Y.S.R. Cuddapah

News December 11, 2024

జిల్లాలో తాగునీటి ఎద్దడి రాకూడదు: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య రాకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తాగునీటి సమస్యలపై ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో సమీక్షను కలెక్టర్ నిర్వహించారు. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, శాశ్వత నీటి వనరులను గుర్తించాలని అన్నారు.

News December 10, 2024

మరోసారి ఘాటెక్కిన కడప రాజకీయం

image

కడపలో రాజకీయం మరోసారి ఘాటెక్కింది. తాగునీటి సమస్య లేకున్నా ఉన్నట్లు MLA మాధవి చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ MLA అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. దీనికి జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ‘రా వీధుల్లోకి వెళ్లి ప్రజలను అడుగుదాం. ఇలా చెప్తే ప్రజలు గాడిద మీద ఊరేగిస్తారు’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కడపకు వచ్చిన సందర్భంగా MLA నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వివాదం మొదలైంది.

News December 10, 2024

కుందూ నదిలో పడి యువకుడు మృతి

image

కడప జిల్లా చాపాడు మండల కేంద్రమైన అదే గ్రామానికి చెందిన పూజారి సురేశం(32) అనే యువకుడు కుందూ నదిలో పడి మృతి చెందాడు. 10 రోజుల క్రితం దుబాయ్ నుంచి చాపాడుకు వచ్చిన సురేశ్ సోమవారం మధ్యాహ్నం కుందూ నది వద్దకు వెళ్లాడు. ఏం జరిగిందో తెలీదు గానీ సురేశ్ నదిలో కొట్టుకుపోవటాన్ని గమనించిన స్థానికులు కుటుంబానికి తెలిపారు. గాలింపు చేపట్టగా మంగళవారం ఉదయం మృతదేహం బయటపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 10, 2024

బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠినంగా వ్యవహరిస్తాం: ఎస్పీ

image

పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో బియ్యం అక్రమ రవాణా జరగకుండా, రాయచోటి, మదనపల్లి, రాజంపేట, సబ్ డివిజన్ ప్రాంతాలలో రైస్ మిల్లులు, గోడౌన్లపై, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ, పోలీసులకు స్పెషల్ టీంల సహకారంతో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

News December 10, 2024

14, 15వ తేదీలలో వైవీయూ రెండో దశ అంతర కళాశాలల క్రీడా పోటీలు

image

వైవీయూ అంతర్ కళాశాలల పురుషులు మహిళల క్రీడా పోటీలు ప్రొద్దుటూరు డా.వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 14, 15 తేదిల్లో నిర్వహించనున్నట్లు క్రీడా బోర్డు కార్యదర్శి డా.కె. రామసుబ్బారెడ్డి తెలిపారు. పురుషులు మహిళలకువాలీబాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ పోటీలు ఉంటాయన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేవారు ఈ ఏడాది జులై 1వ తేదీ నాటికి 17 – 25 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. వైవీయూ అనుబంధ కళాశాలలో చదువుతూ ఉండాలని తెలిపారు.

News December 9, 2024

రాయచోటిలో టీచర్‌ మృతి.. విద్యార్థుల అరెస్ట్

image

రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ ZPHSలో ఉపాధ్యాయుడు అహ్మద్‌(42) మృతి కేసులో ఇద్దరు విద్యార్థులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మైనర్లు కావడంతో శనివారం వారిని కోర్టులో హాజరుపరిచి జువైనల్ హోమ్‌కు తరలించారు. 9వ తరగతి విద్యార్థులకు పాఠం చెబుతుండగా అల్లరి చేస్తుండడంతో టీచర్ వారిని మందలించారని, దీంతో విద్యార్థులు కోపోద్రిక్తులై  టీచర్‌పై దాడి చేసినట్లు సమాచారం. 

News December 9, 2024

పులివెందుల యువతిని పొడిచిన వ్యక్తి అరెస్ట్?

image

కడప జిల్లా వేముల మండలం వి కొత్తపల్లికి చెందిన షర్మిల అనే యువతిపై అదే గ్రామానికి చెందిన కుల్లాయప్ప శనివారం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలు కాగా తిరుపతి రుయాకు తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలతో SI ప్రవీణ్ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారై ఓ ఇంట్లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా ఈ విషయంపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత సీరియస్ అయిన విషయం తెలిసిందే.

News December 9, 2024

కడప: ఉత్సాహంగా హ్యాండ్ బాల్ కడప జిల్లా జట్టు ఎంపికలు

image

అనంతపురం జిల్లాలో ఈనెల 14, 15వ తేదీలలో రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ హ్యాండ్ బాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కడపలోని స్థానిక డీఎస్ఏ క్రీడా మైదానంలో కడప జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో హ్యాండ్ బాల్ కడప జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చిన్నపరెడ్డి, సింధూరి, కోచ్‌లు మునాఫ్, శివ తదితరులు పాల్గొన్నారు.

News December 8, 2024

వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డికి 41ఏ నోటీసు

image

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవీంద్రారెడ్డి కేసుకు సంబంధించి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి మరోసారి పులివెందుల పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులలో సోమవారం ఉదయం 10 గంటలకు కడప సైబర్ సెల్ కార్యాలయానికి హాజరుకావాలని పేర్కొన్నారు. గతంలో కూడా పులివెందుల పోలీసులు రాఘవరెడ్డికి నోటీసులు అందించారు. అయితే రాఘవరెడ్డి విచారణకు హాజరు కాలేదు.

News December 8, 2024

మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలతో ఒరిగిందేమీ లేదు: రాచమల్లు

image

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలతో విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. అమ్మబడి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని, నాడు-నేడు పనులను నిలిపేశారన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తగ్గిపోతోందని పేర్కొన్నారు.