India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భార్యే భర్తను చంపిన ఘటన అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో వెలుగు చూసింది. కోటవూరు(P) చవటకుంటపల్లెకు చెందిన వెంకటరమణ(58) మొదటి భార్యతో విడిపోయాడు. రెండో భార్య రెడ్డెమ్మ, కుమారుడితో ఉంటున్నారు. మద్యం తాగి రోజూ గొడవపడేవాడు. ఈక్రమంలో బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ గొంతుకు భార్య చీర బిగించి చంపేసింది. దీనికి కుమారుడు సహకరించినట్లు సమాచారం. CI సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలని అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు. వారి పేర్ల మీద ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది. దేశంలో ఆంజనేయస్వామి లేకుండా రాములవారు ఉన్న ఆలయం ఇదొక్కటే.

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎన్నికల ఆఫిడవిట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.147 కోట్లుగా చూపించారు. అప్పులు రూ.54 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. అలాగే బెంగళూరు, హైదరాబాద్‌లో ఇళ్లు ఉన్నట్లు వెల్లడించారు. తనకు ఎలాంటి వాహనాలు లేవని స్పష్టం చేశారు. తనకు 100 గ్రాములు, భార్య వద్ద 1.286 కేజీల బంగారం ఉన్నట్లు ప్రకటించారు..

కడప పార్లమెంట్‌కు TDP ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూపేశ్ రెడ్డి తనపై ఉన్న కేసులను ప్రస్తావించారు. జమ్మలమడుగు PCలో నమోదైన SC, ST కేసులో పోలీసులు ఛార్జ్ సీటు వేయలేదని, జమ్మలమడుగు కోర్టులో నడుస్తున్న మరో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి. శిక్ష పడిన కేసులు లేవని వెల్లడించారు. రూ.9.60 లక్షల జీవిత బీమా, రెండు లక్షల బ్యాంకు డిపాజిట్లు చూపించారు. రూ.62.17 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.

సార్వత్రిక ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా అభ్యర్థుల డిపాజిట్ ఫీజులను కలెక్టర్ విజయరామరాజు వివరించారు. లోక్‌సభకు పోటీచేసే జనరల్ అభ్యర్థికి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు పోటీచేసే జనరల్ అభ్యర్థికి రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు చెల్లించాలని కలెక్టర్ వివరించారు.

సార్వత్రిక ఎన్నికలు – 2024 కు సంబంధించి కడప జిల్లాలో నేడు మొదటి రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా ప్రారంభం అయిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప పార్లమెంట్ కు 2, అసెంబ్లీకి 3, జమ్మలమడుగుకు 2, ప్రొద్దుటూరుకి 1, మైదుకూరుకు 3 నామినేషన్ దాఖలు కాగా, బద్వేలు, పులివెందుల, కమలాపురం పరిధిలో ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు కాలేదన్నారు.

బద్వేలులో భారీ మొత్తంలో బంగారు, వెండి పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. గోపవరం మండలం, పి.పి కుంట చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించగా బొలెరో వాహనంలో తరలిస్తున్న రూ.5 కోట్ల విలువచేసే గోల్డ్ & సిల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నుంచి కడపకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇవి సీక్వెల్ లాజిస్టిక్స్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సార్వత్రిక ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా అభ్యర్థుల డిపాజిట్ ఫీజులను కలెక్టర్ విజయరామరాజు వివరించారు. ఎంపీకి పోటి చేసే జనరల్ అభ్యర్థికి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు పోటీచేసే జనరల్ అభ్యర్థికి రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు చెల్లించాలని కలెక్టర్ వివరించారు.

రాజంపేటలో ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రానున్నారు. ఏప్రిల్ 24న వారు రాజంపేటకు రానున్నారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని జిల్లా నేతలు పిలుపునిచ్చారు. అలాగే ఇవాళ రాజంపేట వైసీపీ శ్రేణులు పలువురు TDPలో చేరుతున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారం పేరిట భూకబ్జాలు, సహజవనరులు దోచుకుంటున్నాడని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. స్థానిక BJP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వివేకా హత్యకేసు CM జగన్ దంపతులకు తెలియకుండా జరిగుండదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం, రాజోలి జలాశయం నిర్వాసితులకు రూ.12.50 లక్షలకు బదులుగా రూ.24 లక్షలు పరిహారం ఇప్పిస్తానని ఆది హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.