Y.S.R. Cuddapah

News April 20, 2024

కోడ్ ఉల్లంఘనపై 532 ఫిర్యాదులు: కడప కలెక్టర్

image

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై 535 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ విజయరామరాజు అన్నారు. 532 ఫిర్యాదులకు పరిష్కారం అందించామన్నారు సీ.విజిల్ ద్వారా మొత్తం 336 కేసులు నమోదు కాగా, అందులో 203 నిజనిర్ధారణ కాగా, 133 నిరాధారమైనవని గుర్తింమన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,011 ఎఫ్.ఐ.ఆర్. కేసులు నమోదు చేశామన్నారు.

News April 19, 2024

YVU: రేపటి నుంచే డిగ్రీ పరీక్షలు

image

యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఎస్సీ, బిఏ, బీకాం, బి.బి.ఏ, బి.సి.ఎ, ఒకేషనల్ 1,2,4,6 సెమిస్టర్ల పరీక్షలు శనివారం నుంచి జిల్లాలోని 57 కేంద్రాలలో ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. ఎన్ ఈశ్వర్ రెడ్డి తెలిపార. మట్లాడుతూ.. 31,830 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు. విద్యార్థులు సంబంధిత కళాశాల నుంచి హాల్ టికెట్లు పొందాలన్నారు. 

News April 19, 2024

కడప: ఇండిపెండెంట్ MP అభ్యర్థిగా షణ్ముఖ రెడ్డి నామినేషన్

image

కడప ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాకర్ల షణ్ముఖ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజుకు నామినేషన్ పత్రాలను అందించారు. ప్రొద్దుటూరుకు చెందిన షణ్ముఖ రెడ్డి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా ఆయన ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

News April 19, 2024

ఒంటిమిట్ట: రాములోరి కళ్యాణానికి 1.20 ల‌క్ష‌ల లడ్డూలు

image

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల‌ కళ్యాణానికి వచ్చే భ‌క్తుల‌కు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల మధ్య అత్యంత వైభ‌వంగా శ్రీ సీతారాముల‌ కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను అందజేయనున్నారు. దాదాపు 250 మంది శ్రీ‌వారి సేవ‌కులు 1.20 ల‌క్ష‌ల లడ్డూలను సిద్ధం చేశారు. 

News April 19, 2024

కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్

image

కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శనివారం ఉదయం నామినేషన్ వేయనున్నారు. భారీ ర్యాలీతో కడపకు చేరుకుని కడపలోని వివిధ సర్కిల్స్ మీదుగా కాంగ్రెస్ పార్టీకి కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం చేరుకొని తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కడపలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News April 19, 2024

అన్నమయ్య: భర్తను చంపిన భార్య

image

భార్యే భర్తను చంపిన ఘటన అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో వెలుగు చూసింది. కోటవూరు(P) చవటకుంటపల్లెకు చెందిన వెంకటరమణ(58) మొదటి భార్యతో విడిపోయాడు. రెండో భార్య రెడ్డెమ్మ, కుమారుడితో ఉంటున్నారు. మద్యం తాగి రోజూ గొడవపడేవాడు. ఈక్రమంలో బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ గొంతుకు భార్య చీర బిగించి చంపేసింది. దీనికి కుమారుడు సహకరించినట్లు సమాచారం. CI సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News April 19, 2024

‘ఒంటిమిట్ట’ అనే పేరు ఎలా వచ్చిందంటే?

image

ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలని అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు. వారి పేర్ల మీద ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది. దేశంలో ఆంజనేయస్వామి లేకుండా రాములవారు ఉన్న ఆలయం ఇదొక్కటే.

News April 19, 2024

మిథున్ రెడ్డి ఆస్తులు రూ.147 కోట్లు

image

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎన్నికల ఆఫిడవిట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.147 కోట్లుగా చూపించారు. అప్పులు రూ.54 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. అలాగే బెంగళూరు, హైదరాబాద్‌లో ఇళ్లు ఉన్నట్లు వెల్లడించారు. తనకు ఎలాంటి వాహనాలు లేవని స్పష్టం చేశారు. తనకు 100 గ్రాములు, భార్య వద్ద 1.286 కేజీల బంగారం ఉన్నట్లు ప్రకటించారు..

News April 19, 2024

కడప: భూపేశ్ రెడ్డి ఆస్తి వివరాలు

image

కడప పార్లమెంట్‌కు TDP ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూపేశ్ రెడ్డి తనపై ఉన్న కేసులను ప్రస్తావించారు. జమ్మలమడుగు PCలో నమోదైన SC, ST కేసులో పోలీసులు ఛార్జ్ సీటు వేయలేదని, జమ్మలమడుగు కోర్టులో నడుస్తున్న మరో రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయి. శిక్ష పడిన కేసులు లేవని వెల్లడించారు. రూ.9.60 లక్షల జీవిత బీమా, రెండు లక్షల బ్యాంకు డిపాజిట్లు చూపించారు. రూ.62.17 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.

News April 19, 2024

కడప: సెక్యూరిటీ డిపాజిట్ ఎంతంటే?

image

సార్వత్రిక ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా అభ్యర్థుల డిపాజిట్ ఫీజులను కలెక్టర్ విజయరామరాజు వివరించారు. లోక్‌సభకు పోటీచేసే జనరల్‌ అభ్యర్థికి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు పోటీచేసే జనరల్‌ అభ్యర్థికి రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు చెల్లించాలని కలెక్టర్ వివరించారు.