India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటి కొరత, వడదెబ్బ వంటి వేసవి సమస్యలను అధిగమించాలని కడప జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు. తాగునీటి కొరత, వేసవి వడగాల్పులు, వడదెబ్బ, ముందస్తు జాగ్రత్త చర్యలు” పై తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందస్తుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో దీనిపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాయచోటిలో 1952 నుంచి 17సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే గడికోట శ్రీంకాత్ రెడ్డి 2009 నుంచి వరుసగా 4సార్లు గెలుపొందారు. 2012 ఎన్నికల్లో TDP అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం మరోమారు అవకాశం ఇచ్చింది. కాగా TDP నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈసారి ఇరువురిలో ఎవరు విజయం సాధించనున్నారు. కామెంట్ చేయండి.
సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 12 :20 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం హెలికాఫ్టర్ లో బయలుదేరి 12:45కు ఇడుపులపాయకు చేరుకుంటారు. అనంతరం వైఎస్ఆర్ ఘాట్ వద్ద 1:20 వరకు ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటారు. 1:30 కు ఇడుపులపాయలో బయలుదేరి వేంపల్లి, వీఎన్ పల్లె, ఎర్రగుంట్ల మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియా కేంద్రంగా మార్చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా కిల్లీ కొట్టులో కూడా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం విక్రయించే నాసిరకం మద్యం తాగడంతో పలువురు పేదలు కూడా మరణించారని విమర్శించారు.
వేంపల్లె మండలం గండి రోడ్‌లో ఆదివారం సాయంత్రం మద్యం తాగిన మత్తులో నలుగురు యువకులు విచక్షణా రహితంగా కత్తులతో పొడుచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఇద్దరికి పొట్టభాగంలో, మరొకరికి కాలి తొడభాగంలో తీవ్ర గాయాలయి రక్తస్రావం జరుగుతుందని సర్జరీ చేయాలని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని చుంచులూరు సచివాలయ సమీపం వద్ద జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున రోడ్డు పై నడిచి వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ఈ రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా ఖాజీపేటకు చెందిన వలస కూలీ సురేశ్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.
తేనెటీగల దాడిలో ఉపాధి కూలి మృతి చెందినట్లు ఏపీవో సారధి తెలిపారు. ఏపీవో వివరాల మేరకు.. కమలాపురం మండలం గొల్లపల్లెకు చెందిన గురివిరెడ్డిగారి గంగిరెడ్డి కాల్వ పనులు చేస్తుండగా అక్కడే ఉన్న తేనెటీగలు ముక్కుమ్మడిగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయినట్లు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు 108 ద్వారా హాస్పిటల్ కు తరలించారు. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని ఆయన తెలిపారు.
కడప జిల్లా బద్వేలు టీడీపీ నేత బొజ్జ రోషన్న భారతీయ జనతా పార్టీలో చేరారు. టీడీపీ తరఫున బద్వేలు ఎమ్మెల్యే సీటును ఆశించడంతో ఆ సీటును కూటమి కుదుపులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో రోషన్న తన అనుచరులతో చర్చించి ఈరోజు కాషాయ కండువా కప్పుకున్నారు. కడప బీజేపీ కార్యాలయంలో ఆయనకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బద్వేలు నియోజకవర్గ కూటమి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా బొజ్జ రోషన్న ఎంపిక కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఈయన ఎమ్మెల్యే టికెట్ ఆశించగా, కూటమి సర్దుబాటులో భాగంగా బద్వేలు స్థానం బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో రోషన్న నేడు బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఈయన పేరు వెలువడనుందని సమాచారం.
ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొట్టగా నడింపల్లి గ్రామానికి చెందిన లగమ వెంకటసుబ్బారెడ్డి అలియాస్ గోపాల్ రెడ్డి, ఆదెన రామచంద్రారెడ్డి మృతి చెందారు. ఒంటిమిట్ట నుంచి నడింపల్లికి బైక్‌పై వెళ్తుండగా, కడప నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటసుబ్బారెడ్డి ఘటనా స్థలంలో మృతి చెందగా, రామచంద్రారెడ్డి మార్గమధ్యలో చనిపోయారు.
Sorry, no posts matched your criteria.