India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాశినాయన మండలం కొండరాజుపల్లికి చెందిన సునీత(22) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈమెకు రెండేళ్ల క్రితం వివాహమైంది. భర్త సిద్దులు తెలంగాణ రాష్ట్రంలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సునీత గురువారం ఇంటికి వచ్చింది. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్ఐ కాశన్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కుందూ బ్రిడ్జి సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కర్నూలులో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్ఐ కొండారెడ్డి వివరాల మేరకు.. మైదుకూరు నానుబాలపల్లెకు చెందిన పందిటి చెంచయ్య (56) ప్రొద్దుటూరు నుంచి మైదుకూరుకు వెళుతుండగా వెనుక వైపున వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చెంచయ్యకు బలమైన గాయాలు కాగా, చికిత్స కోసం కర్నూలుకు తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.
పెండ్లిమర్రి మండలం యాదవాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు హత్య కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో అడిషనల్ SP వెంకట్రాముడు నేతృత్వంలో SP సిద్దార్థ్ కౌశల్ సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెండ్లిమర్రి ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఢిల్లీలో గురువారం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజంపేటకు చెందిన మేడా రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం భారత ఉపరాష్ట్రపతి ఆయనకు అభినందనలు తెలిపారు.
జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం రాష్ర్టంలోనే అత్యధికంగా ఒంటిమిట్టలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎండ ప్రభావానికి వృద్ధులు, చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు మధ్యాహ్నం బయటికి రావద్దని హెచ్చరించారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పట్టాలు పొందడానికి దరఖాస్తు స్వీకరణ గడువు నేటితో (ఈ నెల 4వ తేదీతో) ముగియనుందని అధికారులు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 8వ తేదీ వరకు ఉంటుందన్నారు. వివిధ డిగ్రీల పట్టాల కోసం ఇప్పటివరకు 11725 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
పింఛన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటనలో పులివెందుల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. సింహాద్రిపురం మండలం లోమడ గ్రామానికి చెందిన నారాయణమ్మ (70) బుధవారం పింఛన్ కోసం సచివాలయానికి వెళుతూ దారిలో వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి మృతి చెందింది.
కొండాపురం మండలం కె.సుగుమంచిపల్లె చెక్ పోస్ట్ వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు రూ.10 లక్షల నగదును సీజ్ చేశారు. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఈ నగదును స్వాధీన పరచుకున్నారు. అనంతపురం నుంచి ప్రొద్దుటూరుకు కారులో ఓ మహిళ వెళుతుండగా ఆమె నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
వడదెబ్బతో తెలంగాణకు చెందిన లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం బద్వేల్‌లో జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన లారీ డ్రైవర్ అశోక్ మంగళవారం ఉదయం లారీ మరమ్మతులకు గురి కావడంతో బద్వేలులో నిలిచిపోయాడు. బుధవారం మధ్యాహ్నం అతడు మృతి చెందడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కడప జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న అధికార వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు అమరావతిలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో కొంతమంది అధికారులు వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ టీడీపీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారని వినతి పత్రంలో తెలిపారు.
Sorry, no posts matched your criteria.