India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22న కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని వాహనాల పార్కింగ్‌కు 15 ప్రదేశాలను గుర్తించినట్లు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు. కళ్యాణ వేదిక సమీపం నుంచి కడప మార్గంలో పది చోట్ల, సాలాబాద్ సమీపంలో 5 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా 22న జరగనున్న కళ్యాణోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కడప పట్టణం, ఒంటిమిట్ట మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కడప నుంచి తిరుపతి వెళ్లే వాహనాలు ఇర్కాన్ సర్కిల్, ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతికి వెళ్లాలని, తిరుపతి నుంచి కడపకు వచ్చే వాహనాలు రేణిగుంట నుంచి రాయచోటి మీదుగా కడపకు రావాలన్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం ఉదయం శ్రీ కోదండ రామస్వామి మోహిని అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అనంతరం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు గరుడసేవ జరుగుతుంది.
అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ MLA వీరశివారెడ్డి అసంతృప్తిపై అధిష్ఠానం బుజ్జగింపులు చేపట్టింది. TDP నేత రవిచంద్రయాదవ్, ఎమ్మల్సీ రాంగోపాల్ రెడ్డి ఇద్దరు శివారెడ్డితో భేటీ అయ్యారు. ఎన్నికల అనంతరం నామినేటెడ్ పదవి ఇస్తామనడంతో ఆయన మెత్తబడినట్లు సమాచారం. మరోవైపు ఉక్కు ప్రవీణ్ తో వ్యవహారం కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. దీంతో వీరు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దుతు తెలపనున్నారు.
గాలివీడులో ముగ్గురు పిల్లలతో వివాహిత నాగమణి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భర్త మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే విషయంపై ఏడాదికి పైగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త విక్రమ్‌కు వేరే మహిళతో ఓ బిడ్డ పుట్టిందని తెలియడంతో.. తీవ్ర మనస్తాపంతో నాగమణి వెలుగల్లి జలాశయం వద్దనున్న గండిమడుగు వద్దకు వెళ్లి పిల్లలతో ఆత్మహత్య చేసుకుంది.
వైవీయూ మనోవిజ్ఞాన శాస్త్ర శాఖ స్కాలర్ డి.సుధా లావణ్యకు వైవీయూ డాక్టరేట్ ను ప్రకటించింది. ఆ శాఖ సహ ఆచార్యులు డావి లాజర్ పర్యవేక్షణలో “వంధ్యత్వం ఉన్న మహిళల్లో వైవాహిక సర్దుబాటు, మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి, జీవన నాణ్యత ప్రభావం” అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంధాన్ని వైవీయూ పరీక్షలు విభాగానికి సమర్పించారు. డాక్టర్ ప్రొసీడింగ్స్ ను వైవీయూ సీఈ ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి జారీ చేశారు.
పులివెందులలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పొలం గట్టు విషయంలో అన్నదమ్ముల ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో అన్న రఘనాథరెడ్డిపై తమ్ముడు రాజశేర్ రెడ్డి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రఘునాథరెడ్డి పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తప్పెట్ల గ్రామ సమీపాన ఉన్న కడప-తాడిపత్రి జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద కడ్డీల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ బోల్తా పడడంతో జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. ఈమేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థిగా ధ్రువ కుమార్ రెడ్డిని నియమించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల నుంచి బీఫామ్ అందుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగి పార్టీని బలోపేతం చేస్తామని వెల్లడించారు. తనకు బాధ్యతలు అప్పగించిన వైఎస్ షర్మిలకు కృతజ్ఞతలు చెప్పారు.
భద్రాచలంలో రాములోరికి గుడి నిర్మించి రామదాసు చరిత్రలో నిలిచిపోయారు. ఒంటిమిట్ట రామాలయానికి ఆ స్థాయిలోనే కృషి చేశారు వావిలికొలను సుబ్బారావు. 1863 జనవరి 23న ప్రొద్దుటూరులో జన్మించిన ఆయన ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం టెంకాయ చిప్ప చేత పట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఊరూరా తిరిగారు. భిక్షంగా వచ్చిన నగదును ఆలయ అభివృద్ధికి ఖర్చు చేశారు. 1936, ఆగస్టు 1న మద్రాసులో కన్నుమూశారు.
Sorry, no posts matched your criteria.