India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన డ్రైవర్ గండికోట చక్రపాణి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది.
చాగలమర్రి మండల పరిధిలోని జాతీయ రహదారి నగళ్లపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నంద్యాల నుంచి కడపకు వెళ్లే దారిలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి మధ్యలో కారు పడింది. ఘటనలో డ్రైవర్ గండికోట చక్రపాణి మృతిచెందాడు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంతు నాయక్, చాగలమర్రి ఎస్సై అక్కడికి చేరుకుని పరిశీలించారు.
బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కడప జిల్లా, పెండ్లిమర్రి మండలం, తిప్పిరెడ్డిపల్లెకు చెందిన శ్రీవాణి భర్త కృష్ణారెడ్డితో కలిసి ఆళ్లగడ్డలో శుభాకార్యానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ సమీపంలోని ఏవీ గోడౌన్స్ వద్ద వీరు వెళుతున్న బైక్‌ను ప్రైవేట్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీవాణి అక్కడికక్కడే మృతిచెందింది.
ఒంటిమిట్ట మండలం సాలాబాద్ అంకాలమ్మ గుడికి సమీపంలో యువకుడు తీవ్ర గాయాలు, రక్తపు మడుగులో పడివున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. క్రికెట్ గ్రౌండ్ లో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న యువకుడిని చూసి గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 108కు సమాచారం అందించి కడప రిమ్స్ కు తరలించారు. క్షతగాత్రుడు సిద్దవటం మండలానికి చెందిన మౌలాలిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
➤ నియోజకవర్గం: కడప
➤ అభ్యర్థి: మాధవిరెడ్డి, ➤విద్యార్హత: BA
➤చేతిలో ఉన్న డబ్బు: రూ.2,69,000
➤ చరాస్తి విలువ: రూ.54,90,62,928
➤ స్థిరాస్తి విలువ: రూ.325,91,92,400
➤ అప్పులు: రూ.77,54,57,638
➤ బంగారం: 6.43 కేజీలు
➤ కేసులు: 4 ➤ వెహికల్స్: 0 ➤ఇళ్లు : 3
NOTE: అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం.. దంపతులు ఇద్దరికీ కలిపి ఉన్న ఆస్తి వివరాలు
రైల్వేకోడూరులోని స్థానిక వైసీపీ కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం జనసేన రాయలసీమ జోనల్ ఇన్‌ఛార్జ్ కుప్పాల జ్యోతి, కుప్పాలా కిరణ్, వీపీఆర్ కండ్రిక మాజీ సర్పంచ్ సుబ్బరామరాజు వైసీపీలోకి చేరారు. వీరికి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండల ఛైర్మన్ సుకుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కడప నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన అనంతరం మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైసీపీ నుంచి అవినాశ్, కూటమి నుంచి భూపేశ్, కాంగ్రెస్ నుంచి షర్మిలతో ఇతర పార్టీలకు చెందిన 11 మంది బరిలో నిలిచారు. మరోవైపు ముగ్గురు స్వతంత్రులు బరిలో నిలిచారు. మొత్తం 32 మంది పోటీ పడగా 18 మంది నానినేషన్లు తిరస్కరించారు.
4 రోజులుగా జిల్లాలో ఎండ తీవ్రత పెరగడంతో జనాలు రోడ్డు మీదికి రావడానికి భయపడుతున్నారు. జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజంపేట, చిట్వేల్, దువ్వూరు, ముద్దనూరు, పెనగలూరు, పుల్లంపేట, ఎర్రగుంట్ల, వల్లూరు మండలాల్లో 44 డిగ్రీలు, చెన్నూర్, పెండ్లిమర్రిలో 43 డిగ్రీలు, గాలివీడు, లింగాల, మైలవరం, సంబేపల్లెలో 42 డిగ్రీలు, రాజుపాలెం 41, తొండూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం పెద్ద చెప్పలిలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పెద్దచెప్పలిలోని పంచర్ బంకుకు విద్యుత్ సరఫరా కావడంతో అన్వర్ భాష(36) షాక్ తగిలి స్పృహ కోల్పోయాడు. స్థానికులు గమనించి హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెద్దముడియం మండలం చిన్నపసుపులకి చెందిన గొల్ల శ్రీనివాసులు భార్య తులసి పిల్లలతో కలిసి పుట్టినిల్లైన విజయనగరం వెళ్ళింది. వారికోసం వెళ్లిన శ్రీనివాసులు ఇంటికి వచ్చే క్రమంలో గురువారం అందరితో కలిసి నంద్యాలలో ధర్మవరం రైలు ఎక్కారు. జమ్మలమడుగులో దిగాల్సి ఉండగా మరిచిపోయి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో దిగారు. అక్కడి నుంచి బయటకు వెళ్లే క్రమంలో పట్టాలు దాటుతుండగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని మృతి చెందాడు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మరోసారి కడప జిల్లాలో పర్యటించనున్నారు. 30వ తేదీ మైదుకూరులో ఎన్నికల సభ నిర్వహించనున్నారు. కాగా గురువారం పులివెందులలో జగన్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. జగన్ పర్యటనకు YCP శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జగన్ సొంత ఇలాఖాలో మరోసారి పూర్తి పట్టు సాధించాలని చూస్తున్నారు. అటు టీడీపీ కూడా ఈసారి కడప జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
Sorry, no posts matched your criteria.