India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడపలో ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంది. కారణం సీఎం జగన్ సొంత జిల్లా కావడం. గత రెండు ఎన్నికలలో దాదాపు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన YCP ఈసారి కూడా మునుపటి ఫలితాలు ఉంటాయని అంటుంది. అటు TDP ఈసారి మెజార్టీ సీట్లు సాధిస్తుందని ధీమాగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పాగా వేయాలని చూస్తోంది. దీంతో ఉమ్మడి కడప జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అని నేతలు లెక్కలేసుకుంటున్నారు.
పాలకులు, ప్రభుత్వాలు అలా ఉండాలి.. ఇలా ఉండాలని ప్రశ్నించుకుంటాం. కానీ సామాన్యులకు అయిదేళ్లకు ఒక్కసారి వచ్చే పవర్‌ని మాత్రం ఉపయోగించుకోం. కడప జిల్లాలో గత 20 ఏళ్లుగా ఓటేయని వారి సంఖ్య భారీగా ఉంది. వాటి గణాంకాలు చూస్తే.. 2004లో 4,80,599, 2009లో 4,51,256, 2014లో 4,86,351, 2019న 5,01,983 మంది ఓట్లు వేయలేదు. ఈసారి 16,39,066 మంది ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచి మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం.
ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే సామాన్యుడి పండుగకు ఓటర్లు చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. కడప జిల్లాలో 16,39,066 మంది ఓటర్లు ఉండగా, వారిలో 3,38,661 మంది ఓటు వేయలేదు. నియోజకవర్గాలు వారిగా చూస్తే కడపలో 98,406, బద్వేలు 46,627, పులివెందుల 42,844, కమలాపురం 35,746, జమ్మలమడుగు 32,303, ప్రొద్దుటూరు 50,596, మైదుకూరు 32,159 మంది ఓటు వేయలేదు. క్షేత్రస్థాయిలో అధికారులు సరిగ్గా అవగాహన కల్పించలేదని పలువురు అంటున్నారు.
2024-25 విద్యా సంవత్సరం నుంచి గాలివీడు బాలుర ఉన్నత పాఠశాలను జూనియర్ కళాశాలగా ఉన్నతీకరించారని, జూన్ 1 నుంచి ఇంటర్‌కు అడ్మిషన్లు జరుగుతున్నాయని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులు మొహిద్దీన్ పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా కో-ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల ఇంగ్లీష్ మీడియం ప్రారంభం కానుందని తెలిపారు.
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బయమ్మ అనే మహిళ రొమ్ములో పెద్ద గడ్డ ఉండటంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి దాన్ని క్యాన్సర్ గడ్డగా నిర్ధారించి శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ అమానుల్లా, సర్జరీ డిపార్ట్మెంట్ విభాగ అధిపతి డా వాణి, మత్తుమందు విభాగ అధిపతి డా సునీల్ చిరువెళ్ళ, తదితరులు పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు.
రాజంపేట నియోజకవర్గంలో 34 యేళ్లుగా ఓ రికార్డు కొనసాగుతోంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో వారిదే అధికారం. 1985 TDP నుంచి రత్నసభాపతి, 1989లో కాంగ్రెస్ మదన్ మోహన్ రెడ్డి, 1994, 1999లో పసుపులేటి బ్రహ్మయ్య, 2004లో కాంగ్రెస్ నుంచి ప్రభావతమ్మ గెలుచారు. 2009(కాంగ్రెస్)లో ఆకేపాటి, 2014లో TDP ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గెలుపొందారు. 2019లో YCP నుంచి మేడా గెలిచారు. మరి ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా.
జమ్మలమడుగులో బుధవారం గొడవలు జరగవచ్చనే ముందస్తు సమాచారంతో 144 సెక్షన్ వెంటనే అమలుపరుస్తూ పోలీసులు అలర్ట్ ప్రకటించారు. పారామిలిటరీ దళాల తరలింపునకు కలెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేసినట్లు డిఎస్పీ యశ్వంత్ తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ చెక్ పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేసి 500 మంది అదనపు బలగాలను పంపినట్లు డీజీపీ పేర్కొన్నారు. రౌడీ మూకలు ప్రైవేట్ సైన్యం దాడులకు పాల్పడరాదని హెచ్చరించారు.
మండలంలోని కమ్మపాలెం హరిజనవాడకు చెందిన సిద్దవటం సుబ్బయ్య (77) అనే వృద్ధుడిని మంగళవారం బస్సు ఢీకొని మృతి చెందాడు. పనిమీద సిద్దవటంలోని దిగువపేటకు వచ్చిన సుబ్బయ్య రోడ్డు దాటుతుండగా బద్వేలు వైపు నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆయనను కడప సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు, సిద్దవటం ఎస్సై పెద్ద ఓబన్న తెలిపారు.
ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఫలితాల పర్వమే. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అయితే జిల్లాలో ఇప్పటికే రెండు సార్లు గెలిచిన ఐదుగురు హ్యాట్రిక్ సాధిస్తారని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వారిలో వైఎస్ జగన్, రఘరామిరెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్ భాషా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలు ఉన్నారు. దీంతో ప్రజాతీర్పు కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. జిల్లాలో 23,39,900 మొత్తం ఓటర్లు ఉన్నారు. వీరిలో 18,37,711 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో జమ్మలమడుగు నియోజకవర్గం అత్యధికంగా 86.68% నమోదు కాగా, కడపలో 65.27% తక్కువగా నమోదైంది. అటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 99% మంది ఉద్యోగులు ఓటు వినియోగించుకున్నారు. అధికారులు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
Sorry, no posts matched your criteria.