India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కమలాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1989లో కాంగ్రెస్ నుంచి మైసూరారెడ్డి 38,727 ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు. ఇదే ఇప్పటి వరకు అత్యధికం. ఇక అత్యల్పంగా 1967లో స్వంతంత్ర అభ్యర్థి ఎన్.పుల్లారెడ్డి కేవలం 86 ఓట్లతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి, కూటమి నుంచి పుత్తా కృష్ణ చైతన్య బరిలో ఉన్నారు. వీరిలో మీరు ఎవ్వరు గెలుస్తారనుకుంటున్నారు.
జిల్లాలో 2019 తర్వాత నియమించిన హోం గార్డులును వేరే జిల్లాలకు బదిలీ చేయాలని శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఈసీని కోరారు. సీఎం జగన్.. ఆయనకు అనుకూలంగా ఉన్న వారికి ఈ పదవులు ఇచ్చారని రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. వారు ఎన్నికల పమయంలో అధికారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందన్నారు.ఈ నేపథ్యంలో బదిలీ చేయాలని, లేకుంటే ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీకి లేఖ రాశారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలోని విద్యాశాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుబ్బారెడ్డిలు తెలిపారు. కడపలో వారు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడు లేనివిధంగా, దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో నాడు నేడు మనబడి కింద ప్రతి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేశారన్నారు. ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు.
టీడీపీ అధిష్ఠానం ఇప్పటికైనా గుర్తించి, తనకు టీడీపీ టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తానని రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట రాంనగర్‌లో బుధవారం తెలుగుదేశం పార్టీ తరఫున బత్యాల ప్రచారం ప్రారంభించారు. రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగవాసి ఈరోజు ప్రచారం ప్రారంభించగా, అదే సమయానికి బత్యాల మరో చోటు నుంచి ప్రచారం ప్రారంభించడం అందరినీ అయోమయ పర్చింది.
బతుకుతెరువు కోసం కువైట్‌కి వెళ్లి ప్రమాదశాత్తు ఓబులవారిపల్లెకు చెందిన ఓబిలి సుబ్బ నరసింహారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఈయన కొన్నేళ్లుగా కువైట్‌లో క్రేన్ దగ్గర ఉద్యోగరీత్యా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. డ్యూటీకి వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఇసుక లారీ వ్యాన్‌ను ఢీకొనడంతో వెనుక భాగంలో ఉన్న ఇతను అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు పార్టీల ఫిరాయింపులతో ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా రాయచోటి మాజీ YCP ఆర్.రమేశ్ కుమార్ రెడ్డి TDPకి రాజీనామా చేసి, నేడు జగన్ సమక్షంలో YCPలో చేరుతున్నట్లు స్పష్టంచేశారు. అయితే సోదరుడు శ్రీనువాసులరెడ్డి సతీమణి మాధవిరెడ్డి కడప TDP MLA అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో సోదరులు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉండటంతో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
సంగమేశ్వర ఆలయం సమీపంలోని సంగాల మడుగులో పడి తాటిమాకుల పల్లెకు చెందిన సంజయ్ కుమార్(13) అనే బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం సంజయ్ కుమార్ స్నేహితులతో కలిసి సంఘాల మడుగులో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. నీటిలో మునిగిపోతున్న మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలుడి మృతితో పండగ పూట ఆ ఇంట విషాదం నెలకొంది.
కడప జిల్లాలో ఉగాది రోజు విషాదం నెలకొంది. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద ఈతకు వెళ్లిన వ్యక్తి మృతిచెందాడు. కడపకు చెందిన డేవిడ్ నలుగురు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఆనకట్ట వద్దకు వచ్చాడు. ఈత కొట్టే క్రమంలో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు మృతదేహాన్ని వెలికి తీశారు. వల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
ఏపీలో భారత చైతన్య యువజన పార్టీ తరఫున పోటీ చేసే 32 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్(RCY) విడుదల చేశారు. తొలి జాబితాలో ఉమ్మడి కడప జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. పులివెందులలో సూరే నిర్మల, రైల్వేకోడూరులో పూటిక సుబ్బారాయుడు పోటీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 8 స్థానాలకు త్వరలో అభ్యర్థులను ఖరారు చేస్తామని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.
కడప రైల్వే స్టేషన్‌లో కేరళకు చెందిన అధిలా(22) అనే వైద్య విద్యార్థి గాయపడ్డాడు. నీటి కోసం రైలు దిగాడు. తిరిగి ఎక్కడానికి ప్రయత్నించగా అప్పటికే రైలు కదిలింది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. గమనించిన తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఎడమ మోకాలు పూర్తిగా తెగిపోయిందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.