India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖాజీపేట మండల పరిధిలోని సిద్ధాంతపురంలో ఆదివారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. రైతు కందుల రామిరెడ్డి పొలం వెళ్లి విద్యుత్తు మోటారు ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కడప జిల్లాలోని యర్రగుంట్లకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వచ్చారు. ఇందులో భాగంగా కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి తరఫున ఆయన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
షర్మిల నోరు అదుపులో పెట్టుకొని విమర్శలు చేయాలని YSRTP నాయకుడు కొండ రాఘవరెడ్డి మండిపడ్డారు. నిన్న జగన్‌పై షర్మిలా చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆయన కడపలో కౌంటర్ ఇచ్చారు. వివేకా హత్య కేసులో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. సీఎంకు అద్దం చూపించడం కాదని.. ఒకసారి మీ ముఖం అద్దంలో చూసుకోవాలన్నారు. తెలంగాణలో మీరు చేసిన అక్రమాలతో వందల కుటుంబాలు నాశనం అయ్యాయన్నారు. వాస్తవాలు త్వరలో బయటపెడతా అన్నారు.
జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలకు వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శనివారం ఒక్క రోజే వడదెబ్బతో బి.కోడూరు-గురివిరెడ్డి, చాపాడు-ఓబుళమ్మ, సోగలపల్లె-కొండూరు వెంకటన్న, పోరుమామిళ్ల-వెంకట సుబ్బయ్య, ఖాజీపేట-వెంకటపతి మృతి చెందారు. వడదెబ్బతో వీరు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. తీవ్ర వడగాలులకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి శనివారం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్ట్ విధించిన షరతులకు ఆయన శుక్రవారం అంగీకారం తెలిపారు. దీంతో శనివారం సాయంత్రం ఆయన విడుదల అయ్యారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ నేడు కడప జిల్లాకు రానున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలమడుగు కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను పోలీసు అధికారులు పరిశీలించారు. ఇప్పటికే పర్యటనలో భాగంగా రోడ్ షో, బహిరంగ సభ ఏర్పాట్లను సంబంధించి నాయకులు పూర్తి చేశారు.
బద్వేలు మాజీ ఎమ్మెల్యే కమలమ్మ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి చేరుతుందని వస్తున్న కథనాలు అవాస్తవమని ఆమె అనుచరులు తెలిపారు. ఆమె కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని ఏ పార్టీలోకి చేరడం లేదని పేర్కొన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆ పార్టీని వీడి ఎక్కడికి వెళ్ళమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.
వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా చేపట్టే పోలీసు భద్రతా, నిఘా చర్యలను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు దీపక్ మిశ్రా ఎన్నికల నిర్వహణ అధికారులకు సూచించారు. కర్నూలు రేంజ్ డీఐజీ విజయ్ రావు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయ్ రామరాజు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కునాల్ సిల్కు సమావేశం నిర్వహించారు.
తర్లుపాడు మండలం నాగేళ్లముడుపులో బీరపోగు సామ్రాజ్యం అనే వృద్ధురాలు మండుతున్న ఎండలు వేడిమి తాళలేక తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సుబ్బమ్మ వృద్ధురాలి మృతదేహానికి నివాళులర్పించారు. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న సామ్రాజ్యం ఒకసారిగా స్పృహ కోల్పోయి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మిడుతూరు పంచాయితీ కి చెందిన మాజీ సర్పంచ్ దొడ్డవాండ్ల వెంకటపతి (75) వడదెబ్బతో మృతిచెందారు. గ్రామస్థులు, బంధువుల వివరాల మేరకు.. ఎండలు ఎక్కువగా వున్న క్రమంలో మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య ఎర్రక్కతో పాటు కుమారుడు అంకయ్య ఉన్నాడన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు శ్రీనువాసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంతాపం తెలిపారు. వెంకటపతి మరణం కుటుంబానికి తీరని లోటన్నారు.
Sorry, no posts matched your criteria.