India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఈరోజు జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు కడప జిల్లాలో 16 సెంటర్లలో మొత్తం 247 మంది పరీక్షలకు హాజరయ్యారని విద్యా శాఖ అధికారి అనురాధ తెలిపారు. 615 విద్యార్థులకు గాను 368 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. 40.16% హాజరు కాగా, గైర్హాజరు శాతం 59.84% ఉందన్నారు. 02 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 08 సెంటర్లను పరిశీలించారన్నారు.
ఎర్రగుంట్ల మండల పరిధిలోని కడప-తాడిపత్రి జాతీయ రహదారి రాణివనం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. ఎర్రగుంట్ల మండలం, రాణివనంకు చెందిన ఆరీఫ్ తన తల్లితోపాటు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరీఫ్ తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, ఆరీఫ్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కడప జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, ఎందరో పర్యాటకులను మనవైపు చూసేలా చేసింది మన గండికోట. చుట్టూ ఆహ్లాదకరమైన కొండలు, మూడు వైపుల పెన్నా నది లోయ, అబ్బుర పరిచే శిల్ప సంపద, రాజులు, రాజ్యాల వైభవం గండికోట సొంతం. వర్షాలు పడేకొద్దీ గండికోట అందాలు మరింత ఆకర్షణగా ఉంటాయి. ప్రస్తుతం కొద్ది వర్షపాతానికే గండికోట పరిసర ప్రాంతాలు పచ్చగా మారాయి. దీంతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
కడపలో కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్నికల సమయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యేపై దాడి, కడప, మైదుకూరులో జరిగిన అల్లర్లపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కడప రిమ్స్ సమీపంలోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద పారా మిలిటరీ సిబ్బంది పహారా కాస్తున్నారు. మూడెంచెల భద్రతతో, 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే జిల్లాకు ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లను డీజీపీ నియమించారు.
చిన్నమండెం మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసింహులు అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆరిఫుల్లా రైస్ మిల్లు ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనంలో వెళ్తున్న నరసింహులును ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహులు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ముద్దనూరు మండలంలోని ఉప్పలూరు గ్రామంలో ఓబులేసు (41) అనే వ్యక్తి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ ఆంజనేయులు సమాచారం మేరకు.. ఓబులేసుకు 20 ఏళ్ల కిందట ఉప్పలూరుకు చెందిన కేశమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొంతకాలంగా భార్య కేశమ్మ ప్రవర్తనపై అనుమానం పెంచుకుని మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఓబులేసు శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇనుప పైపునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం నిర్దేశించిన ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తామని టార్గెట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య తెలిపారు. రాయచోటిలోని పీసీ ఆర్ గ్రాండ్‌లో టార్గెట్ బాల్ అసోసియేషన్ మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాబోవు విద్యా సంవత్సరంలో సీనియర్స్ విభాగం టోర్నీ కృష్ణా, జూనియర్ విభాగం అనంతపూర్‌లో, సబ్ జూనియర్ పోటీలు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు.
హైదరాబాద్‌లో రాయచోటి ఉపాధ్యాయుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. మియాపూర్ ఓయో లాడ్జిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జయప్రకాశ్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
లింగాల మండలం ఇప్పట్ల గ్రామం దగ్గర పులివెందుల వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఆదివారం ఢీకొని ఒకరు మృతి చందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సింహాద్రిపురం మండలం బిదినంచెర్లను చెందిన నారాయణరెడ్డిగా స్థానికులు గుర్తించారు. గాయపడిన వ్యక్తి లింగాల మండలం బోనాలకు చెందిన రామకృష్ణారెడ్డిగా గుర్తించారు. వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.
పెండ్లిమర్రి మండల పరిధిలోని చీమలపెంట వద్ద వేంపల్లి నుంచి కడప వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాసులు, మశయ్య, సుబ్బమ్మ చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు. వీరంతా రంపతాడు గ్రామ స్థానికులు వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో ఆటో ముందుభాగం పూర్తిగా దెబ్బతింది.
Sorry, no posts matched your criteria.