India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లా ప్రజల దశాబ్దాల కల ఉక్కు పరిశ్రమ ఏర్పాటు. కానీ అది శంకుస్థాపనలకే పరిమితమై, ఆచరణకు నోచుకోలేదు. ఇప్పటి వరకు ముగ్గురు సీఎంలు శంకుస్థాపనలు చేశారు. 2007 జూన్ 10న YSR మొదటగా పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. మళ్లీ పదేళ్లకు 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇక మూడోసారి జగన్ 2019 డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. దీంతో ఇది ఎప్పుడు పూర్తవుతుందో అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు.
రాజంపేట పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తానేనని ప్రజలందరూ అనుకుంటున్నారని, అది నిజం కాదని మాజీ పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం, స్వలాభం కొరకు రాజంపేట పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉన్న తనని మార్చి పార్టీకి సంబంధం లేని వ్యక్తిని నిలబెట్టారన్నారు.
జిల్లాలోని దువ్వూరు మండలం భీమునిపాడులో జక్కయ్య అనే ఉపాధి కూలీ సోమవారం ఉపాధి పనులకు వెళ్లారు. పనిచేస్తున్న ప్రదేశంలో తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతి చెందినట్లు తోటి కూలీలు తెలిపారు. మృతుని కుటుంబాన్ని గ్రామ సర్పంచ్, ఏపీవో వసంత కుమార్, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులు పరామర్శించి, తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
రాజంపేట మున్సిపల్ పరిధిలోని రాంనగర్‌లో చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. రాజంపేట మున్సిపల్ పరిధిలో కుక్కలు సైర విహారం చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండాలంటే మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు వాపోతున్నారు.
అన్నమయ్య జిల్లాలో ఈనెల 8, 9వ తేదీల వరకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నామని జిల్లా డి.ఎమ్.హెచ్.ఓ డాక్టర్ కొండయ్య, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఉషశ్రీ సంయుక్తంగా తెలిపారు. ఈ సంవత్సరం జరిగే హజ్ యాత్రలో పాల్గొనే యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా రెండు కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కడప ఎయిర్‌పోర్టు సమీపాన గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వాహనం ఢీ కొట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికలు తుది అంఖానికి చేరుకున్నాయి. మరో 7 రోజుల్లో పోలీంగ్ మొదలవుతుంది. దీంతో నాయకులు పథకాలు, హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో YCP పూర్తి పెత్తనం సాగింది. 2014 ఎన్నికలలో 9 స్థానాలు గెలవగా, 2019 ఎన్నికల్లో 10 స్థానాలు కైవసం చేసుకుంది. ఈసారి ప్రధాన పార్టీలైన YCP, TDP కూటమి, కాంగ్రెస్ కడప జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు?
కడప ఎయిర్‌పోర్టు సమీపాన గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వాహనం ఢీ కొట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
తన మాట వినకపోతే చంపేస్తానని వైసీపీ నాయకుడు వడ్ల దాదాపీర్ బెధిరిస్తున్నాడని యువతి ఆరోపించారు. ప్రొద్దుటూరుకు చెందిన ఓ యువతి దాదాపీర్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉండగా మాయమాటలు చెప్పి లైంగికంగా వేధించేవాడని తెలిపారు. పెళ్లి నిశ్చయమైతే పెళ్లి వారికి ఫొటోలు చూపించి బెదిరెంచేవాడని ఆరోపించారు. వేధింపులు తాళలేక ఇల్లు మారితే అక్కడ కూడా ఇలాగే కొనసాగించేవాడని ఆరోపించారు. దీంతో పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.
ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే అభ్యర్థి వాహనంపై దాడి జరిగింది. మాజీ మంత్రి వివేకా హత్య అప్రూవర్, జై భీంరామ్ భారత్ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి వాహనంపై పులివెందులలో కొందరు అల్లరి మూకలు దాడి చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార వాహనం ముద్దనూరు మీదగా వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు అల్లరిమూకలను చెదరొట్టారు.
Sorry, no posts matched your criteria.