Y.S.R. Cuddapah

News April 4, 2024

కడప జిల్లాలో బెంబేలెత్తిస్తున్న భానుడు

image

జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం రాష్ర్టంలోనే అత్యధికంగా ఒంటిమిట్టలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎండ ప్రభావానికి వృద్ధులు, చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు మధ్యాహ్నం బయటికి రావద్దని హెచ్చరించారు.

News April 4, 2024

YVU: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

image

యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పట్టాలు పొందడానికి దరఖాస్తు స్వీకరణ గడువు నేటితో (ఈ నెల 4వ తేదీతో) ముగియనుందని అధికారులు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 8వ తేదీ వరకు ఉంటుందన్నారు. వివిధ డిగ్రీల పట్టాల కోసం ఇప్పటివరకు 11725 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

News April 4, 2024

కడప: పింఛన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృత్యువాత

image

పింఛన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటనలో పులివెందుల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. సింహాద్రిపురం మండలం లోమడ గ్రామానికి చెందిన నారాయణమ్మ (70) బుధవారం పింఛన్ కోసం సచివాలయానికి వెళుతూ దారిలో వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి మృతి చెందింది.

News April 4, 2024

కడప: వాహన తనిఖీల్లో రూ.10 లక్షలు సీజ్

image

కొండాపురం మండలం కె.సుగుమంచిపల్లె చెక్ పోస్ట్ వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు రూ.10 లక్షల నగదును సీజ్ చేశారు. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఈ నగదును స్వాధీన పరచుకున్నారు. అనంతపురం నుంచి ప్రొద్దుటూరుకు కారులో ఓ మహిళ వెళుతుండగా ఆమె నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News April 4, 2024

కడప: వడదెబ్బతో లారీ డ్రైవర్ మృతి

image

వడదెబ్బతో తెలంగాణకు చెందిన లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం బద్వేల్‌లో జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన లారీ డ్రైవర్ అశోక్ మంగళవారం ఉదయం లారీ మరమ్మతులకు గురి కావడంతో బద్వేలులో నిలిచిపోయాడు. బుధవారం మధ్యాహ్నం అతడు మృతి చెందడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 4, 2024

అధికారులపై చర్యలు తీసుకోవాలి: వాసు

image

కడప జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న అధికార వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు అమరావతిలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో కొంతమంది అధికారులు వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ టీడీపీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారని వినతి పత్రంలో తెలిపారు.

News April 3, 2024

ప్రొద్దుటూరు: 18 మంది వాలంటీర్లు రాజీనామా

image

ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామ సచివాలయానికి చెందిన 18 మంది వాలంటీర్లు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలు సచివాలయ అడ్మిన్ కార్యదర్శికి వారు అందించారు. వాలంటీర్లు మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించకుండా టీడీపీ నాయకుల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం తమను అడ్డుకుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని, ఎంపీగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు.

News April 3, 2024

అవినాశ్ తప్పు చేశాడని తేలితే రాజకీయాలు వదిలేస్తా: రాచమల్లు

image

MP వైఎస్ అవినాశ్ రెడ్డి తప్పు చేశాడని తేలితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. అవినాశ్ రెడ్డి హత్య చేశాడా లేదా అనేది న్యాయ స్థానం నిర్ణయిస్తుందన్నారు. అవినాశ్ తప్పు చేశాడని తేలితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

News April 3, 2024

5 నుంచి కడప జిల్లాలో వైఎస్ షర్మిల బస్సు యాత్ర

image

ఈ నెల 5 నుంచి కడప జిల్లాలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ
పార్టీ నాయకులు తెలిపారు. 5 నుంచి 12 వరకు 8 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 5, 6 తేదీలలో బద్వేలు, కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10, 11న పులివెందుల, 12న జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో బస్ యాత్ర చేపట్టనున్నారు.

News April 3, 2024

కడప: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

చక్రాయపేట మండల పరిధిలోని సురభి గ్రామం నాగుల గుట్టపల్లెలో బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలోని జవహర్ రోజ్ గార్ భవనం వద్ద వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.