India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
CM జగన్ గురువారం పులివెందులకు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు DSP వినోద్ కుమార్ తెలిపారు. టౌన్‌లోకి వచ్చిపోయే RTC బస్సులు ఉ.6 గంటల నుంచి మ.3 గంటల వరకు విజయ్ హోమ్స్ రింగ్ రోడ్, కదిరి రింగ్ రోడ్, అంబకపల్లి రింగ్ రోడ్, పార్నపల్లి రింగ్ రోడ్, ముద్దనూరు రింగ్ రోడ్ మీదుగా RTC బస్టాండ్‌కు వెళ్తాయన్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అశ్వవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాల మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి అశ్వవాహనంపై భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటించారు.
ప్రముఖ నటుడు సుమన్ బుధవారం వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకున్నారు. ఉదయం మఠంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అర్చనలు, అభిషేకాలు చేయించారు. వీరబ్రహ్మంగారి ఆలయ విశిష్ఠతను గురించి సుమన్‌కు వివరించారు. అనంతరం పట్టణంలోని శీలం నరసింహులు గౌడ్ నివాసంలో ఆయన తేనీటి విందులో పాల్గొన్నాడు. సుమన్‌ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో వచ్చారు.
కడప పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి భూపేశ్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి విజయరామరాజుకు నామినేషన్ పత్రాలను అందించారు. ఇప్పటికే కడప ఎంపీ బరిలో వైసీపీ నుంచి అవినాశ్, కాంగ్రెస్ నుంచి షర్మిల, కూటమి నుంచి భూపేశ్ రెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై మొత్తం 69 ఫిర్యాదులు అందగా, అన్నింటిని పరిష్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. మంగళవారం విడుదలైన జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఫిర్యాదుల పరిష్కార నివేదిక మేరకు సివిజిల్ ద్వారా మొత్తం 367 కేసులు నమోదు కాగా 224 నిజనిర్ధారణ అయ్యాయని, 143 నిరాధారమైనవిగా గుర్తించామన్నారు. ఇప్పటివరకు 1078 కేసులు నమోదు చేశామన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పులివెందులకు రానున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం గన్నవరం నుంచి విమానంలో కడప చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో పులివెందులకు చేరుకుంటారు. ముందుగా సీఎస్ఐ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని, సభ అనంతరం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించనున్నారు. తరువాత కడప చేరుకుని గన్నవరం బయల్దేరి వెళ్తారు.
కార్మిక శాఖ దుకాణాలు సంస్థల చట్టం -1988 ప్రకారం మే 13న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దుకాణాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మిక శాఖ సెలవు ప్రకటించిందని జిల్లా కార్మిక శాఖ కమిషనర్ శ్రీకాంత్ నాయక్ తెలిపారు. కావున వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఇతర సంస్థల్లో పని చేస్తున్న ప్రతి వ్యక్తికి ఓటు వేసేందుకు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలన్నారు.
ప్రముఖ నటుడు సుమన్ బుధవారం బ్రహ్మంగారిమఠం వస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఉదయం 9 గంటలకు మఠంలో ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం 10 గంటలకు సిద్దయ్యగారి మఠాన్ని ఆయన దర్శించుకోనున్నారు. అనంతరం 11 గంటలకు బ్రహ్మంగారిమఠం శీలం నరసింహులు గౌడ్ తన నివాసంలో తేనీటి విందులో పాల్గొంటారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు గురువారం రాజంపేటకు రానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట, రైల్వేకోడూరు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం ఇద్దరు హెలికాప్టర్‌లో తిరుపతికి వెళతారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారి జిల్లాకు పవన్, చంద్రబాబు కలిసి రానుండటంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సభలో పాల్గొననున్నారు.
జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గత వారంలో కడపలోని ఓ బిల్డింగ్‌లోకి ఈ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా వెల్లడైంది. సోమవారం రాత్రి మరికొన్ని చోట్ల తిరిగారని పోలీసులు అన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాత్రివేళల్లో పెట్రోలింగ్ కట్టుదిట్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, రాత్రిళ్లు ఎవరైనా బట్టలు లేకుండా వీధుల్లో కనపడితే 100కు ఫోన్ చేయాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.