India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లా పెద్దముడియం మండలంలో శనివారం విషాదం నెలకొంది. పెద్ద పసుపుల గ్రామానికి చెందిన పెరుమాళ్ల దిలీప్(25) జమ్మలమడుగు నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన డోజర్ ఢీకొంది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వినాయక చవితి పండుగ నాడే యువకుడు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒంటిమిట్ట కోదండ రామాలయం జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి ఆర్జిత సేవలను రెండు నెలల పాటు రద్దు చేసినట్లు తనిఖీ అధికారి నవీన్ కుమార్ శుక్రవారం తెలిపారు. గర్భాలయంలోకి భక్తులను నిలిపివేస్తామని తెలిపారు. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా నిర్వహించే కల్యాణం, అర్చన సేవలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని కోరారు.
ఉమ్మడి కడప జిల్లా పరిధిలో నేడు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. కడప, అన్నమయ్య జిల్లాల్లోని పలు మండలాల్లో ఈ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
గుంటూరు-తిరుపతి-గుంటూరు మధ్య నడుస్తున్న గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు రద్దు చేసినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. గిద్దలూరు, దిగువమెట్ట మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గుంటూరు, తిరుపతి మధ్య నడిచే రైలు 17 నుంచి 21 వరకు, తిరుపతి, గుంటూరు మధ్య నడిచే రైలు 18 నుంచి 21 వరకు రద్దు చేశారన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ కోరారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కడప కోటిరెడ్డి సర్కిల్ వద్ద నిర్వహించిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసి నగరపాలక సంస్థ అధికారులను అభినందించారు.
కడప జిల్లా ముద్దనూరుకి చెందిన సుంకన్న అనే వ్యక్తి రేపు పండగ కావడంతో హాస్టల్ నుంచి పిల్లలను తీసుకురావడానికి మైలవరం వచ్చాడు. అనంతరం ఇద్దరు కూతుర్లతో ముద్దనూరు వెళ్తుండగా.. మార్గమధ్య సుంకన్నకు BP డౌన్ అయి బైక్ అదుపు తప్పి పిల్లలతో సహా కింద పడ్డాడు. దీంతో 5వ తరగతి చదువుతున్న పెద్ద కూతురు సుమ (10) అక్కడికక్కడే మృతి చెందగా.. 2వ కూతురు సుప్రియకి తీవ్ర గాయాలు కాగా.. తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి.
వైవీయూ జియాలజీ, ఎర్త్ సైన్స్ అధ్యాపకులు, విద్యార్థులు దువ్వూరు మండలం రామాపురం వ్యవసాయ భూమిని సందర్శించారు. రైతు మానుకొండ వెంకట శివ వ్యవసాయ భూమిలో 15 అడుగుల లోతు మేర కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా జియాలజీ శాఖ సహ ఆచార్యులు డాక్టర్ శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ.. సున్నపురాతి పొరలు భూగర్భంలో జరిపిన చర్య ఫలితంగా భూమి కుంగిందన్నారు.
పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శివశంకర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత నెలరోజులుగా ఒక్క కాన్పు కేసు కూడా నమోదు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబర్ మాసంలో ఆరోగ్య కేంద్రంలో కనీసం 10 కాన్పులు నమోదయ్యేలా స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

Sorry, no posts matched your criteria.