India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

18న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అదే రోజు నుంచి అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. అన్ని నియోజకవర్గాల ఆర్‌ఓలు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎక్కడా మోడల్ కోడ్ ఆఫ్ కాండెక్ట్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఓబులవారిపల్లె మండలంలోని చిన్నఓరంపాడులో YCP, TDP వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు. గ్రామానికి చెందిన నరసింహులు, శంకరయ్యల మధ్య ఇంటి స్థలానికి సంబంధించి 2ఏళ్లుగా వివాదం ఉండటంతో సోమవారం రాత్రి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు స్థానికలు తెలిపారు. TDPకి చెందిన నరసింహులు, లక్ష్మీదేవి, చెంగమ్మ, నాగేశ్వరి, YCPకి చెందిన శంకరయ్య, నాగేంద్ర గాయపడ్డారు. కేసు నమోదు చేసినట్లు SI చిన్న పెద్దయ్య తెలిపారు.

ఉమ్మడి కడప జిల్లాలో TDPకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే రమేష్ రెడ్డి పార్టీని వీడారు. ప్రస్తుతం కమలాపురం మాజీ MLA వీర శివారెడ్డి YCPలోకి చేరుతారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. కమలాపురం నుంచి 3సార్లు MLAగా గెలిచారు. TDP టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. దీంతో TDPని వీడుతున్నాని సోమవారం ఓ సందర్భంలో స్పష్టం చేశారు. దీంతో ఆయన YCPలో చేరుతారా లేక కాంగ్రెస్ గూటికి వెళ్తారా అనేది చూడాలి.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయని ఆలయ అధికారులు సోమవారం వెల్లడించారు. ఏప్రిల్ 16న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయం నుంచి అన్ని విభాగాల నోడల్ అధికారులతో కలిసి సాధారణ ఎన్నికల సన్నద్ధతపై అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), ఈ ఆర్వోలతో వీసీ నిర్వహించారు.

కడప: యోగి వేమన యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాల1, 2, 4, 6 సెమిస్టర్ల విద్యార్థులకు ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి తెలిపారు. మొదటి సెమిస్టర్ (2023- 24), బ్యాచ్, 2వ సెమిస్టర్ (2016-17), (2020-21), (2023-24) బ్యాచ్ లు, 4వ సెమిస్టర్ (2016-17), (2023-24) బ్యాచ్, 6వ సెమిస్టర్ (2016-17) విద్యార్థులకు పరీక్షలు ఉంటాయన్నారు.

ప్రస్తుత ఎన్నికలలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే సీట్లను అమ్ముకున్నారని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆరోపించారు. కోగటంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. 4 సార్లు ఓడి, ప్రజాదరణ లేని పుత్తా కుటుంబానికి ఏ విధంగా టికెట్ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సీనియార్టీని కాదని డబ్బుకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

రాజంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. నంద్యాలకు చెందిన రేణుక కొత్త బోయనపల్లి సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. రేణుక సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకుంది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో బలవంతంగా తీసి చూడగా ఉరివేసుకుని చనిపోయినట్లుగా గుర్తించామని హాస్టల్ సిబ్బంది తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో పలు అనుమానాలను సీబీఐ నివృత్తి చేయాలని నిందితుడు శంకర్ రెడ్డి కుమారుడు డా.చైతన్య రెడ్డి డిమాండ్ చేశారు. కడపలో ఆయన ఈ కేసులో ఉన్న అనుమానాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. హత్య చేశానన్న దస్తగిరిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అతను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేయడం సరికాదన్నారు. అసలైన నిందితులని అరెస్టు చేయాలన్నారు.

పెండ్లిమర్రి మండలం, సంత కొవ్వూరు చెందిన మంటింటి లక్ష్మీదేవి (36) రైలులో ప్రయాణిస్తూ మృతి చెందినట్లు మంచిర్యాల జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను తెలంగాణలోని బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వరి చర్చికి తీసుకొచ్చారు. ప్రార్థనల్లో పాల్గొన్న లక్ష్మీదేవి తిరిగి రైలులో వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.