Y.S.R. Cuddapah

News May 8, 2024

రేపు రాజంపేటలో జగన్ భారీ బహిరంగ సభ

image

రాజంపేట పాత బస్టాండ్ లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభ జరగనున్నది. ఈ సభకు జన సమీకరణ కోసం పార్టీ శ్రేణులు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత మొట్టమొదటి సారి జగన్ రాజంపేటకు రానున్నారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ రాజంపేటలో ప్రచారం చేసి వెళ్లారు.

News May 8, 2024

మైదుకూరులో 7 దశాబ్దాల రికార్డు చెరిగేనా?

image

మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు 7 దశాబ్దాల నుంచి ఒక రికార్డు ఉంది. ఇక్కడ ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరగగా, అందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే MLAలు కావడం విశేషం. మొదటగా రామారెడ్డి, నారాయణరెడ్డి గెలిచారు. అనంతరం నాగిరెడ్డి రెండు పర్యాయాలు గెలిచారు. డీఎల్ రవీంద్రారెడ్డి 6, శెట్టిపల్లె రఘురామిరెడ్డి 4 సార్లు గెలిచారు. అయితే ఈసారి TDP కూటమి నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ గెలిచి చరిత్ర సృష్టిస్తారా?

News May 8, 2024

కడప: ఒకే నియోజకవర్గం.. 2 జిల్లాలు!

image

ఉమ్మడి కడప జిల్లా పునర్విభజనలో రాజంపేట నియోజకవర్గం రెండు జిల్లాల్లో భాగమైంది. ఇక్కడ ఒంటిమిట్ట, సిద్దవటం కడప జిల్లాలో కలవగా, నందలూరు, వీరబల్లె, రాజంపేట అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. విశేషం ఏటంటే సిద్దవటం, ఒంటిమిట్ట కడపలో కలిసిన ప్రజలు మాత్రం రాజంపేట నియోజకవర్గంలో ఓట్లు వేస్తారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 9 సార్లు, TDP 4 సార్లు, YCP 2 సార్లు, సీపీఐ నుంచి ఒకరు, మూడు సార్లు స్వతంత్రులు ఎన్నికయ్యారు.

News May 8, 2024

పోస్టల్ బ్యాలెట్ కు మరో అవకాశం : కలెక్టర్

image

ఎన్నిక కమీషన్ ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది 8వ తేదీ (బుధవారం) కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మంగళవారం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12 ఆర్ఓ వద్ద సబ్మిట్ చేసి 5, 6, 7 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోలేక పోయిన ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

News May 8, 2024

కోడూరు: ఎన్డీఏకి మద్దతుగా జబర్దస్త్ టీం ప్రచారం

image

ఓబులవారిపల్లి మండలం, చిన్నంపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో జబర్దస్త్ సద్దాం టీం కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్, పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని వారు ప్రజలను కోరారు. సద్దాం వెంట పలువురు నటులు ఉన్నారు. కాగా కొందరు సినీ నటులు జనసేనకు మద్దుతు ఇస్తున్న సంగతి తెలిసిందే.

News May 7, 2024

పులివెందుల గడ్డపై స్వతంత్ర అభ్యర్థి విక్టరీ

image

పులివెందుల నియోజకవర్గం అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు వైఎస్సార్. 1970 దశకం నుంచి ఆ కుటుంబం నియోజకవర్గంపై బలమైన పట్టును కలిగి ఉంది. అలాంటి నియెజకవర్గంలో ఓ స్వతంత్ర అభ్యర్థి విజయబావుటా ఎగరేశారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి చవ్వా బాలిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పెంచికల బసిరెడ్డిపై 5,008 ఓట్లతో విజయం సాధించారు. ఇప్పటి వరకు ఆయన తప్ప మరే స్వతంత్ర అభ్యర్థి ఇక్కడ విజయం సాధించలేదు.

News May 7, 2024

కడప: ఆ రెండు స్థానాల్లో జనసేన కంటే NOTAకే ఎక్కువ ఓట్లు

image

NOTA గురించి అందరికీ తెలిసిందే. అభ్యర్థులకు ఓటర్లు ఓటు వేయదలచుకోనప్పుడు NOTAకు వేయొచ్చు. గత ఎన్నికల్లో రాయచోటి, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోని ప్రజలు జనసేన కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వేశారు. జమ్మలమడుగులో జనసేన-1038, నోటా- 2260 ఓట్లు పోలవ్వగా, రాయచోటిలో జనసేనకు 1480 మంది ఓటు వేస్తే, నోటాకు ఏకంగా 2226 మంది ఓటు వేశారు. ఈ రెండు స్థానాల్లో ఈసారి జనసేన పోటీలో లేదు.

News May 7, 2024

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు నమోదు

image

జమ్మలమడుగు MLA సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ఈనెల 5వ తేదీన జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు వినియోగించుకునేందుకు ఉద్యోగులు బారులు తీరారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పుకుని లోనికి వెళ్లారు. ఇది ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం కాగా ఆర్వో శ్రీనివాసులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News May 7, 2024

కమలాపురం: బిల్డింగ్‌పై పడి యువకుడి మృతి

image

కమలాపురం స్టేట్ బ్యాంక్‌ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సూరజ్ కుమార్ మృతి చెందినట్లు ఎస్సై రిషికేశవరెడ్డి తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మహారాజ్ గంజి జిల్లాకు చెందిన సూరజ్ కుమార్ ఎస్బీఐ బ్యాంక్ నందు కార్పెంటర్ పనులు చేస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి తన సహచరులతో కలిసి బ్యాంకు పైన నిద్రపోతున్నారు. సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు కింద పడడంతో మృతి చెందాడని తెలిపారు.

News May 7, 2024

షర్మిలపై కేసు నమోదు చేసిన బద్వేలు పోలీసులు

image

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యకేసు ప్రస్తావించారనే ఆరోపణలపై బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఎన్నిలు పూర్తయ్యే వరకు వివేకా హత్యపై ప్రచారాల్లో మాట్లాడకూడదని కడప కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.