India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సంచలనం రేపిన వైసీపీ నేత హత్య కేసు సీఐడీకి అప్పగించారు. గత ఏడాది జూన్ 23న కడపలో వైసీపీ నేత శ్రీనివాస్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీనివాసరెడ్డిని వైసీపీ కార్యకర్తలే చంపారని, ఈ హత్యకు సెటిల్మెంట్లు, భూదందాలు కారణమని ఆరోపణలు వచ్చాయి. హత్యకు కుట్ర పన్నిన వారిని పోలీసులే తప్పించారని హతుడి భార్య ఆరోపించారు. శ్రీనివాస్ రెడ్డి భార్య అప్పట్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.

కడపలో తల్లీ-కుమార్తెలు ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంకరాపురానికి చెందిన శారదకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె స్వాతి కానిస్టేబుల్ పవన్ కుమార్‌ను కులాంతర వివాహ చేసుకుని దూరంగా ఉంటున్నారు. పవన్‌కుమార్ తనను, తన పెద్ద కుమార్తె మానసికంగా వేధిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తున్నాడంది. వేధింపులు భరించలేక ఇద్దరు విషద్రావణం తాగారు. చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కాయపల్లెలోని శాస్త్రి నగర్‌లో నివాసం ఉంటున్న రాజశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అత్తగారింటికి వెళ్లాడు. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూసేటప్పటికి ఇంటి గేటు తీసి తాళం పగలగొట్టి ఉంది. ఇంటిలోకి వెళ్లి చూసి బీరువాలోని దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు దోపిడీకి గురైనట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వైఎంఆర్ కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన వెంకట మహేశ్వరరెడ్డి (30) హత్య కేసులో నిందితుడు భూమిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మహేశ్వరరెడ్డిని ఎందుకు అంత కిరాతకంగా హత్య చేయాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తులో ఉంది. కాగా మహేశ్వరరెడ్డిని ముక్కలుగా నరికి సంచుల్లో వేసుకొని మైలవరం కాలువ వద్ద వేసిన విషయం తెలిసిందే.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు పక్కాగా పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, తహశీల్దార్‌లతో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు.

వైసీపీలో కీలక నేతగా వ్యవహరించిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సోమవారం ముచ్చటగా మూడోసారి గెలిచి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి 2014 ఎన్నికల్లో 1,74,062 ఓట్ల మెజార్టీతో నాటి బీజేపీ అభ్యర్థి పురందీశ్వరిపై గెలిచారు. 2019లో 2,68,284 ఓట్ల మెజార్టీతో TDP అభ్యర్థి సత్యప్రభపై విజయం సాధించారు. ఇక 2024లో ఉమ్మడి AP మాజీ CM కిరణ్‌కుమార్ రెడ్డిపై 76,071 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు.

టీచర్ ఉద్యోగం కలల స్వప్నాన్ని ప్రభుత్వం సాకారం చేసేందుకు సిద్ధమైంది. మెగా DSC నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి కడప జిల్లాలో 298 ఎస్టీటీలతో కలిపి మొత్తం 709 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించనున్నారు.

ప్రొద్దుటూరులో సోమవారం దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. YMR కాలనీలో నివాసం ఉండే రత్నమ్మ భర్త చనిపోవడంతో రామచంద్రారెడ్డితో సహజీవనం చేస్తున్నారు. రత్నమ్మకు కొడుకు మహేశ్వరరెడ్డి ఉండగా, ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు. మహేశ్వరరెడ్డికి, రామచంద్రారెడ్డి మధ్య గొడవ జరిగింది. దీంతో రామచంద్రారెడ్డి మహేశ్వరరెడ్డిని ముక్కలు ముక్కలుగా నరికి, సంచుల్లో వేసుకొని మైలవరం ఉత్తర కాలువవద్ద పడేశాడు.

కడప: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజుతో పాటు జాయింట్ కలెక్టర్ గణేశ్ కుమార్, పలు శాఖల జిల్లా అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు.

AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఏపీ IIITల్లో ఒకటైన కడప జిల్లా ఇడుపులపాయ 1100 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. గతేడాది కంటే దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయని సమాచారం. కాగా ప్రవేశాల తొలి విడత సెలక్షన్ లిస్ట్ జూలై 7న ‘www.rgukt.in’ వెబ్ సైట్‌లో విడుదల చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.