Y.S.R. Cuddapah

News April 5, 2024

బ్రహ్మంగారిమఠం: వడ దెబ్బతో వృద్ధుడు మృతి

image

బ్రహ్మంగారిమఠం మండలం చెంచయ్యగారిపల్లెకు చెందిన రజకుడు పొంగూరు సుబ్బయ్య(65)అనే వ్యక్తి వడ దెబ్బకు గురై మృతి చెందాడు. గురువారం పింఛను కోసం మల్లేపల్లి సచివాలయం వద్దకొచ్చి వృద్ధాప్య పింఛను తీసుకున్నాడు. ఈ క్రమంలో ఎండధాటికి వడదెబ్బకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురైన సుబ్బయ్యను శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు 108లో మైదుకూరుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

News April 5, 2024

కడప MPగా పోటీ చేయడానికి కారణం చెప్పిన షర్మిల

image

కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఓ వైపు YSR బిడ్డ, మరోవైపు వివేకాను హత్య చేయించిన వ్యక్తి కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి. వివేకాను హత్య చేయించిన వారికి వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని నేను తట్టులోక పోయాను. హంతకులు చట్టసభల్లో ఉండకూడదు. అందుకే నేను కడప బరిలోకి దిగుతున్నా’ అని బద్వేల్ నియోజకవర్గ ప్రచారంలో షర్మిల అన్నారు.

News April 5, 2024

ప్రొద్దుటూరు: తనిఖీల్లో బంగారు ఆభరణాలు సీజ్

image

ప్రొద్దుటూరులోని వాసవి సర్కిల్లో వాహనాలను తనిఖీ చేస్తుండగా 830 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశామని డీఎస్పీ మురళీధర్ తెలిపారు. గురువారం వన్ టౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్ఐ మంజునాథ వాసవి సర్కిల్లో తనిఖీలు చేపట్టారన్నారు. పట్టణానికి చెందిన నేలటూరు ఉబేదుల్లా కారును తనిఖీ చేస్తుండగా 830 గ్రాముల బంగారు ఆభరణాలను ఉన్నాయని, వాటికి బిల్లులు చూపనందున సీజ్ చేశామన్నారు. వీటి విలువ సుమారు రూ.54 లక్షలు అన్నారు.

News April 5, 2024

కడప: బైకుపై నుంచి పడి యువకుడి మృతి

image

పోరుమామిళ్ల మండలం పరిధిలోని మల్లిరెడ్డిపల్లి మలుపు వద్ద ప్రమాదవశాత్తు స్కూటర్‌పై నుంచి పడి కవలకుంట్ల హరిజనవాడ గ్రామానికి చెందిన వెంకటయ్య మృతి చెందాడని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. పోరుమామిళ్ల నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలైన వెంకటయ్యను పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News April 5, 2024

కడప: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

image

రాజుపాలెం మండలం కూలూరు గ్రామం కుందూ నది వద్ద ట్రాక్టర్ కిందపడి డి.పెద్ద ఓబులేసు (35) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ తులసీ నాగప్రసాద్ తెలిపారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడుకు చెందిన పెద్ద ఓబులేసు పొలానికి మట్టి కోసం ట్రాక్టర్ తీసుకొని కుందూ నది వద్దకు వచ్చారన్నారు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి గాయపడిన అతడిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడన్నారు.

News April 5, 2024

వైసీపీ ప్రభుత్వంలోనే మైనారిటీల అభివృద్ధి: అవినాశ్

image

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలోనే మైనారిటీల అభివృద్ధి సాధ్యమైందని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. కడప వినాయక నగర్ వద్ద ఆటో గ్యారేజ్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 100 ముస్లిం కుటుంబాలు వైసీపీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

News April 4, 2024

కాశినాయన: వివాహిత ఆత్మహత్య

image

కాశినాయన మండలం కొండరాజుపల్లికి చెందిన సునీత(22) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈమెకు రెండేళ్ల క్రితం వివాహమైంది. భర్త సిద్దులు తెలంగాణ రాష్ట్రంలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సునీత గురువారం ఇంటికి వచ్చింది. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్ఐ కాశన్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

News April 4, 2024

చాపాడు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కుందూ బ్రిడ్జి సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కర్నూలులో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్ఐ కొండారెడ్డి వివరాల మేరకు.. మైదుకూరు  నానుబాలపల్లెకు చెందిన పందిటి చెంచయ్య (56) ప్రొద్దుటూరు నుంచి మైదుకూరుకు వెళుతుండగా వెనుక వైపున వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చెంచయ్యకు బలమైన గాయాలు కాగా, చికిత్స కోసం కర్నూలుకు తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.

News April 4, 2024

కడప: శ్రీనివాస్ యాదవ్ హత్య కేసులో సిట్ ఏర్పాటు 

image

పెండ్లిమర్రి మండలం యాదవాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు హత్య కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో అడిషనల్ SP వెంకట్రాముడు నేతృత్వంలో SP సిద్దార్థ్ కౌశల్  సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెండ్లిమర్రి ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  

News April 4, 2024

రాజ్యసభ ఎంపీగా మేడా ప్రమాణం

image

నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఢిల్లీలో గురువారం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజంపేటకు చెందిన మేడా రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం భారత ఉపరాష్ట్రపతి ఆయనకు అభినందనలు తెలిపారు.