India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉదయం 9 గంటలకు కడప పార్లమెంట్ పరిధిలో 12.09 శాతం నమోదైంది. అటు రాజంపేట పరిధిలో 10.36 నమోదు అయింది. కాగా పుల్లంపేట, చాపాడు, కమలాపురం ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బద్వేలు: 10.20% ✒ జమ్మలమడుగు: 16:39% ✒ కడప: 9.67% ✒ కమలాపురం :12.80% ✒ మైదుకూరు: 10.68% ✒ ప్రొద్దుటూరు: 12: 62% పులివెందుల: 12.44 ✒ రాజంపేట: 7.89% ✒ రాయచోటి: 10.50% ✒కోడూరు 10.31% నమోదు అయింది.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మాక్ పోలింగ్ అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రారంభమైంది. కడప జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ అధికారుల ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ ఎలా నిర్వహిస్తారో వారికి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి తిరిగి వెళ్లే వరకు తీసుకోవాల్సిన ప్రక్రియపై వారికి వివరించారు. ఏదైనా అనుమానాలు ఉంటే పోలింగ్ అధికారిని సంప్రదించాలంటూ తెలిపారు.
వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల ఎన్నికల ప్రత్యేక అధికారిగా ఐపీఎస్ అధికారి అతుల్ సింగ్ ను నియమిస్తూ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఎన్నికలు సజావుగా జరిగేలా పర్యవేక్షణ చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలకు ఈయనను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
ప్రజాస్వామ్య పండుగలో భాగంగా మే 13న జరిగే ఎన్నికల ఓటింగ్ కార్యక్రమంలో మీ కుటుంబంలోని ఓటర్లందరూ.. తమ ఓటు హక్కును సద్వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఒక ప్రకటన ద్వారా ఆహ్వానం పలికారు. ఓటు హక్కును పొందిన వారంతా తమ తమ నియోజకవర్గాల్లో ఓటర్ కార్డు కలిగిన పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 13వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు ఓటు వేసేందుకు తరలిరావాలని ఓటర్లను సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు సాయంత్రం కడప జిల్లాకు రానున్నారు. ఎన్నికలలో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు తన సతీమణి భారతితో కలిసి ఈరోజు పులివెందుల రానున్నారు. ఈరోజు సాయంత్రం తాడేపల్లి నుంచి బయలుదేరి విమానంలో కడపకు చేరుకొని పులివెందులకు వెళ్తారు. రేపు ఉదయం పులివెందులలో వారి ఓటు హక్కును సీఎం జగన్ వినియోగించుకోనున్నారు. దీంతో పోలీసులు భద్రతను కట్టు దిట్టం చేశారు.
ఉమ్మడి కడప జిల్లాలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. బద్వేల్-76.3, రాజంపేట-74.1, కడప-62.8, కోడూరు-74.8, రాయచోటి-74.9, పులివెందుల-89.5, కమలాపురం-81.9, జమ్మలమడుగు-85.7, ప్రొద్దుటూరు-76.9, మైదుకూరు- 81.3. అలాగే ఇటీవల జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో జమ్మలమడుగు, కడపలో 100%, మిగిలిన చోట్ల అంతా 90% పైగా ఓట్లు పోలయ్యాయి. అదే స్ఫూర్తితో ఈసారి ఆ శాతం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటుకు నోటు తెరలేసింది. పట్టును బట్టి డబ్బు.. డిమాండ్ చేస్తే మరింత పెంపు. ఇప్పుడు జిల్లా అంతా ‘అన్నా మీ ఊరిలో ఓటుకు ఎంత ఇస్తున్నారే’ అనే పదం చక్కర్లు కొడుతుంది. ఓటుకు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు నగదు. పైగా బంగారం, బియ్యం ప్యాకెట్లు, వెండి, చీరలు ఇస్తున్నారని సమాచారం.
* ఓటరా.. గుర్తు పెట్టుకో నోటుతో నీ అమూల్యమైన ఓటును అమ్ముకొని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోకు.
ప్రొద్దుటూరులో ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఓటుకు నోటుకు తెరెత్తారని కూటమి MLA అభ్యర్థి వరదరాజుల రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. MLA పంపిణీ చేసిన డబ్బులో దొంగనోట్లు ఉన్నాయేమో ప్రజలు గమనించుకోవాలన్నారు. బంగారు కమ్మలు సైతం ఇస్తున్నారని.. అందులో నకిలీ కూడా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మీ భూములను దోచుకునేందుకే ఇంకో అవకాశం ఇవ్వమని వైసీపీ నాయకులు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు.
మైదుకూరు మండలం వనిపెంట శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో బాలకృష్ణుని విగ్రహం గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు బొమ్మిశెట్టి రమేశ్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఈ ఆలయంలోని మొగసాల మండపంను ముద్దరాజు కట్టించారు. ఈ మండపం రాతి కట్టడంపై బాలకృష్ణుని ప్రతిమను నిర్మించారని తెలిపారు.
పులివెందుల నియోజక వర్గ పరిధిలో 13న జరిగే పోలింగ్‌కు సంబంధించిన భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద అనుసరించాల్సిన విధానాలపై ఆయన అధికారులుకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.