రహ్మంగారిమఠం మండలం ఈశ్వరమ్మ గృహ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, ముఖభాగం గుర్తు పట్టలేని విధంగా పాడైపోయిందని పోలీసులు తెలిపారు. శవం కాలిన ఆనవాళ్లు కనిపించడంతో ఎవరైనా నిప్పంటించి చంపారా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జిల్లాలోని పెండ్లిమర్రి మండలం వెళ్లటూరు గ్రామానికి చెందిన బత్తల వెంకటలక్ష్మీ (24) అనే యువతి ఎగువచెరువు కాశినాయన గుడి దగ్గర ఉన్న అడవుల్లో ఉరి వేసుకొని మరణించినట్లుగా పెండ్లిమర్రి ఎస్సై హరిప్రసాద్ తెలిపారు. కానీ మృతికి గల ఎటువంటి కారణాలు తెలియకపోవడంతో ఇది హత్యనా?, లేక ఆత్మహత్యనా? అనే విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సీకేదిన్నె మండలంలోని అంగడి వీధికి చెందిన దూదేకుల మహబూబ్ చాంద్(17)అనే విద్యార్థిని సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు సీకేదిన్నె సీఐ శివ శంకర్ నాయక్ తెలిపారు. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు ఆమెను మందలించడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రమాత్రలు మింగిగా.. ఏలూరులో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

కడప నగరం ఎన్టీఓ కాలనీకి చెందిన పి. ఉమామహేశ్వర్, శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె అయిన పసుపులేటి చిన్మయ చదరంగం క్రీడలో రాణిస్తోంది. విద్యామందిర్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి అండర్-10 విభాగం నుంచి చదరంగం ర్యాంకింగ్ టోర్నమెంట్లో పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో 1523 రేటింగ్ సాధించింది. తాజాగా సోమవారం జారీ చేసిన రేటింగ్స్ ఈ చిన్నారికి 1523 రేటింగ్ దక్కింది.

ప్రొద్దుటూరు ఏడో వార్డులో పింఛన్ డబ్బు పంచలేదని తెలిసిందే. దీనికి కారణం ఏంటా అని అధికారులు విచారించారు. ఆ వార్డు సచివాలయ కార్యదర్శి మురళీమోహన్ పింఛన్ డబ్బు బ్యాంకు నుంచి డ్రా చేసి దొంగతనానికి గురైనట్లు పథకం పన్నాడు. పోలీసుల తమదైన శైలిలో విచారించగా.. బెట్టింగ్‌కు బానిసై సొంత ఖర్చులకు పింఛన్ డబ్బులు కాజేసినట్లు తేలడంతో డీఎస్పీ మురళీధర్ క్రిమినల్ కేసు నమోదు చేశారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ హాలు నందు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీలను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని అధికారులకు సూచించారు.

బ్రహ్మంగారిమఠం మండలం పెద్దిరాజుపల్లి ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా పనిచేస్తున్న బాలకృష్ణ బద్వేలులో టాటా ఏస్ ఢీకొనడంతో మృతి చెందాడు. బద్వేలులోని ఇంటినుంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంటే టాటా ఏస్ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధ్యాయుడి మృతి పట్ల మండల ఉపాధ్యాయుల విద్యాశాఖ అధికారి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
Sorry, no posts matched your criteria.