India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వేద పండితులు ఇవాళ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం ధ్వజారోహణం(మీథున లగ్నం) సాయంత్రం శేష వాహన సేవ జరుగుతుంది. 22న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటలకు కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో ఈనెల 18 నుంచి మొదలయ్యే నామినేషన్స్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీసీ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ సత్యనారాయణరావు, వివిధ విభాగాల నోడల్ అధికారులు పాల్గొన్నారు.

నందలూరు మండలానికి చెందిన గొబ్బిళ్ళ కృష్ణ శ్రీవాత్సవ్ ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో 444 ర్యాంక్ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ శ్రీవాత్సవ్ సోదరి విద్యాధరి కందుకూరు సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకే ఇంట్లో అక్క ఉద్యోగం, తమ్ముడు సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

అన్నమయ్య జిల్లాలో స్లాష్ 2024 పరీక్షలు 120 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని డీసీఈబీ సెక్రటరీ కె నాగమునిరెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లాకు కేటాయించిన అన్ని కేంద్రాలలో స్లాష్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏ కేంద్రానికి మినహాయింపు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సిబ్బంది పాల్గొన్నారు.

యోగివేమన యూనివర్సిటీలో సుల్తానా అనే విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. కదిరికి చెందిన సుల్తానా యోగి వేమన యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. తోటి విద్యార్థినులు మెస్‌కు వెళ్లిన సమయంలో హాస్టల్ గదిలో ఉరేసుకుంది. మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బ్రహ్మంగారిమఠం మండలంలోని నందిపల్లె దొడ్ల డైరీ సమీపంలో జరిగిన కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో బద్వేల్‌కు చెందిన టీవీఎస్ షోరూం నిర్వాహకుడు అంబవరపు జయసుబ్బారెడ్డి(55) మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. టిప్పర్ కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న సుబ్బారెడ్డికి తలకు తీవ్ర గాయాలుకావడంతో 108లో కడపకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

18న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అదే రోజు నుంచి అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. అన్ని నియోజకవర్గాల ఆర్‌ఓలు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడా మోడల్ కోడ్ ఆఫ్ కాండెక్ట్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఓబులవారిపల్లె మండలంలోని చిన్నఓరంపాడులో YCP, TDP వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు. గ్రామానికి చెందిన నరసింహులు, శంకరయ్యల మధ్య ఇంటి స్థలానికి సంబంధించి 2ఏళ్లుగా వివాదం ఉండటంతో సోమవారం రాత్రి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు స్థానికలు తెలిపారు. TDPకి చెందిన నరసింహులు, లక్ష్మీదేవి, చెంగమ్మ, నాగేశ్వరి, YCPకి చెందిన శంకరయ్య, నాగేంద్ర గాయపడ్డారు. కేసు నమోదు చేసినట్లు SI చిన్న పెద్దయ్య తెలిపారు.

ఉమ్మడి కడప జిల్లాలో TDPకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే రమేష్ రెడ్డి పార్టీని వీడారు. ప్రస్తుతం కమలాపురం మాజీ MLA వీర శివారెడ్డి YCPలోకి చేరుతారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. కమలాపురం నుంచి 3సార్లు MLAగా గెలిచారు. TDP టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. దీంతో TDPని వీడుతున్నాని సోమవారం ఓ సందర్భంలో స్పష్టం చేశారు. దీంతో ఆయన YCPలో చేరుతారా లేక కాంగ్రెస్ గూటికి వెళ్తారా అనేది చూడాలి.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయని ఆలయ అధికారులు సోమవారం వెల్లడించారు. ఏప్రిల్ 16న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.