Y.S.R. Cuddapah

News April 26, 2024

కడప: వివాహిత అనుమానాస్పద మృతి

image

ఒంటిమిట్ట సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న సాయికుమార్, రాచగుడిపల్లె సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై తండ్రి లింగన్న కుమారుడిని మందలించాడు. పెద్దల సమక్షంలో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. గురువారం ‘మీ కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని’ సాయికుమార్ తండ్రి లతిక తండ్రికి ఫోన్ చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ రామచంద్ర తెలిపారు.

News April 25, 2024

మైదుకూరు: గుండెపోటుతో ఉపాధి కూలి మ‌ృతి

image

మైదుకూరు మండలం గంజికుంట పంచాయతీ లెక్కలవారిపల్లెలో గురువారం ఉపాధి కూలి గవ్వల పెద్దబాలుడు (62)ఎండ తీవ్రతతో అస్వస్థకు గురై మృతి చెందాడు. పెద్ద బాలుడు ఉపాధి పనులు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురైన ఆయన గుండెపోటుతో మృతి చెందాడని కూలీలు భావిస్తున్నారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఉపాధి ఏపీఓ రామచంద్రారెడ్డి పరామర్శించారు.

News April 25, 2024

రాజంపేట వాసులకు కీలక హామీలు ఇచ్చిన చంద్రబాబు

image

రాజంపేట ప్రజాగళం సభలో TDP అధినేత చంద్రబాబు రాజంపేట వాసులకు కీలక హామీలు ఇచ్చారు. ‘రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడం. అన్నమయ్య ప్రాజెక్ట్, పింఛా ప్రాజెక్టులు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయడం. మాచుపల్లి బ్రిడ్జీ, ఓబిలి-టంగుటూరు బ్రిడ్జీని పూర్తి చేయడం. జర్రికోట ప్రాజెక్ట్ నుంచి సుండుపల్లికి తాగునీరు, సాగునీరు ఇవ్వడం. గాలేరు, నగరి కాలువ పనులను పూర్తి చేయడం తమ బాధ్యత’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

News April 25, 2024

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. తప్పిన ప్రమాదం

image

ఒంటిమిట్ట శ్రీకోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం చక్రస్నానం జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి, చక్రస్నాం అయిపోయిన అరగంట తర్వాత పందిరి కూలిపోవడం, అక్కడ భక్తులు ఎవ్వరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

News April 25, 2024

కడప: రూ.11.41 కోట్ల మద్యం, నగదు సీజ్

image

ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా 44 రోజుల నుంచి చేస్తున్న తనిఖీల్లో రూ.11.41 కోట్ల విలువైన మద్యం, ఇతర వస్తువులు, నగదును అధికారులు సీజ్ చేసినట్లు కలెక్టరు తెలిపారు. అందులో మద్యం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తుసామగ్రి రూ.7.64 కోట్ల విలువైన వస్తు సామగ్రిని వివిధ విభాగాల తనిఖీ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.50 వేలకు పైబడి తీసుకెళుతున్న రూ.3,76,96,225 నగదును సీజ్ చేశామన్నారు.

News April 25, 2024

అవినాశ్ మంచివాడు కాబట్టే టికెట్ ఇచ్చాను: జగన్

image

వైఎస్ అవినాశ్ రెడ్డి మంచివాడు, తప్పు చేయలేదనే నమ్మకం ఉంది కాబట్టే ఎంపీ టికెట్ ఇచ్చానని సీఎం జగన్ పేర్కొన్నారు. అవినాశ్ మా అందరికంటే చిన్న పిల్లవాడని అతని భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యి అవినాశ్‌పైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అవినాశ్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News April 25, 2024

కడపకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ ఒకరోజు పర్యటనలో భాగంగా కడప జిల్లా చేరుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో తన నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన గన్నవరం నుంచి విమానం ద్వారా కడప విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరి వెళ్లారు. ముందుగా సీఎస్ఐ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని అనంతరం తన నామినేషన్ ను అందజేయనున్నారు.

News April 25, 2024

కడప: ‘రాయి వేస్తే పట్టుకున్నారు.. హత్య చేస్తే స్పందించరా’

image

పులివెందులలో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా జరుగుతుంది. వైఎస్ సునీత బుధవారం వేంపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సీఎం జగన్‌పై గులకరాయితో దాడి జరిగిందని నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. మరి మాజీ మంత్రి వివేకాను క్రూరంగా హత్య చేసి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు మద్దతుగా నిలిచి షర్మిలను ఎంపీగా గెలిపించాలన్నారు.

News April 25, 2024

ఒంటిమిట్ట: నేడు కోదండరాముడికి చక్రస్నానం 

image

ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి చక్రస్నానం నిర్వహించడం జరుగుతుందని ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు అన్నారు. రాత్రి ధ్వజారోహణం ఉంటుందన్నారు. శుక్రవారం పుష్పయాగం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. భక్తులు చక్రస్నానంలో పాల్గొనాలని వారు కోరారు.

News April 25, 2024

వేముల: రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

image

అనంతపురానికి చెందిన శ్రీనివాసులు కుటుంబంతో కలిసి బుధవారం కారులో కడపకు బయలుదేరారు. వేముల మండలంలోని గొందిపల్లె సమీపంలో టీవీఎస్ వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి పక్కనున్న పొలాల్లో పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రద్ధ (14) అనే బాలిక మృతిచెందింది.