India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రొద్దుటూరు సుందరాచార్యుల వీధిలోని ఓ లాడ్జీలో సోమవారం ఉదయం దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తలపై బీరు సీసాతో కొట్టి హత్య చేసి ఉండచ్చని లాడ్జీ సిబ్బంది చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతునికి 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
వైవీయూ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సోమవారం జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను రద్దు చేసినట్లు వైవీయూ పరీక్షల నియంత్రణ అధికారి కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రద్దయిన పరీక్ష నిర్వహణ తేదీని తర్వాత తెలియజేస్తామన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నేడు జరగాల్సిన పరీక్షలు మాత్రమే రద్దు చేశామన్నారు.
రేపు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని (గ్రీవెన్సు) తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్ కారణంగా సోమవారం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమున్నందున కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.
అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా డిసెంబర్ 2న సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
బద్వేల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోపాలస్వామిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. తమ భూములు గోపాల స్వామి అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారంటూ మేడిమాల సుశీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నంపల్లిలోని డీకేటీ భూములను ఆధార్ కార్డు ట్యాంపరింగ్‌తో తన పేరుపై రిజిస్టర్ చేసుకున్నడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోపాలస్వామి, సబ్ రిజిస్టర్ రామలక్షుమ్మతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది.
గండికోటకు వచ్చే పర్యాటకుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం దారుణమని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ అన్నారు. కడప DYFI జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గండికోట అభివృద్ధికి దాదాపు రూ.70 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారన్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే మరోవైపు పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
కోడి కోసం వెళ్లిన వ్యక్తి చనిపోయిన ఘటన కడప జిల్లాలో జరిగింది. కొండాపురంలోని వడ్డెవాళ్ల కాలనీకి చెందిన కుడుమల నాగేశ్(52) ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కోళ్ల కోసం మిద్దె పైకి ఎక్కారు. ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
భర్త చనిపోయిన మూడు రోజులకే భార్య చనిపోయిన విషాద ఘటన ఇది. కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లెకు చెందిన సాకే నాగరాజు నవంబర్ 26న చనిపోయారు. ఈక్రమంలో ఆయన భార్య నాగసుధ(36) భర్త సమాధి చూడటానికి బైకుపై బయల్దేరారు. మార్గమధ్యలో స్పీడ్ బ్రేకర్ వద్ద కిందపడి గాయపడ్డారు. కడపలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు.
ప్రజలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ‘కొంతమంది అక్రమార్కులకు రూ.కోట్ల రూపాయలను సంపాదించే ఆదాయ వనరుగా రేషన్ బియ్యం మారింది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ దందా కొనసాగుతోంది. చాలా మంది రేషన్ డీలర్లకే బియ్యాన్ని రూ.10కి ఇచ్చేస్తున్నారు’ అని చెప్పారు.
కడప జిల్లాలో శనివారం దారుణ హత్య జరిగింది. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామ సమీపంలోని సుగాలి తండాలో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కుళ్లాయప్ప నాయక్ తన కుమారుడు రాజ్ కుమార్ నాయక్‌ను దారుణంగా కొట్టి హతమార్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.