India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొండాపురం మండలం కె.సుగుమంచిపల్లె చెక్ పోస్ట్ వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు రూ.10 లక్షల నగదును సీజ్ చేశారు. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఈ నగదును స్వాధీన పరచుకున్నారు. అనంతపురం నుంచి ప్రొద్దుటూరుకు కారులో ఓ మహిళ వెళుతుండగా ఆమె నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
వడదెబ్బతో తెలంగాణకు చెందిన లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం బద్వేల్‌లో జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన లారీ డ్రైవర్ అశోక్ మంగళవారం ఉదయం లారీ మరమ్మతులకు గురి కావడంతో బద్వేలులో నిలిచిపోయాడు. బుధవారం మధ్యాహ్నం అతడు మృతి చెందడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కడప జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న అధికార వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు అమరావతిలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో కొంతమంది అధికారులు వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ టీడీపీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారని వినతి పత్రంలో తెలిపారు.
ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామ సచివాలయానికి చెందిన 18 మంది వాలంటీర్లు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలు సచివాలయ అడ్మిన్ కార్యదర్శికి వారు అందించారు. వాలంటీర్లు మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించకుండా టీడీపీ నాయకుల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం తమను అడ్డుకుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని, ఎంపీగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు.
MP వైఎస్ అవినాశ్ రెడ్డి తప్పు చేశాడని తేలితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. అవినాశ్ రెడ్డి హత్య చేశాడా లేదా అనేది న్యాయ స్థానం నిర్ణయిస్తుందన్నారు. అవినాశ్ తప్పు చేశాడని తేలితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
ఈ నెల 5 నుంచి కడప జిల్లాలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ
పార్టీ నాయకులు తెలిపారు. 5 నుంచి 12 వరకు 8 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 5, 6 తేదీలలో బద్వేలు, కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10, 11న పులివెందుల, 12న జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో బస్ యాత్ర చేపట్టనున్నారు.
చక్రాయపేట మండల పరిధిలోని సురభి గ్రామం నాగుల గుట్టపల్లెలో బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలోని జవహర్ రోజ్ గార్ భవనం వద్ద వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
జిల్లాలోని కమలాపురం పట్టణ సమీపంలో చెరువు కట్ట వద్ద రైలు కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు. నంద్యాల నుంచి రేణిగుంట వెళుతున్న డెమో రైలు కింద యువకుడు బుధవారం ఉదయం పడిపోయాడు. అతని శరీరం రెండు ముక్కలైపోయింది. స్థానికులు గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చాపాడు మండల పరిధిలోని పల్లవోలు గ్రామానికి చెందిన విద్యార్థిని నాగేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కడప MP ఎన్నికల్లో అరుదైన రికార్డు ఉంది. అక్కడ రాజ శేఖర్ రెడ్డి 4 సార్లు పోటీ చేయగా.. YS జగన్ 2 సార్లు పోటీ చేశారు. YSR 1996లో మొదటిసారి MPగా పోటీ చేసినప్పుడు TDP అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డిపై 5445 ఓట్లతో గెలిచారు. అలాగే జగన్ 2011 ఉప ఎన్నికల్లో 5,45,671 ఓట్ల తేడాతో డి.ఎల్ రవీంద్రారెడ్డిపై గెలిచారు. ఇప్పటి వరకు జరిగిన కడప ఎంపీ ఎన్నికల్లో YSRకు అత్యల్ప ఓట్లు రాగా.. జగన్‌కు అత్యధిక ఓట్లు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.