India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనకాపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ను ప్రకటిస్తూ బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కాసేపటి క్రితం దేశవ్యాప్తంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ఈయన రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.
రాజంపేట పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అదిష్టానం ప్రకటించింది. తాజాగా దేశవ్యాప్తంగా వెలువడిన బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో రాజంపేట అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రకటిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన విజయం కోసం మూడు పార్టీల నేతలు పనిచేయాలన్నారు.
జిల్లాలోని బి.మఠం మండలం గుండాపురానికి చెందిన వ్యక్తి కువైట్‌లో మరణించాడు. గుండాపురానికి చెందిన బిజివేముల రామచంద్రారెడ్డి(47) బతుకు తెరువు కోసం కువైట్‌కు వెళ్లాడు. కాగా గతనెల 16న భవన నిర్మాణ పనిచేస్తూ ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ ఈనెల 21న మరణించాడు. ఆదివారం తన స్వగ్రామానికి బంధుమిత్రుల సహాయంతో మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
దువ్వూరు మండలంలోని ఇడమడక మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి బాల పెద్దన్నకు చెందిన 20 గొర్రెలు మృతిచెందాయి. గొర్రెల మంద రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఢీకొట్టిన లారీ నిలుపకుండా పోవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. చాగలమర్రి టోల్ ప్లాజా వద్ద గుర్తింపుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో పెద్దముడియం మండలం బలపనగూడూరుకి చెందని ఇద్దరు వ్యక్తులు శనివారం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఏసోబు, బండెన్న బేల్దారి పని నిమిత్తం 2 రోజుల క్రితం బైకులో అనంతపురం జిల్లాకు వెళ్లారు. పనులు ముగించుకుని శనివారం స్వగ్రామానికి వస్తుండగా రోటరీపురం వద్ద ఓ కళాశాల బస్సు వీరి బైకును ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
కడప 3వ డివిజన్ వైసీపీ ఇన్‌ఛార్జ్ సుదర్శన్‌రెడ్డిపై రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. డివిజన్‌లో ఒక హోటల్‌ను వైసీపీ నాయకులచే ప్రారంభించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన బెలూన్లు వైసీపీ జెండా రంగులను పోలి ఉన్నాయని సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ పార్థసారథి అభ్యంతరం వ్యక్తం చేసి రూ.10వేలు అపరాధ రుసుం విధించారు. ఈ క్రమంలో జరిగిన వాదులాటలో ఆర్‌ఓ ఆదేశాల మేరకు ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రొద్దుటూరు నుంచి ఈనెల 27న ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి అంజద్ బాషా, మేయర్ సురేశ్ బాబు అధ్యక్షతన కడపలో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సభ నిర్వహణకు తీసుకోవాల్సిన అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. సభకు భారీగా ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
కర్నూలుకు చెందిన రాజశేఖర్ శర్మ అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అదే జిల్లాలోని గోనెగండ్ల మండలంలో ఆయన పని చేసేవాడు. ఇటీవలె ఆయన్ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్థాపానికి గురై రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చారు. ఓ లాడ్జిని అద్దెకు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టామని కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. విజయవాడ నుంచి చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనుల లేబర్ కాంపోనెంట్ పెంపుతో పాటు, కూలీలకు కొరత లేకుండా తాగునీటి సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈనెల 25న సాయంత్రం కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కడపలోని ఆమీన్ ఫంక్షన్ ప్యాలెస్‌లో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా ఛైర్మన్ డాక్టర్ ఎన్.తులసి రెడ్డి అన్నారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్.షర్మిలారెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. షర్మిల పర్యటన సందర్భంగా ఆయన ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.