Y.S.R. Cuddapah

News May 29, 2024

అవినాష్ రెడ్డి బండి భలే ఉంది: టీడీపీ

image

ఇటీవల కాలంలో ఎమ్మెల్యే తాలుకా అంటూ పలువురు వాహనాల నంబర్ ప్లేట్లను తయారు చేసి వైరల్ చేస్తున్నారు. ఈక్రమంలో ‘బాబాయిని లేపినోడి తాలూకా’ అని ఉన్న ఓ ప్లేట్‌ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఇదే ఫొటోను టీడీపీ X(ట్విటర్)లో పోస్ట్ చేసింది. దానికి ‘అవినాష్ రెడ్డి బండి భలే ఉంది’ అంటూ కామెంట్ చేసింది.

News May 29, 2024

చిట్వేలి: 37 ఏళ్ల తర్వాత ఈ ఊర్లో జాతర

image

చిట్వేలి మండలం కేఎస్ అగ్రహారం గ్రామపంచాయతీ పరిధిలోని ఎగవూరు గంగమ్మ జాతర గురువారం జరగనున్నది. ఈ జాతర జరిగి దాదాపు 37 సంవత్సరాలు కావస్తోంది. ఊరిలో ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా ఈ తల్లి ఆశీసులతో ప్రారంభిస్తారని గ్రామస్థులు తెలిపారు. 37 సంవత్సరాల తర్వాత యువకులు అంతా ఎలాగైనా జాతర జరిపించుకోవాలని పట్టుబట్టి మరీ నిర్వహిస్తున్నారు. ఊరంతా బంధువులతో కళకళలాడుతోంది.

News May 29, 2024

కడప నుంచి విమానాల రాకపోకల వివరాలు

image

కడప నుంచి విమానాల రాకపోకల వివరాలు ఈ విధంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్ శివప్రసాద్‌ తెలిపారు. 
✈ కడప-హైదరాబాద్‌: ప్రతిరోజు
✈ కడప-విజయవాడ-కడప: సోమ, బుధ, శుక్ర, ఆదివారం
✈ చెన్నై-కడప-చెన్నై: సోమ, బుధ, శుక్ర, ఆదివారం
✈ బెంగళూరు-కడప-బెంగళూరు: మంగళ, గురు, శనివారం 
✈ కడప-విశాఖపట్నం-కడప: మంగళ, గురు, శనివారం

News May 29, 2024

కడప: యాసిడ్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం

image

జిల్లాలోని అట్లూరులో నివాసముంటున్న యువతి(22) యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వటంతో వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 29, 2024

YSR పాపాలే.. చనిపోవడానికి కారణం: బీటెక్ రవి

image

మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డిపై పులివెందుల TDP MLA అభ్యర్థి బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజశేఖర్ రెడ్డి సీఎం అవడం కోసం పులివెందులలో కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పుల వలనే ప్రకృతి కూడా పసిగట్టి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. సీఎం అయ్యాక YSR మారినారన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రారని అన్నారు.

News May 29, 2024

మైదుకూరు: మిస్ ఆంధ్రప్రదేశ్ రన్నర్‌గా గాయత్రిరెడ్డి

image

మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం తవ్వారుపల్లి గ్రామానికి చెందిన హోంగార్డ్ చంద్రమోహన్ రెడ్డి కుమార్తె గాయత్రి రెడ్డి మిస్ ఆంధ్రప్రదేశ్ రన్నర్‌గా ఎంపికైంది. ఈ సందర్భంగా బుధవారం మండల ప్రజలు, చంద్రమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. గాయత్రిరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News May 29, 2024

మైదుకూరు డీఎస్పీకి చార్జ్ మెమో

image

మైదుకూరు డీఎస్పీ టి.వెంకటేశులుకు పోలీసుశాఖ ఉన్నతాధికారులు మంగళవారం చార్జ్ మెమో జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున మైదుకూరు నియోజకవర్గం పరిధిలో చాపాడు మండలంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలపై మైదుకూరు డీఎస్పీ టి.వెంకటేశులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనలో చాపాడు ఎస్ఐపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశాలు ఇచ్చారు.

News May 29, 2024

రాయచోటి: గంగమ్మ తల్లి జాతరలో అపశృతి

image

రాయచోటి నియోజకవర్గంలోని మాధవరం గ్రామంలోని మూల మురికివాళ్లపల్లెలో జరుగుతున్న గంగమ్మ తల్లి జాతరలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామస్థులు చాందిని బండ్లు ఊరేగింపు సమయంలో రోడ్డు ప్రక్కనే పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి. గమనించిన ఎస్సై భక్తవత్సలం, సిబ్బంది సమయస్ఫూర్తితో హుటాహుటిన నీళ్ల ట్యాంకర్‌ను తీసుకువచ్చి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

News May 29, 2024

ఏజెంట్లకై 30లోపు దరఖాస్తు చేసుకోండి: కడప కలెక్టర్

image

రాజకీయ పార్టీల తరఫున కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఏజెంట్ల కోసం డీఆర్వోలను, ఈవీఎంల లెక్కిపునకు సంబంధించి ఆర్వోలను సంప్రదించాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు ఉదయం 7 గంటల్లోపు హాజరుకావాలని, పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలన్నారు. 4వ తేదీ సాయంత్రం వరకు రాయకీయ ప్రతినిధుల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.

News May 29, 2024

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆంక్షలు కఠినతరం: కడప కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సజావుగా, పారదర్శకంగా, పటిష్టంగా నిర్వహించేందుకు శాంతి భద్రతల దృష్ట్యా ఆంక్షలను కఠినతరం చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఎంసీసీ అమలు, 144 సెక్షన్ పాటింపుపై ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌తో కలిసి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.