Y.S.R. Cuddapah

News April 2, 2024

అన్నమయ్య: చిన్నారిని చితకబాదిన టీచర్

image

యూకేజీ చదువుతున్న చిన్నారిని టీచర్ చితకబాదిన ఘటన సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వెలుగు చూసింది. విద్యార్థి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పట్టణంలోని కురవంకలో ఉంటున్న మస్తాన్ కొడుకు మహమ్మద్ ఆలీ వారీస్ (6) సొసైటీ కాలనీలోని స్కూలులో చదువుతున్నాడు. సక్రమంగా చదవడం లేదని టీచర్ చితకబాదింది. తల్లిదండ్రులు బిడ్డ వంటిపై వాతలు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News April 2, 2024

కడప: అక్కడ సైకిల్ గుర్తు కనిపించదు

image

కడప జిల్లాలో 2 EVMలల్లో సైకిల్ గుర్తు కనిపించదు. పొత్తులో భాగంగా కోడూరు నుంచి భాస్కర్ రావు గాజు గ్లాసు గుర్తుమీద పోటీ చేస్తున్నారు. రాజంపేట MP అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. కోడూరు.. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉండటంతో ఇక్కడ సైకిల్ గుర్తు ఈవీఎంలో ఉండదు. బద్వేలు, జమ్మలమడుగులో ఒక్క EVM(కడప ఎంపీ)లోనే సైకిల్ గుర్తు ఉండగా.. మిగిలిన 7 చోట్ల 2 ఈవీఎంలో TDP గుర్తు ఉంటుంది.

News April 2, 2024

నేడు కడపకు రానున్న YS షర్మిల

image

ఏపీసీసీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూల భాస్కర్ తెలియజేశారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని, సాయంత్రం కడప అమీన్ మెమోరియల్ హాల్ లో నిర్వహించే ఇఫ్తార్ విందుకు ఆమె హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

News April 1, 2024

రేపు కడపకు రానున్న YS షర్మిల

image

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు ఇడుపులపాయ రానున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు తన తండ్రి దివంగత YSR సమాధి వద్ద నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం కడప లోక్ సభ స్థానం నుంచి తాను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News April 1, 2024

ప్రొద్దుటూరులో 23 మంది వాలంటీర్ల రాజీనామా

image

పింఛన్ల పంపిణీ వ్యవస్థపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రొద్దుటూరు పట్టణంలోని 28, 30వ వార్డు సచివాలయాల్లోని 23 మంది వాలంటీర్లు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను వార్డు కార్యదర్శికి అందజేశారు. సీఎం వైఎస్ జగన్‌ను మరోసారి గెలిపించుకునేందుకే తాము ప్రచారం చేస్తామని రాజీనామా చేసిన వాలంటీర్లు తెలిపారు.

News April 1, 2024

కాశినాయన: మహిళ అదృశ్యంపై ఫిర్యాదు నమోదు

image

కాశినాయన మండలం బాలయ్య పల్లెకు చెందిన బసిరెడ్డి స్వర్ణలత 16 రోజుల నుంచి కనిపించ లేదని కుటుంబీకులు తెలిపారు. వారు వెతికినా ఆచూకీ లభించలేదని కాశి నాయన మండలం ఎస్సై అమర్నాథ్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసినవారు 9121100660 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్సై తెలిపారు.

News April 1, 2024

రాజంపేట: టిప్పర్, ఆటో ఢీ.. ఒకరు మృతి

image

రాజంపేట మండలం పోలి గ్రామం సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, ఆటో ఢీకొన్న ఘటనలో వెంకటలక్ష్మి (40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 1, 2024

పులివెందుల ఫస్ట్.. ఎర్రగుంట్ల థర్డ్

image

ఇంటి, నీటి పన్నుల వసూళ్లలో పులివెందుల మొదటి స్థానంలో నిలిచిందని ఆ సంస్థ కమిషనర్ తెలిపారు. జిల్లాలో పన్ను వసూళ్లలో పులివెందుల 83.90%తో ప్రథమ స్థానంలో నిలిచింది. కడప 82.8% ద్వితీయ స్థానం, ఎర్రగుంట్ల 77.30 % మూడో స్థానాల్లో ఉన్నట్లు కమిషనర్లు తెలిపారు. మున్సిపల్ సచివాలయ ఉద్యోగుల కృషితో, వినియోదారుల సహకారంతో పన్ను వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

News April 1, 2024

జమ్మలమడుగు బరిలో డాక్టర్ V/s టీచర్

image

రాష్ట్ర రాజకీయాల్లో జమ్మలమడుగుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం YCP నుంచి సిట్టింగ్ MLA డా. మూలె సుధీర్ రెడ్డి మరోసారి బరిలో ఉన్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో జమ్మలమడుగులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఆది నారాయణ రెడ్డి మరోసారి తన హవా కొనసాగించేందుకు కూటమి అభ్యర్థిగా సిద్దమయ్యారు. రాజకీయాలకు ముందు కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేశారు. మరి ఇద్దరిలో గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News April 1, 2024

కడపలో సందడి చేయనున్న శ్రీలీల

image

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఏప్రిల్ 5న కడపకు రానున్నారు. నగరంలోని ఓ షోరూమ్‌ ప్రారంభించేందుకు శ్రీలీల వస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించి షోరూం నిర్వాహకులు కడప పట్టణంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహకులు, పోలీసులు తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.