India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లాలో వైసీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రాజీనామా పత్రాన్ని పంపించారు. ఎమ్మెల్యే సీటు ఇస్తానన్న హామీని ముఖ్యమంత్రి మరిచారని అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. కనీసం కలవడానికి కూడా తనకు జిల్లా నాయకులు అపాయింట్మెంట్ ఇప్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజుపాలెం మండలంలోని టంగుటూరు, వెలవలి, వెంగళయపల్లి, కుమ్మరపల్లె, పర్లపాడు, గోపల్లె గ్రామాల్లోని సచివాలయాలకు చెందిన 46 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. సోమవారం వారు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు రాజీనామా పత్రాలను అందించారు. వారు మాట్లాడుతూ.. తమను పింఛన్లను పంపిణీ చేయకుండా కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారన్నారు. తామంతా రాజీనామా చేసి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తామన్నారు.

రాజుపాలెం మండలంలోని టంగుటూరు, వెలవలి, వెంగళయపల్లి, కుమ్మరపల్లె, పర్లపాడు, గోపల్లె గ్రామాల్లోని సచివాలయాలకు చెందిన 46 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. సోమవారం వారు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు రాజీనామా పత్రాలను అందించారు. వారు మాట్లాడుతూ.. తమను పింఛన్లను పంపిణీ చేయకుండా కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారన్నారు. తామంతా రాజీనామా చేసి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తామన్నారు.

కడప జిల్లాలో వైఎస్ షర్మిల బస్సు యాత్రను చూస్తుంటే తమకు జాలి, బాధ వేస్తోందని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మేయర్ సురేశ్ బాబు ఎద్దేవా చేశారు. మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో జగనన్న సోదరిగా ప్రచారానికి వచ్చినప్పుడు జిల్లా ప్రజలు ఆమెకు ఇచ్చిన గౌరవం, పట్టిన బ్రహ్మరథం చూసి ఈరోజు జరుగుతున్న బస్సు యాత్రను చూస్తుంటే జాలేస్తుందన్నారు. ఇప్పటికైనా షర్మిలమ్మ తెలుసుకోవాలన్నారు.

కడపలో ప్రసిద్ధి చెందిన పెద్ద దర్గాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం దర్గాలోని హజరత్ ఖ్వాజా సయ్యద్ షా యద్దుల హుసైని చిస్టివుల్ ఖాద్రీ ఉరుసులో భాగంగా నిన్న రాత్రి గంధ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మంత్రి అంజాద్ బాషాతో కలిసి రెహమాన్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని పాల్గొన్నారు.

రైల్వే కోడూరు చెందిన గోను గొడుగు శివ సురేంద్ర తన తండ్రి దశ దినకర్మకు కుటుంబంతో కలిసి శ్రీకాకుళం నుంచి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఆదివారం బాపట్ల జిల్లా గుడిపాడు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో చిన్నారి ధార్మిక అక్కడికక్కడే మృతి చెందింది. సురేంద్రతో పాటు ఆయన భార్య , కొడుకు, తల్లి నాగేంద్రమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.

అన్నమయ్య జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సన్నద్ధం కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ రిటర్నింగ్ అధికారులు, జిల్లా మండల స్థాయి నోడల్ అధికారులను ఆదేశించారు. అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ అంశంలో తీసుకున్న చర్యలపై నియోజకవర్గం వారీగా కూలంకషంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షించారు.

మండల కేంద్రమైన సిద్దవటం ఎగువపేటకు చెందిన సోమిశెట్టి రంజిత్(32) అనే యువకుడు పురుగు మందు తాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు సిద్దవటం ఎస్సై పెద్ద ఓబన్న తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. యువకుడికి వివాహం కాలేదని దీంతో మనస్తాపం చెందడని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం తన బైక్ పై పురుగు మందు తీసుకెళ్లి నిత్యపూజ కోనకు వెళ్లే రహదారిలో తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు.

ఎన్నికల్లో షర్మిలకు డిపాజిట్ కూడా దక్కదని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. ఆదివారం మైదుకూరులో ఆయన మాట్లాడుతూ.. వివేకానంద రెడ్డి హత్య విషయంలో అవినాశ్ రెడ్డిపై షర్మిల ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారం, లేదా వివేకానంద రెడ్డి రెండో వివాహం వ్యవహారం వల్లే హత్య జరిగి ఉండొచ్చని తెలిపారు. షర్మిల, సునీత ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.

ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్ యాదవ్ ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. నిందితులంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులేనని ఆమె ఆరోపించారు. భూమి కోసం అవినాష్ అనుచరులే హత్య చేశారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.