India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిపాదనల మేరకు 10 మందికి స్థానచలనం కల్పించారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.
యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(సివిల్స్) ఫలితాల్లో కడప జిల్లా యువకుడు సత్తా చాటాడు. చెన్నూరుకు చెందిన నేలటూరు శ్రీకాంత్ రెడ్డికి 151వ ర్యాంకు వచ్చింది. మొదటి, రెండో ప్రయత్నంలో ప్రిలిమినరీ, మెయిన్స్ పాసయ్యారు. ఇంటర్వ్యూ వరకు వెళ్లినా సెలెక్ట్ కాలేదు. తాజా ఫలితాల్లో సివిల్స్ సాధించారు. ఇండోర్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కడప జిల్లా యువతి సత్తా చాటింది. ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరుకు చెందిన ఎద్దుల శివారెడ్డి, లక్ష్మీకొండమ్మ కుమార్తె పూజిత ఎంఈసీ చదువుతోంది. 500 మార్కులకు గాను 494 సాధించింది. ఇంగ్లిషులో 78, సంస్కృతంలో 99, మ్యాథ్స్ 1ఏలో 50, 1బీలో 50, ఎకనామిక్స్‌లో 99, కామర్స్‌లో 98, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌లో 20 మార్కులతో సత్తా చాటింది. ఆమెను అందరూ అభినందించారు.
ఉమ్మడి కడప జిల్లా నెహ్రూ యువ కేంద్ర యువజన అధికారిగా విధులు నిర్వహిస్తున్న మణికంఠ కడప నుంచి నాగాలాండ్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. జిల్లాలో ఐదు సంవత్సరాల పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. బదిలీపై వెళుతున్న మణికంఠను స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, వాలంటీర్లు ఘనంగా సన్మానించారు.
పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కడప జిల్లాలో 27,800 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
కడప జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట తిరుగుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?
ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరు శాంతినగర్ బ్రిడ్జి వద్ద బైకు అదుపుతప్పి డివైడర్ ఢీకొనడంతో చియ్యవరం పంచాయతీ నడింపల్లికు చెందిన చరణ్ (28) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నవీన్ బాబు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఇసుక పంపిణీ పారదర్శకంగా జరగాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. సోమవారం కడప కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్ హాజరయ్యారు. ఇబ్రహీంపేట రీచ్‌లో లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఇసుక రీచ్ వద్ద సీసీ కెమెరాలు నిరంతరం పని చేయాలన్నారు. ఎక్కడా అవకతవకలు జరగకూడదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కడప జిల్లా వ్యాప్తంగా మే 10 తేదీన లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేసులు రాజీ పడే అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లా పరిధిలోని ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.
మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లి వద్ద నిన్న <<16156996>>ప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. కడప జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరుకు చెందిన నరసింహులు(26), బద్వేల్‌లోని రూపవరం పేటకు చెందిన ఝాన్సీ(26) బైకుపై పెంచలకోనకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా చెట్టును ఢీకొట్టారు. యువతి అక్కడికక్కడే మృతిచెందగా.. బద్వేలు ఆసుపత్రికి తరలిస్తుండగా యువకుడి మృతి చెందాడు. మర్రిపాడు ఎస్ఐ కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.