Y.S.R. Cuddapah

News February 9, 2025

కడప జిల్లా ప్రజలు జాగ్రత్త..!

image

కడప జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారం మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యూడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న కడప జిల్లాలో గరిష్ఠంగా 34.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని, తగిన మోతాదులో నీరు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News February 9, 2025

పులివెందులలో పులి కలకలం.. వాస్తవం ఇదే.!

image

పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామంలో పులి అడుగులు కనిపించాయని వార్తలు వచ్చాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్, పోలీస్ అధికారులు శనివారం రాత్రి పొలాల్లో పర్యటించారు. గ్రామస్థులతో కలిసి పులి సంచరిస్తుందని చెప్పిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ అడుగులు పులివి కావని నిర్ధారించారు. ఈ తనిఖీల్లో సీఐ నరసింహులు, ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

News February 8, 2025

జమ్మలమడుగు: ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

image

జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా మైలవరం మండలం వేపరాలకు చెందిన నాగయ్య(42) తాడిపత్రి నుంచి జమ్మలమడుగు వచ్చేందుకు బస్సు ఎక్కారు. కొలిమిగుండ్ల వద్ద గుండెపోటుకు గురైన ఆయన సీట్లో నుంచి కుప్పకూలి కింద పడ్డారు. అనంతరం ప్రయాణికులు పరిశీలించగా అప్పటికే మృతిచెందారు.

News February 8, 2025

కడప విమానాశ్రయ అభివృద్ధికి కార్యాచరణ

image

పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా, నిబంధనలకు లోబడి.. కడప విమానాశ్రయ అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీల సమావేశం జరిగింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ విమానాశ్రయ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ చర్చించింది.

News February 8, 2025

కడప: వేసవిలో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి.!

image

వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి.. తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వేసవిలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి అవసరాల సన్నద్ధతపై సంబంధిత మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులతో శుక్రవారం సమీక్ష జరిపారు. పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా పనులను పూర్తి చేయాలన్నారు.

News February 7, 2025

ప్రొద్దుటూరులో యువకుడి హత్య.?

image

ప్రొద్దుటూరు రామేశ్వరంలోని ఇటుకల బట్టీలలో యువకుడి ఆత్మహత్య అంటూ మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే తమ కుమారుణ్ని ఎవరో హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటే పోలీసులు వెళ్లకుండానే ఎలా మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువచ్చారని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

News February 7, 2025

DAY 5: కడప కలెక్టర్‌ను కలిసిన విద్యార్థులు

image

ప్రొద్దుటూరు మండలం గోపవరం పశు వైద్య కళాశాల విద్యార్థుల నిరసన ఐదో రోజుకు చేరింది. ఇవాళ వెటర్నరీ విద్యార్థులు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరిని, అలాగే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కలిసి తమ సమస్యలు తెలుపుకున్నారు. తమ డిమాండ్లను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వీలైనంత త్వరగా తమకు స్టైఫండ్ ఇప్పించాలని కోరారు. లేదంటే చలో అమరావతి నిర్వహిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

News February 7, 2025

కడప: విచారణ అధికారి ఎదుట హాజరైన దస్తగిరి

image

తనని జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ ఇబ్బంది పెట్టారని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కడప జైలులో ఇవాళ విచారణ అధికారి రాహుల్ శ్రీరాం ఎదుట దస్తగిరి హాజరయ్యారు. ఫిర్యాదులో డాక్టర్ చైతన్య రెడ్డి తనని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. దస్తగిరి తర్వాత చైతన్య, ప్రకాశ్ విచారణకు హాజరుకానున్నారు.

News February 7, 2025

కడప: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

image

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజామున ‘స్టాప్, వాష్ అండ్‌ గో’ కార్యక్రమం నిర్వహించారు. రహదారులపై వెళ్తున్న లారీలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు డ్రైవర్లకు ఆపి ముఖాలు కడుక్కుని వెళ్ళమని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు.

News February 7, 2025

పులివెందుల: రాజహంస వాహనంపై శ్రీనివాసుడు

image

శ్రీ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా పులివెందులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి రాజ హంస వాహనంపై సరస్వతీ రూపంలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.