India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పట్టణ పరిధిలోని బోస్ నగర్ ఏరియాలో గ్యాస్ సిలిండర్ పేలి తల్లిబిడ్డలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. బోస్‌నగర్ ఏరియా, తోగాట వీధిలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో తల్లితోపాటు ఇద్దరు బిడ్డలు మృతి చెందినట్లు తెలిపారు. ఈ పేలుడు పై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హౌసింగ్ పథకంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గృహ నిర్మాణాలను నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కాంట్రాక్టర్లతో గృహ నిర్మాణాలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పక్క గృహాల నిర్మాణంలో నిర్దేశిత లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కలసపాడు మండలంలోని మామిళ్లపల్లె వద్ద గురువారం రాత్రి కారులో వెళ్తున్న మహిళలపై దౌర్జన్యం చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. గురువారం రాత్రి లింగారెడ్డిపల్లెలో జరుగుతున్న వివాహానికి మహానంది పల్లె గ్రామానికి చెందిన నలుగురు మహిళలు, మరో ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తుండగా మామిళ్లపల్లె వద్ద 5 మంది యువకులు కారులోని మహిళలపై దౌర్జన్యం చేశారు.
ప్రొద్దుటూరులోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో శనివారం వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రొద్దుటూరు ఐఎంఏ అధ్యక్షుడు డా. మహేష్, కార్యదర్శి డాక్టర్ హరీష్ కుమార్ తెలిపారు. కలకత్తాలో మహిళ వైద్యురాలిపై జరిగిన అమానుష సంఘటనను నిరసిస్తూ ఐఎంఏ ఒకరోజు వైద్య సేవల బంద్‌కు పిలుపునిచ్చిందని, ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యవసర సేవలు మినహా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
పేదల సొంతింటి కల సహకారం చేసే దిశగా హౌసింగ్ పథకంలో లబ్ధిదారులకు పెండింగ్ లేకుండా గృహ నిర్మాణాలను నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులు ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ పథకంలో భాగంగా ఇప్పటికే గృహాలు మంజూరై ఇంటి నిర్మాణ ప్రక్రియలో ఉన్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
కడప జిల్లా వ్యాప్తంగా పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాలకు సంబంధించిన 28 మంది సీఐలకు స్థానచలనం కల్పిస్తూ కాసేపటి క్రితం ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో డీఐజీ పేర్కొన్నారు.
ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1990 నుంచి 2015 వరకు చదివి ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులకు యూనివర్సిటీ మరొక్కసారి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
వరుస సెలవులు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి నుంచి కడప మీదుగా కాచిగూడకు, రేపు ట్రైన్ నెంబర్ 07456 ప్రత్యేక సర్వీస్ నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. తిరుపతిలో సాయంత్రం 7.50కి బయలుదేరి రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, కర్నూల్, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల మీదుగా.. మరుసటి రోజు ఉదయం 9.30కి కాచిగూడ చేరుకుంటుందన్నారు .
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం హస్తవరం గ్రామానికి చెందిన రత్నమ్మ (38) డెంగ్యూ జ్వరంతో శుక్రవారం మృతి చెందింది. మూడు రోజుల క్రితం ఆమెకు జ్వరం రావడంతో రాజంపేట, తిరుపతి లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ జ్వరం తగ్గలేదని, శుక్రవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందిందని వారు తెలిపారు. రాజంపేట ప్రాంతంలో ఇటీవల డెంగ్యూ జ్వరం భారీన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని పలువురు అన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం రెండు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని మాజీ సీఎం జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా వి.కోటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాగే పరిపాలిస్తే రెండేళ్లలో ప్రభుత్వం పడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని.. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్షించారు.
Sorry, no posts matched your criteria.