Y.S.R. Cuddapah

News April 3, 2024

YVU కాన్వకేషన్ దరఖాస్తు గడువు మరోమారు పెంపు

image

YVU స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పీహెచ్.డీ పట్టాలు పొందడానికి దరఖాస్తు స్వీకరణ గడువును ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ వెల్లడించారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 8 తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఇప్పటిదాకా 11,725 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

News April 2, 2024

కడప ఎంపీ అభ్యర్థులు వీరే

image

కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. కడప పార్లమెంటు నుంచి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి పోటీ బరిలో ఉన్నారు.

News April 2, 2024

ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీరే

image

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పోటీ చేయబోయే తమ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఇందులో భాగంగా రిజర్వ్‌డు స్థానాలైన బద్వేలు నుంచి విజయ జ్యోతి, రైల్వే కోడూరు నుంచి గోసుల దేవితో పాటు రాయచోటి నుంచి అల్లా బకాష్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించింది.

News April 2, 2024

అన్న అన్నమయ్యలో.. చెల్లి కడపలో పర్యటన

image

ఇవాళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నారు. అలాగే వైఎస్ షర్మిల కడపలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడితే.. షర్మిల కూడా ఇవాళ వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించి తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వెల్లడిస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. షర్మిల కూడా ప్రచారాన్ని ఇడుపులపాయ నుంచే మొదలు పెట్టే అవకాశం ఉంది.

News April 2, 2024

అన్నమయ్య: చిన్నారిని చితకబాదిన టీచర్

image

యూకేజీ చదువుతున్న చిన్నారిని టీచర్ చితకబాదిన ఘటన సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వెలుగు చూసింది. విద్యార్థి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పట్టణంలోని కురవంకలో ఉంటున్న మస్తాన్ కొడుకు మహమ్మద్ ఆలీ వారీస్ (6) సొసైటీ కాలనీలోని స్కూలులో చదువుతున్నాడు. సక్రమంగా చదవడం లేదని టీచర్ చితకబాదింది. తల్లిదండ్రులు బిడ్డ వంటిపై వాతలు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News April 2, 2024

కడప: అక్కడ సైకిల్ గుర్తు కనిపించదు

image

కడప జిల్లాలో 2 EVMలల్లో సైకిల్ గుర్తు కనిపించదు. పొత్తులో భాగంగా కోడూరు నుంచి భాస్కర్ రావు గాజు గ్లాసు గుర్తుమీద పోటీ చేస్తున్నారు. రాజంపేట MP అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. కోడూరు.. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉండటంతో ఇక్కడ సైకిల్ గుర్తు ఈవీఎంలో ఉండదు. బద్వేలు, జమ్మలమడుగులో ఒక్క EVM(కడప ఎంపీ)లోనే సైకిల్ గుర్తు ఉండగా.. మిగిలిన 7 చోట్ల 2 ఈవీఎంలో TDP గుర్తు ఉంటుంది.

News April 2, 2024

నేడు కడపకు రానున్న YS షర్మిల

image

ఏపీసీసీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూల భాస్కర్ తెలియజేశారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని, సాయంత్రం కడప అమీన్ మెమోరియల్ హాల్ లో నిర్వహించే ఇఫ్తార్ విందుకు ఆమె హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

News April 1, 2024

రేపు కడపకు రానున్న YS షర్మిల

image

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు ఇడుపులపాయ రానున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు తన తండ్రి దివంగత YSR సమాధి వద్ద నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం కడప లోక్ సభ స్థానం నుంచి తాను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News April 1, 2024

ప్రొద్దుటూరులో 23 మంది వాలంటీర్ల రాజీనామా

image

పింఛన్ల పంపిణీ వ్యవస్థపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రొద్దుటూరు పట్టణంలోని 28, 30వ వార్డు సచివాలయాల్లోని 23 మంది వాలంటీర్లు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను వార్డు కార్యదర్శికి అందజేశారు. సీఎం వైఎస్ జగన్‌ను మరోసారి గెలిపించుకునేందుకే తాము ప్రచారం చేస్తామని రాజీనామా చేసిన వాలంటీర్లు తెలిపారు.

News April 1, 2024

కాశినాయన: మహిళ అదృశ్యంపై ఫిర్యాదు నమోదు

image

కాశినాయన మండలం బాలయ్య పల్లెకు చెందిన బసిరెడ్డి స్వర్ణలత 16 రోజుల నుంచి కనిపించ లేదని కుటుంబీకులు తెలిపారు. వారు వెతికినా ఆచూకీ లభించలేదని కాశి నాయన మండలం ఎస్సై అమర్నాథ్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసినవారు 9121100660 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై తెలిపారు.

error: Content is protected !!