India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒంటిమిట్ట శ్రీకోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం చక్రస్నానం జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి, చక్రస్నాం అయిపోయిన అరగంట తర్వాత పందిరి కూలిపోవడం, అక్కడ భక్తులు ఎవ్వరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా 44 రోజుల నుంచి చేస్తున్న తనిఖీల్లో రూ.11.41 కోట్ల విలువైన మద్యం, ఇతర వస్తువులు, నగదును అధికారులు సీజ్ చేసినట్లు కలెక్టరు తెలిపారు. అందులో మద్యం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తుసామగ్రి రూ.7.64 కోట్ల విలువైన వస్తు సామగ్రిని వివిధ విభాగాల తనిఖీ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.50 వేలకు పైబడి తీసుకెళుతున్న రూ.3,76,96,225 నగదును సీజ్ చేశామన్నారు.
వైఎస్ అవినాశ్ రెడ్డి మంచివాడు, తప్పు చేయలేదనే నమ్మకం ఉంది కాబట్టే ఎంపీ టికెట్ ఇచ్చానని సీఎం జగన్ పేర్కొన్నారు. అవినాశ్ మా అందరికంటే చిన్న పిల్లవాడని అతని భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యి అవినాశ్‌పైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అవినాశ్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ ఒకరోజు పర్యటనలో భాగంగా కడప జిల్లా చేరుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో తన నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన గన్నవరం నుంచి విమానం ద్వారా కడప విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా పులివెందులకు బయలుదేరి వెళ్లారు. ముందుగా సీఎస్ఐ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని అనంతరం తన నామినేషన్ ను అందజేయనున్నారు.
పులివెందులలో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా జరుగుతుంది. వైఎస్ సునీత బుధవారం వేంపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సీఎం జగన్‌పై గులకరాయితో దాడి జరిగిందని నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. మరి మాజీ మంత్రి వివేకాను క్రూరంగా హత్య చేసి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు మద్దతుగా నిలిచి షర్మిలను ఎంపీగా గెలిపించాలన్నారు.
ప్రసిద్ధిగాంచిన ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి చక్రస్నానం నిర్వహించడం జరుగుతుందని ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు అన్నారు. రాత్రి ధ్వజారోహణం ఉంటుందన్నారు. శుక్రవారం పుష్పయాగం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. భక్తులు చక్రస్నానంలో పాల్గొనాలని వారు కోరారు.
అనంతపురానికి చెందిన శ్రీనివాసులు కుటుంబంతో కలిసి బుధవారం కారులో కడపకు బయలుదేరారు. వేముల మండలంలోని గొందిపల్లె సమీపంలో టీవీఎస్ వాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి పక్కనున్న పొలాల్లో పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రద్ధ (14) అనే బాలిక మృతిచెందింది.
CM జగన్ గురువారం పులివెందులకు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు DSP వినోద్ కుమార్ తెలిపారు. టౌన్‌లోకి వచ్చిపోయే RTC బస్సులు ఉ.6 గంటల నుంచి మ.3 గంటల వరకు విజయ్ హోమ్స్ రింగ్ రోడ్, కదిరి రింగ్ రోడ్, అంబకపల్లి రింగ్ రోడ్, పార్నపల్లి రింగ్ రోడ్, ముద్దనూరు రింగ్ రోడ్ మీదుగా RTC బస్టాండ్‌కు వెళ్తాయన్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అశ్వవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాల మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి అశ్వవాహనంపై భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటించారు.
ప్రముఖ నటుడు సుమన్ బుధవారం వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకున్నారు. ఉదయం మఠంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అర్చనలు, అభిషేకాలు చేయించారు. వీరబ్రహ్మంగారి ఆలయ విశిష్ఠతను గురించి సుమన్‌కు వివరించారు. అనంతరం పట్టణంలోని శీలం నరసింహులు గౌడ్ నివాసంలో ఆయన తేనీటి విందులో పాల్గొన్నాడు. సుమన్‌ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో వచ్చారు.
Sorry, no posts matched your criteria.