India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లా యర్రగుంట్ల మండలంలో MLA ఆదినారాయణరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పాకిస్థాన్ పైన తీవ్రమైన చర్య ఉంటుందని ప్రపంచం మొత్తం బారత్‌కు మద్దతు ఇస్తోందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు అయినప్పటి నుంచి 3 కోట్లకు పైగా కశ్మీర్‌లో పర్యాటకులు సందర్శించారన్నారు. 22 కోట్ల జనాభా ఉన్న పాకిస్థాన్‌కు అంత ఉంటే 140 కోట్లు ఉన్న మనం ఏంటో ఆర్మీ శక్తి, ప్రధాని మోదీ అంటే ఏంటో పాకిస్థాన్‌కు తెలుస్తుందన్నారు.
గర్భిణులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని కడప ఐసీడీఎస్ పీడీ శ్రీ లక్ష్మీ పేర్కొన్నారు. గురువారం కడప కలెక్టరేట్ సభా భవనంలో కడప, అన్నమయ్య జిల్లాల ఐసీడీఎస్ అధికారులకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మాతృవందన పథకంలో గర్భం దాల్చిన 9నెలలలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండు విడుతలగా ఆర్థిక సాయం అందుతుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఏపీలో నిన్న టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని 4 IIITల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన 2025 పది పరీక్షా ఫలితాల్లో తండ్రి, కూతురు ఒకేసారి ఉత్తీర్ణత సాధించారు. ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం ఆవుల శెట్టివారిపల్లెకు చెందిన మోడెం వెంకటేశ్ 268 మార్కులు తెచ్చుకున్నారు. ఈయన 9వ తరగతి వరకు చదివి డ్రాప్ అయ్యారు. ఈ ఏడాది ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి పాస్ అయ్యారు. ఆయన కుమార్తె మోడెం పూజిత ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివి 585 మార్కులు సాధించింది.
టెన్త్ ఫలితాలలో జె.శ్రీవాణి సత్తా చాటింది. రైల్వే కోడూరు మంగంపేటలో నివాసం ఉంటున్న జె. శ్రీవాణి 598 మార్కులతో స్టేట్ 3వ ర్యాంక్, జిల్లా ఫస్ట్ ర్యాంకులు సాధించింది. ప్రొద్దుటూరు YMR కాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివి ఈ ఘనత సాధించింది. ఈమె తల్లిదండ్రులు జానకిరామారెడ్డి, లక్ష్మీదేవి, చిరు వ్యాపారస్తులుగా మంగంపేటలో జీవనం కొనసాగిస్తున్నారు.
తాగునీటి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం ప్రొద్దుటూరు నియోజకవర్గ అబివృద్ధి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పశువులకు నీటి సరఫరా కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, జమ్మలమడుగు అర్డీఓ సాయిశ్రీ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో కడప జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పోలీసులు ప్రజలతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, అల్లర్లకు పాల్పడినా, అల్లర్లకు ప్రేరేపించినా చర్యలు తప్పవన్నారు. ఈ కార్డాన్ అండ్ సర్చ్‌లో రికార్డులు లేని 57 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
కడప జిల్లా సిద్దవటం మండలంలో 2022లో జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.1లక్ష జరిమానా విధిస్తూ కడప 7వ ఏడీజే కోర్ట్ జడ్జి జీఎస్ రమేష్ కుమార్ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. బుధవారం ఎస్సై మాట్లాడుతూ.. ఓ మహిళ మాచుపల్లి గ్రామ రేణుక ఎల్లమాంబ గుడి ముందు పడుకుని ఉండగా నరసింహులు అలియాస్ బూపడు పట్టుడు కట్టెతో బలంగా కొట్టి గాయపరిచి అత్యాచారం చేయడంతో ఆమె మృతి చెందిందన్నారు.
పదో పరీక్షా ఫలితాల్లో కడప జిల్లాలోని బాలురు సత్తాచాటారు. మొత్తం 27,680 మంది పరీక్ష రాయగా 22,361 మంది పాసయ్యారు. 14,278 మంది బాలురులో 11,189 మంది, 13,402 మంది బాలికలు పరీక్ష రాయగా 11,172 మంది పాసయ్యారు. 80.78 శాతం పాస్ పర్సంటేజ్‌తో కడప జిల్లా 18వ స్థానంలో నిలిచింది. గతేడాది మూడో స్థానంలో నిలవగా.. ఈసారి 18వ స్థానానికి పడిపోయింది.
సోషల్ మీడియా పరిచయం పెళ్లి వరకు వెళ్లి మనస్పర్థల కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు తనను వేధిస్తున్నాడని బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినప్పటికీ ఇమ్రాన్ తనకు ఫొటోలు పంపి వేధిస్తున్నాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది.
Sorry, no posts matched your criteria.