India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అట్లూరు మండల పరిధిలోని క్రాస్ రోడ్లో నివాసముండే నాగమునయ్య యాదవ్‌పై అదే గ్రామానికి చెందిన రెడ్డయ్య తన వర్గంతో దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. ఈ దాడిలో నాగమునయ్య తలకి గాయమైంది. వెంటనే అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు రాజకీయ కక్షలే కారణం అని పోలీసులు అంచనా వేస్తున్నారు.

చిన్న, మధ్య తరగతి కుటుంబాలకు టమాట దడ పుట్టిస్తోంది. రోజు రోజుకు రేటు పెరుగుతూ పోతోంది. శుక్రవారం అత్యధికంగా కిలో టమాట రూ.88 పలికింది. వారం రోజుల కిందట రూ.60 ఉన్న టమాట ఇవాళ రూ.80 పైగా ఉండటంతో ప్రజలు ‘ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లొస్తాయి.. టమాట కొనాలంటేనే కన్నీళ్లొస్తున్నాయి’అని పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

మాజీ సీఎం జగన్ నేడు పులివెందులకు రానున్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో కడపకు బయలుదేరుతారు. 12.15 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 12.25 గంటలకు కడప నుంచి పులివెందులకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 1.25గంటలకు పులివెందులలోని భాకరాపురంలోని తన స్వగృహానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

నీట్‌లో సీటు రాలేదని యువతి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. చిట్వేలి మండల కేంద్రంలో నివాసం ఉంటున్న మల్లెంపల్లికి చెందిన నారాయణ కుమార్తె సృజన నీట్‌లో సీటు రాలేదని శుక్రవారం రాత్రి గుంజన నది బ్రిడ్జి పైనుంచి దూకింది. విషయం తెలుసుకున్న చిట్వేలి ఎస్సై సుధాకర్, సిబ్బంది అంబులెన్సులో ఎక్కించి చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం వద్దిరాల సచివాలయం వద్ద శుక్రవారం వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుడు పెద్దముడియం గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్ వలిగా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు గొల్లపల్లె క్రషర్ మిషన్ ఆపరేటర్ గా పని చేసేవాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యం సేవించడం అలవాటు ఉంది. మృతికి గల కారణాలు తెలియాలి.

కడప పట్టణంలోని ప్రభుత్వ డిఎల్టీసి ఐటిఐలో ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డిఎల్టీసి అసిస్టెంట్ డైరెక్టర్ రత్నరాజు తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఈ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఐటిఐ ఫైనల్ ఇయర్ చదువుతూ ఏఐటిటి – 2024 పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, ఐటిఐ పాసైన విద్యార్థులందరూ హాజరు కావచ్చని తెలిపారు.

మహిళ సంచిలో తెచ్చుకున్న 13
తులాల బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం మేరకు.. గాలివీడు మండలానికి చెందిన పి.ప్రమీల ఫిబ్రవరి 28న దేవుని కడప వద్ద బంధువుల వివాహానికి ఆర్టీసీ బస్సులో వస్తున్నారు. దారిలో తాను తెచ్చుకున్న సంచి జిప్ తెరచి ఉండడంతో ఆందోళనగా తెరచిచూశారు. అందులో ఉన్న బంగారం అపహరణకు గురయ్యాయని గమనించి బోరున విలపించారు. కడప వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్ కు చెందిన చాంద్ బాషా (54) జిల్లా ఆసుపత్రి భవనం పైనుంచి బుధవారం అర్ధరాత్రి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చాంద్ బాషా టీబీ వ్యాధికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వెళ్లాడు. తిరిగి 2 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి జిల్లా ఆసుపత్రి 2వ అంతస్తు భవనంపై నుంచి దూకాడు. సిబ్బంది అతనికి వైద్యం అందిస్తుండగా చనిపోయాడు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కడప జిల్లా నుంచి TDP తరఫున ఐదుగురు, BJP నుంచి ఒకరు, జనసేన నుంచి ఒకరు, YCP తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ 10 మంది నియోజకవర్గ MLAగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమ MLA నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నీట్ పరీక్ష పత్రం లీకేజ్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని కొత్తపేట బాలికల కళాశాల ఆవరణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.