India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు గురువారం రాజంపేటకు రానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట, రైల్వేకోడూరు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం ఇద్దరు హెలికాప్టర్‌లో తిరుపతికి వెళతారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారి జిల్లాకు పవన్, చంద్రబాబు కలిసి రానుండటంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సభలో పాల్గొననున్నారు.
జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గత వారంలో కడపలోని ఓ బిల్డింగ్‌లోకి ఈ గ్యాంగ్ ప్రవేశించినట్లు సీసీ పుటేజీల ద్వారా వెల్లడైంది. సోమవారం రాత్రి మరికొన్ని చోట్ల తిరిగారని పోలీసులు అన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాత్రివేళల్లో పెట్రోలింగ్ కట్టుదిట్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, రాత్రిళ్లు ఎవరైనా బట్టలు లేకుండా వీధుల్లో కనపడితే 100కు ఫోన్ చేయాలని తెలిపారు.
జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ కెఎస్.జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మలమడుగు మున్సిపాలిటీ 4వ వార్డ్ కౌన్సిలర్ జ్ఞాన ప్రసూన (32) సోమవారం రాత్రి మృతి చెందారు. జమ్మలమడుగుకు చెందిన వంగల నాగేంద్ర కుమార్తె జ్ఞాన ప్రసూన తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉంటోంది. సోమవారం రాత్రి కోయంబత్తూర్లోని తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈమె మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికపై అభ్యంతరం వ్యక్తం చేసి YCPకి రాజీనామా చేసింది.
➤ నియోజకవర్గం: కమలాపురం
➤ అభ్యర్థి: పి. రవీంద్రనాథ్ రెడ్డి
➤ చరాస్తి విలువ: రూ.21,66,41,321
➤ స్థిరాస్తి విలువ: రూ.14,07,41,368
➤ అప్పులు: రూ.20,02,58,264
➤ కేసులు: 3
NOTE: అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం.. దంపతులు ఇద్దరికి కలిపి ఉన్న ఆస్తి వివరాలు
ప్రజల ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని మంత్రి అంజాద్ బాష అన్నారు. సోమవారం సాయంత్రం కడప నగరంలోని 26వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని వివరించారు. మరోసారి కడప ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వైఎస్ అవినాశ్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఒంటిమిట్ట శ్రీకోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాములను పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించి రామాలయం నుంచి ఊరేగింపుగా కళ్యాణ మండపం దగ్గరకు తీసుకెళ్లారు. తెలుగుదనం ఉట్టిపడేలా సీతారాముల కళ్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో కళ్యాణ మండపం కిటకిటలాడింది.
మైదుకూరు మండలం మిట్టమానుపల్లె సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రహ్మంగారిమఠం మండలం గోడ్లవీడుకు చెందిన ఉప్పలూరు గురవయ్య ఓ న్యూస్ ఛానల్‌లో విలేకరిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఆయన బ్రహ్మంగారిమఠం నుంచి మైదుకూరు వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఒంటిమిట్ట శ్రీకోదండ రాముని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు సీతారాములు కళ్యాణం జరగనుంది. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మండపాన్ని రకరకాల పూలు, పండ్లతో సుందరీకరణగా అలంకరణ చేస్తున్నారు. టీటీడీ సిబ్బంది కళ్యాణ మండపం అలంకరణను పర్యవేక్షిస్తున్నారు.
10th ఫలితాల్లో కడప జిల్లా 92.10% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 3 స్థానంలో నిలిచింది. 27,729 మందికి 25,538 పాసయ్యారు. 13,515 మంది బాలికలకు 12,609 పాసయ్యారు. బాలురు 14,214 మందికి గానూ 12,929 పాసయ్యారు. బాలికలు ఈసారి సత్తా చాటారు. కాగా 2023లో 79.43% ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 92.10% సాధించారు. అటు అన్నమయ్య జిల్లా 86.67 ఉత్తీర్ణత శాతంతో 17వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 22,240 మందికి గానూ 19,276 పాసయ్యారు.
Sorry, no posts matched your criteria.