India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లింగాల మండలంలోని తాతిరెడ్డిపల్లెలో ఆకుల లక్ష్మీ నారాయణపై వెన్నపూస నారాయణరెడ్డి అనే వ్యక్తి ఆదివారం రాత్రి వేట కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల లక్ష్మీనారాయణ కుటుంబంలోని మహిళ పట్ల నారాయణరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడని అతనిపై కేసు నమోదు చేయించారు. దీనిని మనసులో పెట్టుకున్న నారాయణరెడ్డి లక్ష్మీనారాయణపై దాడి చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రైల్వే కోడూరు కూటమి అభ్యర్థిగా డాక్టర్ యనమల భాస్కరరావును జనసేన పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. తాజాగా జనసేన పార్టీ తన పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తూ జాబితాని విడుదల చేసింది. ఇందులో ఎస్సీ రిజర్వుడు అయిన రైల్వే కోడూరు నియోజకవర్గానికి డాక్టర్ భాస్కర్ రావును ఎంపిక చేస్తూ, ఆయన విజయం కోసం జనసేన టీడీపీ శ్రేణులు పనిచేయాలని కోరారు.
అనకాపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ను ప్రకటిస్తూ బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. కాసేపటి క్రితం దేశవ్యాప్తంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ఈయన రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.
రాజంపేట పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అదిష్టానం ప్రకటించింది. తాజాగా దేశవ్యాప్తంగా వెలువడిన బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో రాజంపేట అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రకటిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన విజయం కోసం మూడు పార్టీల నేతలు పనిచేయాలన్నారు.
జిల్లాలోని బి.మఠం మండలం గుండాపురానికి చెందిన వ్యక్తి కువైట్‌లో మరణించాడు. గుండాపురానికి చెందిన బిజివేముల రామచంద్రారెడ్డి(47) బతుకు తెరువు కోసం కువైట్‌కు వెళ్లాడు. కాగా గతనెల 16న భవన నిర్మాణ పనిచేస్తూ ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతూ ఈనెల 21న మరణించాడు. ఆదివారం తన స్వగ్రామానికి బంధుమిత్రుల సహాయంతో మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
దువ్వూరు మండలంలోని ఇడమడక మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి బాల పెద్దన్నకు చెందిన 20 గొర్రెలు మృతిచెందాయి. గొర్రెల మంద రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఢీకొట్టిన లారీ నిలుపకుండా పోవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. చాగలమర్రి టోల్ ప్లాజా వద్ద గుర్తింపుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో పెద్దముడియం మండలం బలపనగూడూరుకి చెందని ఇద్దరు వ్యక్తులు శనివారం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఏసోబు, బండెన్న బేల్దారి పని నిమిత్తం 2 రోజుల క్రితం బైకులో అనంతపురం జిల్లాకు వెళ్లారు. పనులు ముగించుకుని శనివారం స్వగ్రామానికి వస్తుండగా రోటరీపురం వద్ద ఓ కళాశాల బస్సు వీరి బైకును ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
కడప 3వ డివిజన్ వైసీపీ ఇన్‌ఛార్జ్ సుదర్శన్‌రెడ్డిపై రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. డివిజన్‌లో ఒక హోటల్‌ను వైసీపీ నాయకులచే ప్రారంభించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన బెలూన్లు వైసీపీ జెండా రంగులను పోలి ఉన్నాయని సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ పార్థసారథి అభ్యంతరం వ్యక్తం చేసి రూ.10వేలు అపరాధ రుసుం విధించారు. ఈ క్రమంలో జరిగిన వాదులాటలో ఆర్‌ఓ ఆదేశాల మేరకు ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రొద్దుటూరు నుంచి ఈనెల 27న ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి అంజద్ బాషా, మేయర్ సురేశ్ బాబు అధ్యక్షతన కడపలో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా సభ నిర్వహణకు తీసుకోవాల్సిన అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. సభకు భారీగా ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
కర్నూలుకు చెందిన రాజశేఖర్ శర్మ అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అదే జిల్లాలోని గోనెగండ్ల మండలంలో ఆయన పని చేసేవాడు. ఇటీవలె ఆయన్ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్థాపానికి గురై రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చారు. ఓ లాడ్జిని అద్దెకు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.