Y.S.R. Cuddapah

News July 1, 2024

కడప జిల్లాలో 96.57% పింఛన్ పంపిణీ పూర్తి

image

కడ జిల్లాలో తొలి రోజు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులతో 96.57% లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో 2,65,774 మంది పింఛన్దారులు ఉండగా వారికి 178,38,36,500 కోట్లు నిధులు విడుదల అయ్యాయి. మొదటి రోజు 2,56,667 మందికి 172,32,84,000 కోట్లు పంపిణీ చేయడం జరిగింది.

News July 1, 2024

కడప: మైనర్ బాలిక ఆత్మహత్య

image

కడప అంగడి వీధికి చెందిన దూదేకుల మహబూబ్ చాంద్ (17) అనే విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐరన్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మృతురాలిది పెద్దమండెం మండలం పెద్దపసుపుల గ్రామం కాగా, అంగడి వీధిలోని తన చిన్నమ్మ వద్ద ఉంటూ కడపలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నట్లు ఆయన తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 1, 2024

ఖాజీపేటలో విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత

image

ఖాజీపేట బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. స్థానికుల వివరాల మేరకు.. విద్యార్థుల అస్వస్థదకు కలుషిత నీరే కారణమని, సుమారు 30 మంది విద్యార్థులు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య చికిత్స అందిస్తున్నారన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 1, 2024

ప్రొద్దుటూరు: పెన్షన్ డబ్బులు ఎత్తుకెళ్లారు?

image

ప్రొద్దుటూరు 7వ వార్డు పరిధిలోని వార్డు సెక్రటరీ మురళీమోహన్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు అతణ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తాను పెన్షన్లు పంపిణీ చేసేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో స్పృహ కోల్పోయినట్లు తెలిపారు. పెన్షన్ సొమ్ము దాదాపు రూ.4 లక్షల ఎవరో తీసుకెళ్లారన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.

News July 1, 2024

కడప – చెన్నై ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం

image

కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పరిధిలోని కడప – చెన్నై ప్రధాన రహదారిపై మండపం పల్లి కనము వద్ద కారు, బస్సు ఢీకొన్న ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్థులు వెల్లడించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 1, 2024

కేసుల పరిష్కారంలో కడప జిల్లాకు రెండో ర్యాంకు

image

జూన్ 29వ తేదీన ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 22 బెంచుల్లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 2367 కేసులను పరిష్కరించారు. ఇందులో క్రిమినల్ కేసులు 2036, సివిల్ కేసులు 217, ఫ్రీ లిటిగేషన్ కేసులు 114 పరిష్కారమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసుల పరిష్కారంలో జిల్లా రెండవ ర్యాంకులో నిలిచింది.

News July 1, 2024

చింతకొమ్మదిన్నె: పెళ్లికి తీసుకెళ్లలేదని ఆత్మహత్య

image

మండలంలోని అంగడివీధికి చెందిన ఓ బాలిక (16) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పెద్దముడియం మండలానికి చెందిన బాలిక అంగడివీధిలోని తన పిన్ని ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. కుటుంబ సభ్యులు తనని పెళ్లికి తీసుకువెళ్లలేదని మనస్తాపంతో అధిక మోతాదులో మాత్రలు మింగి అస్వస్థకు గురి కావడంతో, ఏలూరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News July 1, 2024

ప్రొద్దుటూరు: అసలే మైనర్.. ఆపై ముగ్గురితో డ్రైవింగ్

image

మైనర్ బాలుడి వయసు 12 ఏళ్లు. మరో ముగ్గురిని స్కూటీలో కూర్చోపెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. నలుగురు పిల్లలు గాంధీ రోడ్డులో స్కూటీలో వెళ్తున్న దృశ్యం ఆదివారం ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ కంట పడి వారిని ప్రశ్నించారు. దుకాణానికి వచ్చినట్లు పిల్లలు తెలిపారు. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను హెచ్చరించినట్లు డీఎస్పీ తెలిపారు.

News July 1, 2024

రాయచోటి: కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజల సమస్యలపై విజ్ఞప్తులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు జులై 1న ఉదయం 10.00గం.ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ తెలిపారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News June 30, 2024

కడప: YSRTUC జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన రసూల్ బాషా

image

YSRTUC ట్రేడ్ యూనియన్ విభాగానికి స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని కడప రసూల్ బాషా తెలిపారు. వైసీపీలో తాను గత 13 సంవత్సరాలుగా ఉన్నానని, సొంత కారణాలవల్ల YSRCP నుంచి వైదొలుగుతున్నట్లు ఇందులో ఎవరి బలవంతం, ప్రోద్బలం, మరో పార్టీ నుంచి ఒత్తిడి గాని లేదని ఆయన ప్రకటించారు. ఇక పార్టీ కార్యక్రమాలు తాను చేయదలచుకోలేదని తెలిపారు.